AP Weather Alert: ఏపీలో మంగళ, బుధవారాల్లో ఎండలు తగ్గే అవకాశం- ఒకట్రెండు చోట్ల వర్షాలు
మంగళ, బుధవారాల్లో ఏపీ లో ఎండలు తగ్గే అవకాశం. ఒకటి రెండు చోట్ల వానలు కూడా...!

వేసవి ఎండలతో ఇబ్బంది పడుతున్న ఏపీ ప్రజలకు మంగళ, బుధవారాల్లో కొంత ఊరట కలగనుంది భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజులు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు
వాతావరణ విశేషాలు:-
1. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు నున్న ద్రోణి ఈరోజు (సోమవారం) దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి మధ్య మహారాష్ట్ర, అంతర్గత విదర్భ మీదుగా మరట్వాడ ప్రాంతముపై నున్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది.
2.ఉత్తర - దక్షిణ ద్రోణి మరట్వాడ ప్రాంతముపై నున్న ఉపరితల ఆవర్తనంనుండి ఉత్తర తమిళనాడు వరకు
సగటు సముద్ర మట్టానికి ౦.9 నుండి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించిఉన్నది .
3. ఆగ్నేయ బంగాళాఖాతంలో నున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు నైరుతిబంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులోవిస్తరించి ఉన్నది .
4. నిన్నటి దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉన్న ఈరోజు తక్కువగా గుర్తించబడినది.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
ఈరోజు సోమవారం :-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంద.ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు దొరణి 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముగా కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
రేపు (మంగళవారం) :-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.ఉరుముతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు దొరణి 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశముంది.
ఎల్లుండి (బుధవారం):-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.ఉరుముతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు దొరణి 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
ఈరోజు (సోమవారం) :-
---------------
వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముగా కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
రేపు మరియు ఎల్లుండి (మంగళ, బుధవారాలు):-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశముంది.
రాయలసీమ :-
ఈరోజు (సోమవారం) :- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముగా కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
రేపు (మంగళవారం):-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశముంది.
ఎల్లుండి (బుధవారం) :-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర డైరెక్టర్ తెలిపారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు