By: Ram Manohar | Updated at : 10 Dec 2022 02:41 PM (IST)
తన గర్ల్‌ఫ్రెండ్‌ని పెళ్లాడనున్న వ్యక్తి ఇంటి ముందు భారత సంతతికి చెందిన యువకుడు కాల్పులు జరిపాడు.
Singapore News:
పెళ్లి చేసుకునే వాడిపై కోపంతో..
సింగపూర్‌లో భారత సంతతికి చెందిన 30 ఏళ్ల వ్యక్తికి అక్కడి ప్రభుత్వం ఆర్నెల్ల జైలు శిక్ష విధించింది. గర్ల్‌ఫ్రెండ్‌కు కాబోయే భర్త ఇంటి ముందు కాల్పులు జరిపి ఇలా జైలు పాలయ్యాడు. సురేందిరన్ సుగుమారన్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ నేరానికి పాల్పడ్డాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌కు కాబోయే భర్త ఇంటికి ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయాలని ప్రయత్నించాడు. తన గర్ల్‌ఫ్రెండ్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటోందన్న అక్కసుతో ఇలా చేశాడు. ఆ వ్యక్తి ఇంటి ముందుకెళ్లి ఉన్నట్టుండి కాల్పులు జరిపాడు. అంతకు ముందు మార్చి నెలలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు నిందితుడు. తన గర్ల్‌ఫ్రెండ్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటోందని చెప్పాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకోబోయే వ్యక్తిపై కక్ష పెంచుకున్నాడు. వాళ్ల ఇంటికెళ్లి గేట్ తాళం వేసి కాల్పులు జరపడం మొదలు పెట్టాడు. ఇలా భయపెట్టి పెళ్లి కానివ్వకుండా అడ్డుకోవాలని చూశాడు. బ్లాక్ హుడీ వేసుకుని వచ్చి ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడుతూనే కాల్పులు జరిపాడు. అయితే...చుట్టు పక్కల సీసీ కెమెరాలు ఉండటం వల్ల నిందితుడెవరన్నది పోలీసులు సులువుగా కనుగొన్నారు. లిఫ్ట్ ఎక్కి 13వ అంతస్తుకు చేరుకుని కాల్పులు జరిపాడు. బాధితుడు ఉదయం తలుపు తీసేందుకు ప్రయత్నించగా...అవి ఎంతకీ తెరుచుకోలేదు. గేట్‌కు తాళం వేసి ఉండటాన్ని గమనించాడు. బయట ఉంచిన షూస్ అన్నీ కాలిపోయాయి. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. ఇలాంటి ఘటనలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తాయని శిక్ష విధించే ముందు
జడ్జ్ అన్నారు. "ఈ నేరం జరిగిన తీరుని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. కావాలనే గేట్‌కు తాళం వేసి కాల్పులు జరిపాడు" అని జడ్జ్ వెల్లడించారు. ఇలా కాల్పులు జరిపి తీవ్ర స్థాయిలో నష్టం చేకూర్చితే...వెంటనే వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తుంది సింగపూర్ ప్రభుత్వం.
విశాఖలో ఇలా...
విశాఖలోని ఓ కళ్యాణ మండపం వద్ద హైడ్రామా నెలకొంది. ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడంటూ కళ్యాణ మండపం వద్ద యువతి పెట్రోల్ బాటిల్ తో హల్ చల్ చేసింది. ప్రియాంక అనే యువతి ఆరు నెలల క్రితం పెళ్లి కొడుకు భగత్ పై దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు భగత్ ను రిమాండ్ కి పంపించారు. మూడు నెలల తర్వాత జైలు నుంచి విడుదైన భగత్, ఇవాళ గాజువాక షీలానగర్ లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే విషయం తెలుసుకున్న ప్రియాంక కళ్యాణ మండపం వద్ద పెట్రోల్ తో ఆత్మహత్యకు సిద్ధమైంది. పోలీసులకు సమచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రియాంకను ఆపారు. అయితే అప్పటికే
పెళ్లి అయిపోవడంతో భగత్ అక్కడి నుంచి జారుకున్నాడు. కోర్టులో కేసు ఉండగా పెళ్లి ఆపే హక్కు తమకు లేదని పోలీసులు తెలిపారు.
Also Read: Iran Hijab Row: యువకుడిని ఉరి తీసిన ఇరాన్ ప్రభుత్వం, అలా చేశాడన్న కోపంతోనే శిక్ష
Revanth Team: రేవంత్‌తోపాటు ప్రమాణం చేసేది ఎవరు? ఇంకా వీడని సస్పెన్స్
Stocks To Watch Today 07 December 2023: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' IRCON, IDFC Bk, Adani Ports, Paytm
Petrol-Diesel Price 07 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Revanth Reddy First Signature: ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ పెట్టే తొలి సంతకం ఇదే
Revath Reddy Schedule Today: నేడే సచివాలయానికి రేవంత్ రెడ్డి - సాయంత్రానికి సీఎంగా బాధ్యతల స్వీకరణ
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Hi Nanna Review - హాయ్ నాన్న ఆడియన్స్ రివ్యూ : నాని అంత ఏడిపించేశాడా? కర్చీఫ్, టవల్స్ తీసుకువెళ్లక తప్పదా?
SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
/body>