How to save a stroke victim from dying: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని ఎలా కాపాడాలి? చికిత్స, నివారణ మార్గాలు ఇవే
How to save a stroke victim from dying: హార్ట్ ఎటాక్ తరహాలోనే బ్రెయిన్ స్ట్రోక్ కూడా చాలా ప్రమాదకరం. అందుకే, ఆ సమస్యతో బాధపడేవారి ప్రాణాలు కాపాడాలంటే ఇలా చెయ్యండి.
How to save a stroke victim from dying: ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఉన్నట్లుండి మెదడుకు రక్తం సరఫరా నిలిచిపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అది పక్షవాతానికి కూడా దారి తీసే ప్రమాదం లేకపోలేదు. కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుంది. అయితే ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలు ఏంటి. బ్రెయిన్ స్ట్రోక్ లలో రకాలు, ఈ వ్యాధి లక్షణాలు, నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం.
స్ట్రోక్ యొక్క ఆకస్మిక సంకేతాలు:
స్ట్రోక్ కు సంబంధించి ముఖ్యమైన సంకేతాలు ఇవే:
1. ముఖం, చేయి, కాళ్లలో ఊహించని విధంగా తిమ్మిరి రావడం.
2. భరించలేని తలనొప్పి
3. ఒత్తిడి, గందరగోళం, మన శరీరం మన ఆధీనంలో లేకపోవడం.
BEFAST నియమం అంటే ఏమిటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
స్ట్రోక్‌తో బాధపడుతున్న వ్యక్తిని రక్షించడానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ సంకేతాలను గుర్తించి BEFAST చేయడం సాధ్యపడుతుంది.
B బ్యాలెన్స్ కోల్పోవడం:
ఆకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోవడం లేదా సమన్వయం లేదా వెర్టిగో భావం, తల తిప్పుతున్నట్లు అనిపించడం.
E కన్ను:
ఒకటి లేదా రెండు కళ్లలో ఆకస్మిక దృష్టి కోల్పోవడం.
F ముఖం:
ఏదైనా ఒక వైపు ముఖం వంగిపోవడం (ముఖ పక్షవాతం)
A ఆర్మ్స్:
భుజాలు బరువుగా ఉండటం లేదా చేతులు హఠాత్తుగా తిమ్మిరెక్కడం లేదా బలహీనత వల్ల చెయ్యి పైకి ఎత్తలేకపోవడం ప్రధాన సమస్యలు.
S స్పీచ్:
సరిగ్గా మాట్లాడకపోవడం, అస్పష్టంగా మాట్లాడటం.
T టైమ్:
ఈ సంకేతాలను గుర్తించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఒక వ్యక్తికి స్ట్రోక్ వచ్చినప్పుడు వెంటనే చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలి. బ్రెయిన్ స్ట్రోక్ కు ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వయస్సు, వైద్య చరిత్ర, మీరు ఎదుర్కొంటున్న స్ట్రోక్ రకం, తీవ్రం, మెదడులో ఏ భాగంగాలో స్ట్రోక్ వచ్చింది. ఇలాంటి అంశాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. కొంతమందిలో స్ట్రోక్ వచ్చిన వెంటనే చేసే ప్రథమ చికిత్స అత్యంత ప్రభావంతంగా ఉంటుంది. కానీ ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చు.
ఆకస్మిక స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడం:
ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం, అధిక చక్కెర తీసుకోవడం, కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండటం వల్ల ఆకస్మిక స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా చురుకుగా ఉండటం వంటి కొన్ని జీవనశైలి సర్దుబాట్లు చేయడం ద్వారా మీరు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కరోటిడ్ ఎండార్టెరెక్టమీ సర్జరీ వంటి తక్షణ శస్త్రచికిత్స సహాయం అవసరం కావచ్చు. కాబట్టి అన్నివేళలలో అప్రమత్తంగా ఉండటం మంచిది.
Also Read : పనీర్ బేసిన్ దోశ.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.