Chicken Rice Bowl : చికెన్ రైస్ బౌల్ రెసిపీ.. ఫిట్‌నెస్, బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్
Protein Recipes : హెల్తీగా చేసుకోవాలే కాని నాన్‌వెజ్ తింటూ కూడా హెల్తీగా బరువును తగ్గించుకోవచ్చు. టేస్టీగా తినగలిగే హెల్తీ చికెన్ రైస్ బౌల్ రెసిపీని ఎలా తయారు చేయాలంటే..
Chicken Rice Bowl Recipe : చికెన్ అంటే ఇష్టమా? కానీ మీ డైట్, ఫిట్‌నెస్‌లో దానిని ఎలా తీసుకోవాలో తెలియట్లేదా? అయితే మీరు ఈ చికెన్ రైస్ బౌల్ రెసిపీ ట్రై చేయండి. ఇది మీకు మంచి రుచిని అందించడంతో పాటు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి ఈ చికెన్ రైస్ బౌల్‌ని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? దీనివల్ల శరీరానికి అందే పోషకాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- చికెన్ - 150 గ్రాములు (బోన్‌లెస్)
- కారం - ఒకటిన్నర స్పూన్స్
- పసుపు - అరస్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర స్పూన్
- గరం మసాలా - 1 టేబుల్ స్పూన్
- పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
- నూనె - 10 ml
- సోయా సాస్ - అర టీస్పూన్
తయారీ విధానం
ముందుగా చికెన్‌ని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానిలో కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై ఫ్రైయింగ్ పాన్ పెట్టుకోవాలి. దానిలో నూనె వేసి.. ముందుగా మిక్స్ చేసుకున్న చికెన్ వేసి మూత పెట్టేయాలి. దానిలోని నీళ్లు బయటకు వచ్చి చికెన్ ఉడుకుతున్నప్పుడు మరోసారి కలిపి.. మళ్లీ మూతపెట్టేయాలి. నీరు పూర్తిగా పోయిన తర్వాత దానిలో సోయాసాస్ వేసుకోవాలి. బాగా కలిపి.. ఓ నిమిషం ఉడికిన తర్వాత స్టౌవ్ ఆపేయాలి.
రైస్ కోసం..
అన్నాన్ని వండుకుని.. దానిని 250 గ్రాములు కొలుచుకోవాలి. మిషన్ లేదు అనుకుంటే.. ఇంట్లో ఉండే గిన్నెతో కొలత తీసుకోవాలి. ఓ కప్పు నిండుగా రైస్ తీసుకుని.. అదే కొలతను ఫాలో అవుతూ ఉండాలి.
వెజ్ సలాడ్
కీరదోశను సన్నగా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి. క్యారెట్‌ని కూడా సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ 1 సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన కూరగాయలని, పచ్చిగా తినగలిగే వాటిని ఏవైనా తీసుకోవచ్చు. వాటిలో సాల్ట్, పెప్పర్ వేసుకుని కలుపుకోవాలి. మూడు టేబుల్ స్పూన్ల పెరుగు లేదా యోగర్ట్ వేసుకుని కలుపుకోవాలి. డ్రెస్సింగ్ కోసం మీకు ఇష్టమైన కెచప్, సాస్, రాంచ్లో ఏదొకటి వేసుకోవాలి. అన్ని మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి.
చికెన్ రైస్ బౌల్
ఇప్పుడు ప్లేట్ తీసుకుని దానిలో కప్పు రైస్.. ఓ పక్క చికెన్, మరో పక్క వెజ్ సలాడ్ పెట్టుకుంటే.. టేస్టీ, హెల్తీ లంచ్ రెడీ. ఈ మొత్తం లంచ్‌లో కేలరీలు 600 గ్రాములు ఉంటాయి. ప్రోటీన్ 46 గ్రాములు, కార్బ్స్, 66 గ్రాములు, ఫ్యాట్స్ 20 గ్రాములు, ఫైబర్ 8 గ్రాములు ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే మీ రైస్ బౌల్‌ని ఇలా చేసుకున్నప్పుడు ముందుగా వెజ్ తినాలి. తర్వాత ప్రోటీన్, కార్బ్స్‌ని తీసుకోవాలి. ప్రోపర్గా డైట్ ఫాలో అయ్యేవారు ముందుగా ఫైబర్ తీసుకుని తర్వాత ప్రోటీన్, కార్బ్స్ తీసుకుంటారు. ఈ తరహా డైట్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.
Also Read : ఉదయాన్నే ఆ తప్పులు చేస్తే బరువు పెరిగిపోతారట.. మీరు Weight Loss కాకపోవడానికి రీజన్స్ అవేనేమో చెక్ చేసుకోండి