ICC Test Rankings News: భారత్ కు షాకిచ్చిన ఐసీసీ ర్యాంకింగ్స్- 2016 తర్వాత తొలిసారి ఆ ర్యాంకుకు చేరిక
ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఎనిమిదేళ్ల తర్వాత భారత్ కు ఘోర పరాభవం దక్కింది. 2016 నుంచి ఇప్పటివరకు టాప్-2 ప్లేసుల్లో ఉంటూ వచ్చిన టీమిండియా తొలిసారి తన ర్యాంకింగ్స్ లో తన స్థానం దిగజారింది.
Team India BGT Update: ఆస్ట్రేలియా పర్యటనలో ఓడి సిరీస్ కోల్పోవడంతోపాటు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (World Test Championship) ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న భారత్ కు మరో షాక్ తగిలింది. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ కు మూడో స్థానానికి దిగజారింది. 2016 తర్వాత ఈ ర్యాంకుకు చేరుకోవడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. ముఖ్యంగా 2024 సెకండ్ హాఫ్ లో భారత్ ఆడిన ఎనిమిది టెస్టుల్లో ఆరింటిలో ఓడిపోయి, కేవలం ఒక్కదానిలో మాత్రమే గెలవడం ర్యాంకింగ్స్ పై ప్రభావం చూపించింది. మరో మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఇక ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరి జోరు మీదున్న ప్రొటీస్.. తాజాగా పాకిస్థాన్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేయడం కూడా కలిసొచ్చింది. దీంతో ర్యాంకింగ్స్ లో ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది.
🚨 TEAM INDIA SLIPS TO NO.3 IN THE ICC TEST RANKINGS. 🚨
— Mufaddal Bumrah (@mufaddal_bumrah) January 7, 2025
- South Africa have climbed to No.2. pic.twitter.com/EeRnaJgxvn
ఫైనల్ కు టాప్-2 జట్లే..
ఇక ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా టాప్ లో నిలిచింది. రెండోస్థానంలో ఉన్న సౌతాఫ్రికా కంటే 14 పాయింట్ల ఆధిక్యంలో ఉండటం విశేషం. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 122 పాయింట్లు ఉన్నాయి. సౌతాఫ్రికా (112), భారత్ (109), ఇంగ్లాండ్ (106), న్యూజిలాండ్ (96) టాప్-5లో ఉన్నాయి. శ్రీలంక (87), పాకిస్థాన్ (83), వెస్టిండీస్ (75), బంగ్లాదేశ్ (65), ఐర్లాండ్ (26) వరుసగా తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. దీంతో టాప్-2లో నిలిచిన ఆసీస్, ప్రొటీస్ జట్లే ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ ను ఆడనుండటం విశేషం. వచ్చే జూన్ లో లార్డ్స్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. డబ్ల్యూటీసీ టేబుల్లో ప్రస్తుతం సౌతాఫ్రికా టాప్ లో ఉండగా, ఆసీస్ రెండోస్థానాన్ని దక్కించుకుంది. భారత్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో వరుసగా మూడోసారి ఫైనల్ కు చేరుకోవాలని భావించిన భారత్ ఆశలు ఆవిరయ్యాయి.
ఐసీసీ అవార్డుకు బుమ్రా నామినేట్..
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా హవా కొనసాగుతోంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో 32 వికెట్లతో సత్తాచాటిన బుమ్రా, తాజాగా డిసెంబర్ నెలకుగాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. బీజీటీలో బుమ్రానే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అవార్డు దక్కించుకునేందుకుగాను ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, డ్యాన్ పాటర్సన్ (సౌతాఫ్రికా)లతో పోటీ పడనున్నాడు.
మరోవైపు సిడ్నీలో జరిగిన చివరి టెస్టులో గాయపడిన బుమ్రా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తను వచ్చేనెలలో జరిగే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగడంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దుబాయల్ ఈ టోర్నీ పోరును భారత్ మొదలు పెడుతుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్తాన్ లతో భారత్ తలపడుతుంది.
Also Read: BCCI Desicion On Seniors: రోహిత్ వాదనను పట్టించుకోని బీసీసీఐ.. సీనియర్లపై వేటుకు రంగం సిద్ధం!