అన్వేషించండి

Telangana MLAs Disqualification: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు

BRS MLAs Disqualification: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇంకా నిర్ణయం తీసుకోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమనే నిర్ణయం తీసుకోమ్మంటారా అని స్పీకర్ ను ప్రశ్నించింది.

Telangana MLAs Disqualification | ఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు (నవంబర్ 17న) మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "అనర్హత అంశంపై నిర్ణయం మీరు తీసుకుంటారా? మేము తీసుకోవాలా?" అని సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను గట్టిగా ప్రశ్నించింది. ఈ క్రమంలో తెలంగాణ స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ కింద సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ స్పీకర్‌కు నోటీసులు, నాలుగు వారాలు గడువు

నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులలో పేర్కొంది. అంతేకాకుండా, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ సూచించారు. దీనికి ప్రతిస్పందనగా, స్పీకర్‌ తరఫు లాయర్లు నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపారు. అనంతరం, సుప్రీంకోర్టు ఈ పిటిషన్ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

BRS దాఖలు చేసిన పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం జులై 31న తెలంగాణ స్పీకర్ ను ఆదేశించింది. అయితే పలు కారణాలవల్ల నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాలేదని, మరో 2 నెలలు గడువు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ శాసనసభ కార్యదర్శి దాఖలు చేసిన మిసిలేనియస్‌ అప్లికేషన్‌ సీజేఐ ధర్మాసనం ముందు 14వ నంబరులో లిస్ట్‌ చేశారు. కేటీఆర్‌ దాఖలుచేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ 36వ నంబరులో ఉంది. మరో రిట్‌ పిటిషన్‌ 37వ నంబరులో లిస్ట్‌ అయింది. అయితే పిటిషన్లపై విచారణ చేపట్టి తేల్చేందుకు ధర్మాసనం తెలంగాణ స్పీకర్ కు 4 వారాల గడువు ఇచ్చింది. 

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ జాప్యం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఏడాదిన్నర కావొస్తున్నా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం ప్రాజస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. సుప్రీంకోర్టు సైతం అనర్హత పిటిషన్లపై మూడు నెలలు గడువు ఇచ్చినా స్పీకర్ ఎటూ తేల్చకపోవడంపై సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Advertisement

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Kovvuru Railway Station : కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Embed widget