Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Game Changer Tickets Price In Telangana: 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కానీ టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ చేసింది. రోజుకు ఎన్ని షోలకు అనుమతి వచ్చింది? అంటే...
Game Changer ticket price GO in Telangana: 'గేమ్ చేంజర్' సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సినిమాకు ఆరు షోలు వేసుకోవడానికి అనుమతి లభించింది కానీ బెనిఫిట్ షోలు వేసుకునే విషయంలో చుక్కెదురు అయింది. ఆ వివరాల్లోకి వెళితే...
మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 100...
సింగిల్ స్క్రీన్లలో 50 రూపాయలే!
తెలంగాణలో ఉదయం నాలుగు గంటల నుంచి 'గేమ్ చేంజర్' సినిమా షోలు పడనున్నాయి. సినిమా విడుదల తేదీ జనవరి 10 వరకు టికెట్ రేటు మీద మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ. 150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 100 పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ రేట్లు ఒక్క రోజుకు మాత్రమే పరిమితం. తర్వాత రోజు నుంచి తగ్గనున్నాయి.
'గేమ్ చేంజర్' విడుదలైన రెండో రోజు... జనవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 9 రోజుల పాటు టికెట్ రేటు మీద మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ. 100, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50 మాత్రమే పెంచుకోవడానికి అనుమతి లభించింది. సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు... తెలంగాణలో జనవరి 9న బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.
Telangana Ticket Hike and Extra shows for #GameChanger#RamCharan #GameChangerOnJAN10 🚁 #KiaraAdvani #Shankar #Anjali #DilRaju #TeluguInsider pic.twitter.com/Hnn87cMK9V
— Telugu Insider (@telugu_insider) January 8, 2025
'పుష్ప 2'తో కంపేర్ చేస్తే తక్కువే!
తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించడానికి కారణం అల్లు అర్జున్ 'పుష్ప 2' అనే సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ప్రభుత్వం మంచి రాయితీలు కల్పించింది. డిసెంబర్ 5న తెల్లవారు జామున ఒంటి గంటకు బెనిఫిట్ షోలు, ముందు రోజు రాత్రి (డిసెంబర్ 4న) పెయిడ్ ప్రీమియర్లకు కూడా అనుమతి ఇచ్చింది.
'పుష్ప 2' ప్రీమియర్ షోలకు టికెట్ రేట్ మీద 800 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దాంతో టికెట్ రేటు మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ. 1200 దాటింది. సింగిల్ స్క్రీన్లలో 1000 దాటింది. ఇక విడుదల రోజున మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ. 200, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 150 పెంచింది. ఆ రేట్లు మూడు రోజుల అమలు చేసుకోవచ్చని తెలిపింది. సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ. 150, సింగిల్ స్క్రీన్లలో రూ. 105 పెంచుకోవడానికి అనుమతి లభించింది. దాంతో కంపేర్ చేస్తే 'గేమ్ చేంజర్' టికెట్ రేట్లు తక్కువ.
Also Read: నేనూ హిందువువే... నన్ను క్షమించండి - రామ లక్ష్మణులపై కామెంట్స్ చేసి సారీ చెప్పిన శ్రీముఖి