అన్వేషించండి

BGT Update: ఆ లోపాలే బీజీటీలో భారత్ కొంపముంచాయా..? మేనేజ్మెంట్ మిస్టేక్స్ తో పదేళ్ల తర్వాత ఆసీస్ ఒడిలోకి ట్రోఫీ..!

BGT Update: ఆసీస్ పర్యటనలో సెలెక్షన్ లోపాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా తుది జట్టు కూర్పులో టీమిండియా చాలా విమర్శలు ఎదుర్కుంది. స్పిన్నర్లను ఆడించే విషయంలో ఇది స్పష్టంగా కనిపించింది.

Nitish Reddy News: ఆస్ట్రేలియా పర్యటనలో భారత తుదిజట్లు రూపకల్పనలో ఇబ్బందులు పడినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అటు బ్యాట్ ఇటు బంతితోనూ రాణించడంతో అతడిని అకామడేట్ చేయడానికి జట్టు కూర్పు లో కొంచెం గందరగోళం నెలకొందని పలువురు మాజీలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇన్ ఫామ్ బ్యాటర్ అవడంతోపాటు పేస్ బౌలింగ్ కూడా వేసే నితీశ్ ను ఆసీస్ పిచ్ లపై డ్రాప్ చేయాలని టీమ్ మేనేజ్మెంట్ అస్సలు ఆలోచించలేదని ఈ క్రమంలో స్పిన్నర్లతో ప్రయోగాలు చేసింది. దీంతో తొలి టెస్టులో స్పెషలిస్టు స్పిన్నర్ కమ్ ఆల్ రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ ని, రెండో టెస్టులో ఇదే కోటాలో రవిచంద్రన్ అశ్వన్ ని, మూడో టెస్టులో ఆ స్థానాన్ని రవీంద్ర జడేజా భర్తీ చేశారు. ఇక మూడో టెస్టు నుంచి చివరి టెస్టు వరకు జడేజా ఆడగా, ఐదో టెస్టులో అతనితోపాటు సుందర్ కూడా ఆడారు. ఇలా టీమ్ సెలెక్షన్ లో కాస్త గందరగోళం నెలకొంది. 

పరిస్థితులకు తగినట్టుగా...
తుదిజట్టు ఎంపికపై భారత మాజీ కోచ్ కమ్ ఆల్ రౌండర్ సంజయ్ బంగర్ వ్యాఖ్యానించాడు. పిచ్, వాతావరణ పరిస్థితులు బట్టి, తుది జట్టు కూర్పుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని, అయితే టీమిండియాలో అది లోపించిందని పేర్కొన్నాడు. ఇక నితీశ్ సత్తా చాటడంతో జట్టు ఎంపికలో ఒక రకమైన గందరగోళం నెలకొందని అభిప్రాయ పడ్డాడు. ఏదేమైనా సిసలైన పేస్ ఆల్ రౌండర్ రూపంలో నితీశ్ నిరూపించుకున్నాడని పలువురు వాదిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మక మెల్ బోర్న్ టెస్టులో అద్భుతమైన సెంచరీతో జట్టును ఇబ్బంది కర పరిస్థితి నుంచి నితీశ్ తప్పించడాని మాజీలు కొనియాడారు. సునీల్ గావస్కర్ లాంటి వెటరన్లయితే సెంచరీ సందర్భంగా స్టాండింగ్ ఒవేషన్ కూడా ఇచ్చారు. ఇక నితీశ్ బ్యాక్రౌండ్ స్టోరీ తెలిసి, రావి శాస్త్రి కామెంటరీలోనే కంటతడి పెట్టుకున్నాడు. 

సత్తాచాటిన నితీశ్..
ఏదేమైనా తనకు లభించిన సువర్ణావకాశాన్ని నితీశ్ రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో అరంగేట్రం చేసిన నితీశ్ నిలకడైన ఆటతీరుతో ఐదు టెస్టుల్లోనూ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. నితీశ్ తోపాటు డెబ్యూ చేసిన పేసర్ హర్షిత్ రాణా.. ఆసీస్ లోని పేస్ పిచ్ లను కూడా సద్వినియోగం చేసుకోలేక రెండో టెస్టు తర్వాత జట్టు నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇక నితీశ్ ఈ సీరిస్ లో భారత్ తరపున నాలుగో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. అటు బ్యాట్ తో 37కి పైగా సగటుతో 298 పరుగులు చేశాడు. ఇందులో పలుసార్లు కొన్ని ఇన్నింగ్స్ లలో టాప్ స్కోరర్ గాను నిలిచాడు. అలాగే బంతితో ఐదు వికెట్లు తీశాడు. జడేజా బ్యాటింగ్ లో 135 పరుగులు చేసి, కేవలం నాలుగు వికెట్లే తీశాడు. సుందర్ 114 రన్స్ మాత్రమే స్కోర్ చేసి, మూడు వికెట్లు తీశాడు. ఏదేమైనా తనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నితీశ్.. మూడు ఫార్మాట్లలో నిలకడగా జట్టులో స్థానం పొందాలని తహతహలాడుతున్నాడు. 

