Dal Chawal for Health : పప్పన్నం - రుచికి రుచి - ఆరోగ్యానికి ఆరోగ్యం- బరువు కూడా తగ్గొచ్చు
Dal Chawal for Health : పప్పులు, బియ్యం ప్రపంచంలో అత్యంత పోషకమైన ఆహారాలు. వీటిని తినడం వల్ల శరీరానికి ప్రొటీన్, పీచు, విటమిన్ ఎ, డి, ఇ, బి1, సి, కె, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.
Dal Chawal for Health : మాంసాహారాన్ని కాసేపు పక్కన పెడితే.. శాఖాహారంలో పప్పులు, అన్నానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎన్ని కూరగాయలతో తిన్నా.. కాస్త వేడన్నంలో పప్పు వేసుకుని తింటే ఆ ఆనందమే వేరు కదా. ఇది రుచికరంగా ఉండడమే కాకుండా సులువుగా జీర్ణమవుతాయి, ఆరోగ్యానికి మంచిది, పోషకమైనవి. ఈ రెండింటిలోనూ అనేక పోషకాలుంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి పెద్ద మొత్తంలో ప్రొటీన్, పీచు, విటమిన్ ఎ, డి, ఇ, బి1, సి, కె, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.
అమెరికాలో జరిగిన న్యూట్రిషన్ కాన్ఫరెన్స్‌లోనూ పప్పులు, బియ్యంతో సాధారణంగా ఇంట్లో తయారుచేసిన ఆహారం అత్యంత పోషకమైన ఆహారంగా పలువురు పరిగణించారు. ఇది తేలికైనది, పోషకమైనది అని పేర్కొన్నారు. దీన్ని తినడం వల్ల అనేక సమస్యలు దూరం అవుతాయి. చాలా శక్తివంతమైన పోషక మూలకాలు సైతం ఇందులో ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. వీటి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా మందికి తెలియని విషయమేమిటంటే పప్పు, అన్నం తినడం వల్ల మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడమే కాకుండా, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. అంతేకాదు దీని ద్వారా బరువు కూడా మెయింటెయిన్ అవుతుందట. యూఎస్ న్యూట్రిషన్ కాన్ఫరెన్స్ దాల్ - రైస్ ను ప్రపంచంలోనే అత్యంత పోషకమైన ఆహారంగా పేర్కొనడానికి కూడా ఇదే కారణం.
దాల్ - రైస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే
బరువు తగ్గొచ్చు
దాల్ రైస్‌లో పెద్ద మొత్తంలో ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల కడుపు చాలా సేపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా పదే పదే ఏదైనా తినాలన్న కోరికను నివారిస్తుంది, అతిగా తినకుండా చేస్తుంది. అలా నెమ్మదిగా బరువు తగ్గేయొచ్చు.
మంచి నిద్రకు పరిష్కారం
దాల్ - రైస్ తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల మెదడు కూడా వేగంగా పనిచేసి ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు దరిచేరవు. అంతేకాకుండా బద్ధకం తగ్గి శరీరం చురుగ్గా కూడా ఉంటుంది.
గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర నియంత్రణకు..
కాయగూరలు, బియ్యంలో ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. పప్పులలో ఫోలేట్ ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
కండరాలు, జీర్ణవ్యవస్థకు మేలు
దాల్ రైస్‌లో చాలా మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలను నిర్మించడంలో, రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ బి, ఇ, ఐరన్, కాల్షియం, లాంటి ఇతర ఖనిజాలు అందుతాయి.