అన్వేషించండి

Easy Breakfast Recipe : పనీర్ బేసిన్ దోశ.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే

Paneer Basin Dosa : ఉదయాన్నే టేస్టీ దోశను తినాలంటే మీరు పనీర్ బేసిన్ దోశ ట్రై చేయవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది.

Tasty Dosa Recipe : దేశీ అల్పాహారం అంటే మనకి గుర్తొచ్చేది దోశ. దాదాపు చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పైగా దోశల్లో చాలా రకాలు ఉంటాయి. పైగా చలికాలంలో ఇలాంటి టేస్టీ ఫుడ్ తినాలని మనసు కూడా బాగా కోరుకుంటుంది. ఫుడ్ టేస్టీగానే ఉంటుంది కానీ దీనిని తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. పిండి ఎప్పుడో నానబెట్టాలి. రుబ్బుకోవాలి. దానికోసం అన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవేమి లేకుండా ఇంట్లోనే.. తక్కువ సమయంలో చేసుకోగలిగే దోశ రెసిపీ ఇక్కడుంది. 

మీకు దోశ తినాలనిపించినప్పుడు మీరు పనీర్ బేసిన్ దోశ ట్రై చేయవచ్చు. దీనిని చాలా సింపుల్​గా ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో.. ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. పైగా దీనిని చేయడం చాలా తేలిక. తక్కువ సమయంలోనే దీనిని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో? దానిని ఏ విధంగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

శనగపిండి - 1 కప్పు

ఉప్పు - తగినంత 

ఉల్లిపాయ - 1 

పనీర్ - అరకప్పు

టమాట - 1 

పచ్చిమిర్చి - 2 

వాము - అర టీస్పూన్

కొత్తిమీర - అరకప్పు

నీళ్లు - కప్పు,

తయారీ విధానం

ముందుగా కూరగాయలను బాగా కడిగి.. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని దానిలో శనగపిండి, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేయాలి. పనీర్​ను తురుముకుని దానిలో వేయాలి. టొమాటో, కొత్తిమీర, వాము వేసి పిండిని మిక్స్ చేయాలి. దానిలో కొంచెం కొంచెంగా నీరు పోసుకుంటూ.. ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. పిండిని కాస్త జారుగా.. దోశలాంటి తత్వాన్ని తీసుకువచ్చేందుకు మరిన్ని నీరు వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై ఓ పాన్​ ఉంచండి. అది వేడి అయ్యాక దానిపై కాస్త నూనె వేయాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని.. దీనిపై దోశలుగా వేసుకోవాలి. ఒకవైపు గోధుమ రంగులో వచ్చిన తర్వాత మరోవైపు తిప్పాలి. దానిపై తురిమిన పనీర్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొత్తిమీర వేసి మడవాలి. దీనిని వేడి వేడిగా తింటే చట్నీ కూడా అవసరం లేదు. లేదంటే మీరు రెడ్​ చిల్లీ చట్నీతో దీనిని తినొచ్చు.

పనీర్ బేసిన్ దోశ ప్రోటీన్ ప్యాక్డ్ బ్రేక్​ఫాస్ట్​గా చెప్పవచ్చు. ఇది మీకు టేస్ట్​ని ఇవ్వడంతో పాటు.. మీ ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది. మీరు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. మీకు బ్రేక్​ఫాస్ట్ తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయంలేనప్పుడు ఇలాంటి టేస్టీ రెసిపీని మీరు ఇంట్లోనే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అందిస్తుంది. దీనిని కేవలం ఉదయం బ్రేక్​ఫాస్ట్​గానే కాదు.. సాయంత్ర స్నాక్​గా కూడా కలిపి తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దానిని ట్రై చేయండి.

Also Read : ఈజీగా, టేస్టీగా రెడీ చేసుకోగలిగే పాలకూర వడలు.. రెసిపీ ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam Tourist Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్- మొత్తం నలుగురు పాక్ టెర్రరిస్టులు
పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్- మొత్తం నలుగురు పాక్ టెర్రరిస్టులు
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
Pahalgam Terror Attack: కశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన టాలీవుడ్... చిరు, మహేష్ నుంచి బన్నీ, ఎన్టీఆర్, చరణ్ వరకు
కశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన టాలీవుడ్... చిరు, మహేష్ నుంచి బన్నీ, ఎన్టీఆర్, చరణ్ వరకు
PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటిKL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడుLSG vs DC Match Highlights IPL 2025 | లక్నో సూపర్ జెయింట్స్ పై 8వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం | ABP DesamGujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam Tourist Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్- మొత్తం నలుగురు పాక్ టెర్రరిస్టులు
పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్- మొత్తం నలుగురు పాక్ టెర్రరిస్టులు
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
Pahalgam Terror Attack: కశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన టాలీవుడ్... చిరు, మహేష్ నుంచి బన్నీ, ఎన్టీఆర్, చరణ్ వరకు
కశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన టాలీవుడ్... చిరు, మహేష్ నుంచి బన్నీ, ఎన్టీఆర్, చరణ్ వరకు
PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
AP Liquor Scam: రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
AP SSC Results 2025 on Whatsapp : వాట్సాప్‌లో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు ఇలా చూసుకోండి 
వాట్సాప్‌లో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు ఇలా చూసుకోండి 
Allu Arjun: అల్లు అర్జున్ కోసం లుక్ టెస్ట్... 'పుష్ప' నుంచి బయటకు రావాలని... అట్లీ ఏం చేస్తాడో?
అల్లు అర్జున్ కోసం లుక్ టెస్ట్... 'పుష్ప' నుంచి బయటకు రావాలని... అట్లీ ఏం చేస్తాడో?
Pahalgam Terror Attack: కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
Embed widget