Also Read: Bumrah Record: తగ్గేదే లే.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్ము రేపిన బుమ్రా.. హైయెస్ట్ ర్యాంకింగ్స్ పాయింట్లతో కొత్త చరిత్ర 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Data Center: హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్, రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కంట్రోల్ ఎస్ ఒప్పందం
హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్, రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కంట్రోల్ ఎస్ ఒప్పందం
Chandrababu At Davos: నేడు బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితో భేటీ కానున్న చంద్రబాబు
Chandrababu At Davos: నేడు బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితో భేటీ కానున్న చంద్రబాబు
Game Changer OTT Release Date: 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... రామ్ చరణ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా?
'గేమ్ ఛేంజర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... రామ్ చరణ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా?
Budget 2025 Expectations: ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌ కోసం రూ.3 లక్షల కోట్లు! - వందే భారత్‌ రైళ్లపైనే అందరి ఫోకస్‌
ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌ కోసం రూ.3 లక్షల కోట్లు! - వందే భారత్‌ రైళ్లపైనే అందరి ఫోకస్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Electric Wires Falling Down Baby Incident | అల్లవరం మండలంలో ప్రాణాలకే ప్రమాదంగా మారిన విద్యుత్ వైర్లు | ABP DesamGautam Adani Maha Kumbh Mela 2025 | ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్న అదానీ | ABP DesamJawan Karthik Passed Away | కశ్మీర్ లో ఉగ్రదాడి...కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి | ABP DesamSaif Ali Khan Discharged From Hospital | ఐదురోజుల తర్వాత ఇంటికి వచ్చిన సైఫ్ అలీఖాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Data Center: హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్, రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కంట్రోల్ ఎస్ ఒప్పందం
హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్, రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కంట్రోల్ ఎస్ ఒప్పందం
Chandrababu At Davos: నేడు బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితో భేటీ కానున్న చంద్రబాబు
Chandrababu At Davos: నేడు బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితో భేటీ కానున్న చంద్రబాబు
Game Changer OTT Release Date: 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... రామ్ చరణ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా?
'గేమ్ ఛేంజర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... రామ్ చరణ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా?
Budget 2025 Expectations: ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌ కోసం రూ.3 లక్షల కోట్లు! - వందే భారత్‌ రైళ్లపైనే అందరి ఫోకస్‌
ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌ కోసం రూ.3 లక్షల కోట్లు! - వందే భారత్‌ రైళ్లపైనే అందరి ఫోకస్‌
Bad Boy Karthik First Look: 'బ్యాడ్ బాయ్ కార్తీక్'గా వస్తున్న నాగశౌర్య... బర్త్ డేకి టైటిల్ అనౌన్స్ చేశారోచ్, ఫస్ట్ లుక్ రిలీజ్ కూడా
'బ్యాడ్ బాయ్ కార్తీక్'గా వస్తున్న నాగశౌర్య... బర్త్ డేకి టైటిల్ అనౌన్స్ చేశారోచ్, ఫస్ట్ లుక్ రిలీజ్ కూడా
Kakani Govardhan Reddy: ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు
Kakani Govardhan Reddy: ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు
Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా - 10మంది మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా - 10మంది మృతి
HCL Tech Center In Hyderabad: హైదరాబాద్‌లో హెచ్​సీఎల్ కొత్త టెక్ సెంటర్, దావోస్‌లో రేవంత్ రెడ్డితో ఒప్పందం - 5000 ఉద్యోగాలు కన్ఫామ్
హైదరాబాద్‌లో హెచ్​సీఎల్ కొత్త టెక్ సెంటర్, దావోస్‌లో రేవంత్ రెడ్డితో ఒప్పందం - 5000 ఉద్యోగాలు కన్ఫామ్
Embed widget