Shubman Gill Injury India vs South Africa | పంత్ సారధ్యంలో రెండో టెస్ట్ ?
కొన్ని రోజుల క్రితం జరిగిన ఆస్ట్రేలియా టూర్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి ICU లో చేరాడు శ్రేయస్ అయ్యర్. ఇప్పుడు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఐసీయూలో చేరాడు. కోల్‌కత్తాలో ఈడెన్ గార్డెన్స్ లో సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు బ్యాటింగ్‌కి వచ్చి, మెడనొప్పితో బాధపడుతూ రిటైర్డ్ హార్ట్‌గా పెవిలియన్ చేరాడు శుభ్‌మన్ గిల్.
చివరి వికెట్ కు గిల్ వచ్చి బ్యాటింగ్ చేస్తాడని అందరు అనుకున్నారు. కానీ శుబ్మన్ గిల్ కు నొప్పి తీవ్రం కావడంతో హాస్పిటల్ కు వెళ్ళాడు. ఐసీయూలో గిల్ ను మోనిటర్ చేస్తున్నారట వైద్యులు. మెడ నొప్పి కారణంగా శుభ్‌మన్ గిల్, తొలి టెస్టు మొత్తానికి దూరం అయ్యాడు.
నవంబర్ 22 నుంచి గౌహతిలో రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరి శుభ్‌మన్ గిల్ ఆ లోపు టీమ్ లోకి వస్తాడా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌కి శుభ్‌మన్ గిల్ అవైలబుల్ గా లేకపోతే రిషబ్ పంత్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్ ప్లేస్‌లో సాయి సుదర్శన్‌కి టీమ్ లో చోటు దక్కే అవకాశం ఉంది.





















