అన్వేషించండి
SBI Fake SMS: బీ అలర్ట్.. మీ యోనో అకౌంట్ బ్లాకైంది - ఎస్‌బీఐ నకిలీ సందేశాల స్కామ్!
SBI Fake SMS: బీ అలర్ట్.. మీ యోనో అకౌంట్ బ్లాకైంది - ఎస్‌బీఐ నకిలీ సందేశాల స్కామ్!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
1/5

భారతీయ స్టేట్ బ్యాంకు (SBI) వినియోగదారులకు హెచ్చరిక! ఎస్బీఐ అధికారుల పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని పీఐబీ తెలిపింది. మీ యోనో ఖాతా (YONO Account) బ్లాక్ అయిందంటూ సందేశాలు పంపిస్తున్నారని వెల్లడించింది.
2/5

'డియర్ ఎస్‌బీఐ యూజర్! మీ యోనో అకౌంట్ ఈరోజు బ్లాక్ అయింది. మీ పాన్‌కార్డు నంబర్ అప్‌డేట్ చేసుకొనేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి' అని సందేశాలు వస్తున్నాయని పీఐబీ తెలిపింది.
3/5

మీ బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలు పంచుకోవాలంటూ వచ్చిన ఈమెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లకు స్పందించొద్దని పీఐబీ వెల్లడించింది. ఒకవేళ ఇలాంటి సందేశాలు వస్తే వెంటనే report.phishing@sbi.co.inకు రిపోర్టు చేయాలని సూచించింది.
4/5

మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా నంబర్లు, పాస్‌వర్డులు, ఇతర సున్నితమైన సమాచారాన్ని టెక్ట్స్ సందేశాల రూపంలో పంచుకోవద్దని ఎస్‌బీఐ పేర్కొంది. ఇవి మోసాలకు దారితీస్తాయని హెచ్చరించింది.
5/5

'సత్వరమే మీ వ్యక్తిగత సమాచారం, అకౌంట్ యాక్టివేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవాలంటూ సందేశాల వస్తే అప్రమత్తంగా ఉండాలి. కొందరు మోసగాళ్లు ఇలాంటి స్కామ్‌లు చేస్తున్నారు. ఒకవేళ సైబర్ నేరాలు చోటు చేసుకుంటే report.phishing@sbi.co.in, https://cybercrime.gov.in/కు లాగిన్ అవ్వండి. లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయండి.
Published at : 26 Feb 2023 01:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion