అన్వేషించండి

Dhandoraa Teaser : చావు బతుకుల మధ్య ఎమోషన్ - ఆసక్తికరంగా 'దండోరా' టీజర్

Dhandoraa Teaser Reaction : తెలంగాణ గ్రామీణ నేపథ్యం, సామాజిక అంశాలే ప్రధానంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'దండోరా'. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

Sivaji's Dhandoraa Teaser Review : శివాజీ, బిందు మాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'దండోరా'. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన లుక్స్ ఆకట్టుకుంటుండగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. మురళీ కాంత్ దర్శకత్వం వహిస్తుండగా... సమాజంలో అసమానతలు, తెలంగాణ గ్రామీణ నేపథ్యం బ్యాక్ డ్రాప్‌లో డైలాగ్స్‌తో టీజర్ ఆకట్టుకుంటోంది.

టీజర్ ఎలా ఉందంటే?

తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లోని ఓ గ్రామంలో ఓ అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీతో ప్రారంభమైన టీజర్... ఆర్థిక అసమానతలు, సమాజంలో కుల వివక్ష అంశాలను టచ్ చేస్తూ ఆలోచింపచేస్తోంది. 'చావుకు కూడా మ్యాచింగ్ డ్రెస్‌లు వేసుకోవాలని ఎవరు చెప్పారు?' అంటూ నందు చెప్పే డైలాగ్, 'మేం తంతే లేవనోళ్లు... అయినొచ్చి గోకితే లేస్తరాని ఎందివయా ఇది' అని వెటకారంగా నవదీప్ చెప్పే డైలాగ్... పల్లెటూర్లో సర్పంచ్‌గా నవదీప్ దర్బం... ఇలా కొన్ని సీన్స్ కామెడీ టచ్‌తో సాగేలా ఉన్నాయి.

వేశ్యగా బిందు మాధవి

ఈ మూవీలో బిందు మాధవి శ్రీలత పాత్రలో వేశ్యగా నటిస్తున్నారు. 'ఎవరు చెప్పారు నేను తప్పు చేస్తున్నానని... వాళ్లు డబ్బులిస్తున్నారు... నేను వాళ్లకు సర్వీస్ చేస్తున్నా.' అంటూ శివాజీతో చెప్పే డైలాగ్‌తో టీజర్‌లో ఆమె పాత్రను పరిచయం చేశారు. పల్లెటూరి కామెడీ టచ్‌తో పాటు కుల వివక్షను సైతం ఎమోషనల్‌గా చూపించారు. ఓ శవాన్ని ఊరి చివరకు తీసుకెళ్తుండగా... మా అవ్వను ఎందుకు అంత దూరం తీసుకెళ్తున్నారని ప్రశ్నించడం... టీజర్ క్లైమాక్స్‌లో శవాన్ని దించుతుండగా అది కింద పడిపోవడం హార్ట్ టచింగ్ అనిపించాయి. చావు బతకుల మధ్య మనిషి ఎదుర్కొనే పరిణామాలతో పాటు కుల వివక్ష, ఎమోషన్స్ అన్నింటినీ టచ్ చేసేలా 'దండోరా' రూపొందుతోందని తెలుస్తోంది.

అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నా... అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతుందనే అంశాలను ఇందులో చూపించినట్లు తెలుస్తోంది. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యం, మ‌న పురాత‌న ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూనే వెటకారం, కామెడీ, హార్ట్ టచింగ్ ఎమోషన్ క‌ల‌యిక‌గా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. టీజ‌ర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెంచేశారు.

Also Read : మా ఫ్యామిలీలో డిజిటల్ అరెస్ట్ - పైరసీపై నాగ్ రియాక్షన్... iBOMMA రవి అరెస్ట్‌పై టాలీవుడ్ ఇండస్ట్రీ వెరీ హ్యాపీ

క్రిస్మస్ బరిలో...

'కలర్ ఫోటో', 'బెదురులంక 2021' మూవీస్ నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ రవీంద్ర బెనర్జీ 'దండోరా'ను నిర్మిస్తున్నారు. శివాజీ, బిందు మాధవి, నవదీప్‌లతో పాటు రవికృష్ణ, మౌనికా రెడ్డి, అనూష, మనికా చిక్కాల, రాద్యా తదితరులు కీలకపాత్రలు పోషించారు. అలాగే, అదితి భావరాజు సైతం కీ రోల్ ప్లే చేశారు. కె రాబిన్ మ్యూజిక్ అందించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Anupama Parameswaran : అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
Modern Missamma Lyrics - మిస్సమ్మ లిరిక్స్... ట్రెండీగా 'మోడ్రన్ మిస్సమ్మ' టైటిల్ సాంగ్... గోపీసుందర్ ట్యూన్, కిట్టు లిరిక్స్ ఎలా ఉన్నాయంటే?
మిస్సమ్మ లిరిక్స్... ట్రెండీగా 'మోడ్రన్ మిస్సమ్మ' టైటిల్ సాంగ్... గోపీసుందర్ ట్యూన్, కిట్టు లిరిక్స్ ఎలా ఉన్నాయంటే?
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget