సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను'లో కియారా అడ్వాణీ నటించింది. ఆమె తొలి తెలుగు సినిమా అది. దాంతో విజయంతో పాటు తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు అందుకుంది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ 'ఎంఎస్ ధోని' కియారాకు విజయంతో పాటు పాపులారిటీ తెచ్చింది. అయితే, అది ఆమె మొదటి సినిమా కాదు. దానికి ముందు 'ఫగ్లీ' చేసింది.
ఎంఎస్ ధోని, భరత్ అనే నేను విజయాలను మించి భారతీయులు అందరికీ కియారా అడ్వాణీ గురించి తెలిసేలా చేసింది నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్'. అందులో బోల్డ్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కియారా అడ్వాణీ అసలు పేరు అలియా. అప్పటికి హిందీ ఇండస్ట్రీలో ఆలియా భట్ పాపులర్ కావడంతో సల్మాన్ ఖాన్ సలహా మేరకు తన పేరును కియారాగా ఈ ముద్దుగుమ్మ మార్చుకుంది.
కియారా అడ్వాణీ కెరీర్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అంటే 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్'. అందులో ప్రీతి పాత్రతో నటిగానూ ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు.
'కబీర్ సింగ్' తర్వాత కియారా అడ్వాణీకి ఆ రేంజ్ హిట్స్ లేవు. 'షేర్షా'కు పేరు వచ్చినా అది ఓటీటీ రిలీజ్. 'జుగ్ జుగ్ జియో', 'గోవింద్ మేరా నామ్' ఫ్లాప్స్ కాగా 'సత్య ప్రేమ్ కి కథ' పర్వాలేదు.
హిందీ ఫిల్మ్ 'షేర్షా'లో సిద్దార్థ్ మల్హోత్రా జంటగా కియారా అడ్వాణీ నటించింది. ఆ సినిమా చేసేటప్పుడు సిద్ధార్థ్, కియారా ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఫిబ్రవరి 7, 2023లో పెళ్లి చేసుకున్నారు.
ఇంతకీ, కియారా అడ్వాణీ వయసు ఎంతో తెలుసా? ప్రస్తుతం 33 ఏళ్ళే. ఆమె డేట్ ఆఫ్ బర్త్ జూలై 31, 1991. హిందీ హీరోయిన్లతో కంపేర్ చేస్తే చాలా త్వరగా పెళ్లి చేసుకుంది.
'గేమ్ చేంజర్' రిజల్ట్ కోసం కియారా అడ్వాణీ వెయిట్ చేస్తోంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ రిలీజ్ కావడంతో ఆడియన్స్, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ సంక్రాంతి 10న విడుదల కానుంది.