Pujara on South Africa vs India Test Match | ప్లేయర్స్ కు సలహా ఇచ్చిన పుజారా
టీమ్ ఇండియా సొంత గడ్డపై చేతులెత్తేసింది. సఫారీలతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో.. 124 రన్స్ చేజింగ్ లో 93 పరుగులకే వెనుదిరిగింది. ఈ క్రమంలోనే ఈడెన్ గార్డెన్స్ లాంటి పిచ్ పై ఎలా ఆడాలో ప్లేయర్స్ కు సలహా ఇచ్చారు మాజీ ప్లేయర్ ఛెతేశ్వర్ పుజారా.
బ్యాట్స్మన్ వైఫల్యంపై స్పందిస్తూ.. ఇది ప్రిపరేషన్ కు సంబంధించింది అని ... పిచ్ గురించి కాదని అన్నారు. ఇండియా ప్లేయర్స్ బ్యాటింగ్ విధానాన్ని మార్చుకోవాలని సూచించాడు పుజారా. ఎలాంటి టర్నింగ్ పిచ్‌పై అయినా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
సర్ఫేస్ ఎలా ఉన్నా కూడా.. మీరు దానిపై ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించాలి. శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో కూడా లేకపోవడం భారత్‌కు పెద్ద నష్టమే అని పుజారా కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇలాంటి పిచ్‌లు ఉన్నప్పుడు భారత బ్యాటర్లు బ్యాటింగ్ కోచ్ తో మాట్లాడి వ్యూహాలు రచించి మ్యాచ్‌లో అమలు చేయాలి అని అన్నాడు.






















