అన్వేషించండి

Student Visa: గుడ్‌ న్యూస్‌, స్టుడెంట్‌ వీసాలో మరో రెండు కొత్త కేటగిరీలు - ఇలా దరఖాస్తు చేసుకోండి

E-Student Visa: భారత ప్రభుత్వం రెండు కొత్త కేటగిరీ వీసాలను ప్రకటించింది. ఇప్పుడు, విదేశీ విద్యార్థులు మన దేశంలో ఉంటూ చదువుకోవడం మరింత సులభమవుతుంది.

Study in India: అంతర్జాతీయ విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం రెండు కొత్త రకాల వీసాలను ప్రకటించింది. అవి - 'ఇ-స్టూడెంట్ వీసా' (e-student visa), 'ఇ-స్టూడెంట్-ఎక్స్‌ వీసా' (e-student-x visa). ఈ కొత్త కేటగిరీల ప్రారంభంతో.. ఇతర దేశాల నుంచి వచ్చి, భారతదేశంలో ఉన్నత విద్య చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు మరింత సౌకర్యం చేకూరింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ కొత్త వీసా కేటగిరీలను ప్రకటించింది. విదేశీ విద్యార్థులు భారత ప్రభుత్వ 'స్టడీ ఇన్ ఇండియా' (Study in India - SII) పోర్టల్‌లోకి వెళ్లి ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. 

SII అంటే ఏంటి? 
భారతదేశానికి వచ్చి ఉన్నత చదువులు చదవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చొరవ కింద స్టడీ ఇన్ ఇండియా (SII) కార్యక్రమాన్ని & పోర్టల్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమం కింద.. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ, సైన్స్, అగ్రికల్చర్, ఆర్ట్, హ్యుమానిటీస్, లా, లాంగ్వేజ్ స్టడీస్, పారామెడికల్ సైన్స్, యోగా సహా వివిధ అంశాల్లో 8,000కు పైగా కోర్సులను అందించే 600కు పైగా సంస్థలు భాగస్వామ్యులుగా ఉన్నాయి.

ఇండియాకు వచ్చి చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు SII పోర్టల్‌లో వీసా కోసం అప్లై చేయాలి. ఈ పోర్టల్‌లో.. 'ఇ-స్టూడెంట్ వీసా' అనేది భారతదేశంలో చదువుకోవడానికి తమ పేర్లను నమోదు చేసుకునే విదేశీ విద్యార్థుల కోసం ప్రారంభించిన కేటగిరీ. 'ఇ-స్టూడెంట్-ఎక్స్ వీసా' అనేది ఇ-స్టూడెంట్ వీసా కలిగి ఉన్న వారిపై ఆధారపడిన వారి కోసం ప్రారంభించిన కేటగిరీ.

స్టుడెంట్‌ వీసా కోసం ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు
SII పోర్టల్ భారతదేశంలో దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక కోర్సులను అభ్యసించాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశ ప్రక్రియను సులభంగా మారుస్తుంది. విదేశీ విద్యార్థులు, https://indianvisaonline.gov.in/ పోర్టల్‌లోకి వెళ్లి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి SII ID అవసరం. కాబట్టి, ముందుగా SII పోర్టల్‌ నమోదు చేసుకోవాలి. భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా SII IDని కలిగి ఉండాలి. SII పోర్టల్‌లో విద్యార్థి పేరు, దేశం, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ వంటి సమాచారాన్ని అందించిన తర్వాత ఎస్‌ఎస్‌ఐ ఐడీ క్రియేట్‌ అవుతుంది. విద్యార్థి వీసాలు కోర్సు వ్యవధి ఆధారంగా జారీ అవుతాయి. భారతదేశంలో ఉంటూ వాటి కాల పరిమితిని పొడిగించుకోవచ్చు. 

స్టుడెంట్‌ వీసా పొందడానికి ఎవరు అర్హులు?
SII పోర్టల్‌లో లిస్ట్‌ అయిన ఏదైనా ఒక ఇన్‌స్టిట్యూట్ నుంచి అడ్మిషన్ ఆఫర్ పొందిన తర్వాత, సదరు విద్యార్థి ఇ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. మన దేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుంచి రెగ్యులర్ లేదా ఫుల్ టైమ్ ప్రాతిపదికన పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ లేదా ఏదైనా ఇతర కోర్సు చదవాలనుకునే విదేశీ వ్యక్తులకు ఈ వీసా జారీ చేస్తారు.

మరో ఆసక్తికర కథనం: స్వల్పంగా పెరిగిన గోల్డ్, రూ.లక్ష నుంచి తగ్గని సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ 

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget