Empuraan Collection day 1: ఎంపురాన్ ఫస్ట్ డే కలెక్షన్స్... మిక్స్డ్ టాక్‌తో మోహన్ లాల్ బాక్సాఫీస్ రికార్డ్, ఎన్ని కోట్లు వచ్చాయంటే?
మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డులు నమోదు చేసింది. 'ఎల్ 2 ఎంపురాన్' మూవీ మొదటి రోజు రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

L2: Empuraan Box Office Collection (Day 1): మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ (Mohan Lal), పాన్ ఇండియా ప్రేక్షకులకు తెలిసిన మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కలయికలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా 'ఎల్ 2 ఎంపురాన్' (L2 Empuraan). గురువారం (మార్చి 27న) విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ లభించింది. క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ అందరి నుంచి పూర్తిస్థాయిలో అప్రిసియేషన్ రాలేదు. అయినా సరే బాక్సాఫీస్ బరిలో మోహన్ లాల్ భారీ రికార్డులు క్రియేట్ చేశారు. ఫస్ట్ డే ఈ సినిమా కలెక్షన్స్ ఎంత అంటే?
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 65 కోట్లకు పై మాటే!
'లూసిఫర్' సినిమా సక్సెస్ కావడం, 'ఎల్ 2 ఎంపురాన్' ట్రైలర్ పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి. థియేటర్లలో ఫస్ట్ షో కూడా ప్రదర్శించక ముందు 50 కోట్ల రూపాయల వసూళ్లను తన ఖాతాలో వేసుకుందీ సినిమా. ఇక రిలీజ్ రోజు (గురువారం, మార్చి 27) సైతం టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. దాంతో మొదటి రోజు భారీ వసూళ్లను సాధించింది.
Empuraan first day box office collection: ప్రపంచవ్యాప్తంగా 'ఎల్ 2 ఎంపురాన్' మొదటి రోజు కలెక్షన్స్ 65 కోట్లకు పైమాటే అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఇండియన్ మార్కెట్ వరకు చూస్తే... మొదటి రోజు 22 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించింది. నెట్ కలెక్షన్స్ అంటే జీఎస్టీ వంటి టాక్స్ లు మినహాయింపుతో వేసిన లెక్క. జీఎస్టీ కూడా కలుపుకుంటే మన దేశంలో మొదటి రోజు వసూళ్లు 35 కోట్ల రూపాయలకు అటు ఇటుగా ఉండవచ్చని తెలుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ నచి 30 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని తెలిసింది.
#Empuraan Day 1 worldwide gross collection — 65+ Crores 🥵🙏🔥
— AB George (@AbGeorge_) March 27, 2025
For comparison — more than #Aadujeevitham 4 days weekend worldwide gross collection (64.14 Crores) 🙏#Lucifer 4 days weekend was just 55.40 Crores.
MARKET LEADERS THOOKU 🔥 pic.twitter.com/gLVOKeknUk
మోహన్ లాల్, పృథ్వీరాజ్.. హ్యాట్రిక్ హిట్!
'లూసిఫర్'తో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రానికి ప్రశంసలతో పాటు వసూళ్లు సైతం వచ్చాయి. అందులో మోహన్ లాల్ హీరో. ఆ తరువాత మరోసారి మోహన్ లాల్ హీరోగా మలయాళం 'లో బ్రో' డాడీ'కి దర్శకత్వం వహించారు పృథ్వీరాజ్ సుకుమారన్. వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. రెండు హిట్స్ తర్వాత మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో వచ్చిన 'ఎల్ 2 ఎంపురాన్' సినిమా బాక్సాఫీస్ పరంగా సక్సెస్ సాధించింది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ... భారీ వసూళ్లను రాబడుతోంది.
Also Read: 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ రివ్యూ... ఫస్ట్ 40 మినిట్స్ నాన్ స్టాప్ నవ్వులు - తర్వాత ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

