Nitish Kumar To Take Oath As Bihar CM: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
Nitish Kumar Oath Taking ceremony | బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో బిహార్ సీఎంగా నితిష్ కుమార్ ప్రమాణం చేయనున్నారు.

Bihar Election results 2025 | బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయం సాధించిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆదివారం (నవంబర్ 16) దీనికి సంబంధించి ఎన్డీయే కూటమి నేతల మధ్య సమావేశాలు జరిగాయి. మరోవైపు ఎన్నికల సంఘం గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు 243 మంది ఎమ్మెల్యేల జాబితాను సమర్పించింది. సోమవారం నాడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
బిహార్ సీఎం నితీష్ కుమార్ సోమవారం ఉదయం 11:30 గంటలకు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు, ఇందులో మంత్రివర్గాన్ని రద్దు చేసే నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ముగిసిన వెంటనే నితీష్ కుమార్ రాజ్ భవన్ వెళ్లి గవర్నర్‌కు తన రాజీనామాను సమర్పించారు. తరువాత బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. బిహార్ ప్రభుత్వ మంత్రివర్గ కార్యదర్శి విభాగం ఒక లేఖను విడుదల చేసింది.
గాంధీ మైదానంంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ నాలుగు రోజుల పాటు పాట్నాలోని గాంధీ మైదానాన్ని మూసివేయాలని ఆదేశించారు. నవంబర్ 20 వరకు గాంధీ స్టేడియంలోకి ప్రజల ప్రవేశంపై పూర్తి నిషేధం ఉంటుందని అన్నారు. నవంబర్ 20న గాంధీ మైదానంలో బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. కనుక జిల్లా మేజిస్ట్రేట్ గాంధీ మైదానంలోకి ప్రజల ప్రవేశాన్ని నిషేధించారు. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారని జేడీయూ నేతలు తెలిపారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం తేదీ వెల్లడి
బిహార్ సీఎంగా నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వ సారి ప్రమాణం చేయనున్నారు. నితీష్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. పాట్నాలోని గాంధీ స్టేడియం వేదికగా బిహార్ లో కొత్త ప్రభుత్వం నవంబర్ 20న కొలువుదీరనుంది. మరోసారి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన కొనసాగుతుందని జేడీయూ, బీజేపీ నేతలు చెబుతున్నారు.






















