Palakura Vadalu Recipe :ఈజీగా, టేస్టీగా రెడీ చేసుకోగలిగే పాలకూర వడలు.. రెసిపీ ఇదే
Palakura Wada : ఉదయాన్నే క్రంచీగా, టేస్టీగా.. ఛాయ్‌తో కలిపి తినగలిగే ఫుడ్స్‌లలో పాలకూర వడలు ఒకటి. పైగా వీటిని రెడీ చేసుకోవడం చాలా తేలిక.
Tasty Breakfast Recipe : శీతాకాలంలో ఉదయం కానీ.. సాయంత్రం కానీ వాతావరణం చాలా చల్లగా మారిపోతూ ఉంటుంది. ఆ సమయంలో టేస్టీగా, క్రంచీగా, స్పైసీగా తినాలని అనిపిస్తుంది. బయటకు వెళ్లి తినాలంటే కాస్త కష్టమే. చలిలో ఏమి బయటకు వెళ్తామనిపిస్తుంది. అయితే ఇంట్లోనే మీరు టేస్టీ, క్రంచీ, స్పైసీ ఫుడ్ చేసుకుంటే.. హాయిగా వంటింట్లో కాస్త వెచ్చదనంతో మంచి రెసిపీ రెడీ చేసుకోవచ్చు. పిల్లలు నుంచి పెద్దల వరకు హాయిగా తినగలిగే పాలకూర వడలను మీరు చేసుకోవచ్చు. వీటిని ఏ విధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
శెనగపప్పు - ఒకటిన్నర కప్పు
పాలకూర - 1 కప్పు
పచ్చిమిర్చి - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కారం - 1 టీస్పూన్
మెంతి ఆకులు - 1 టీస్పూన్
మ్యాంగో పౌడర్ - అర టీస్పూన్ (ఆప్షనల్)
జీలకర్ర - 1 టీస్పూన్
ఉప్పు - తగినంత
నూనె - డీప్ ఫ్రైకి తగినంత
కావాల్సిన పదార్థాలు
ముందుగా పాలకూరను బాగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. శెనగపప్పును మీరు వంట చేయాలనుకుంటున్న కనీసం 4 గంటల ముందు కడిగి నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకుని ఉదయమే చేసుకున్నా మంచిదే. పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. మెంతి ఆకులను శుభ్రం చేసుకోవాలి. శెనగపప్పు నానిన తర్వాత దానిని గ్రైండర్లో తీసుకుని చిక్కగా పేస్ట్ అయ్యే వరకు రుబ్బుకోవాలి. కొంచెం కచ్చా పచ్చాగా ఉంచితే మరీ మంచిది. వడలు క్రంచీగా వస్తాయి.
రుబ్బుకున్న శెనగపప్పు మిశ్రమాన్ని ఓ గిన్నెలో తీసుకోవాలి. దానిలో జీలకర్ర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పాలకూర, మెంతికూర, మ్యాంగో పౌడర్ వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచి డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ వేయండి. అది కాగుతున్నప్పుడు.. శనగపిండి మిశ్రమాన్ని వడలుగా దానిలో వేసి రెండు వైపులా గోధుమరంగు వచ్చేవరకు వేయించండి. దీనిని కెచప్, పుదీనా, పల్లీ చట్నీతో తింటే వేరే లెవల్లో ఉంటుంది. ఇవి చట్నీ లేకున్నా కూడా డైరక్ట్‌గా తినేయొచ్చు. ఛాయ్‌తో అయితే మరింత బెస్ట్‌గా ఉంటాయి.
అబ్బా ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ ఏమి తింటామని అనుకుంటే ఫ్రై చేస్తున్నప్పుడు ఫుడ్ ఆయిల్ తక్కువగా పీల్చే టెక్నిక్స్ వాడుకోవచ్చు. లేదంటే వడలను టిష్యూలలో వేసి నూనె పీల్చుకున్న తర్వాత హాయిగా లాగించేయవచ్చు. అప్పుడప్పుడు కాస్త పరిధి దాటి ఫుడ్‌ని ఎంజాయ్ చేయాలి. అలా అని రోజూ ఆయిల్ ఫుడ్ తినాలని కాదు. కానీ ఎప్పుడో ఓ సారి నోటికి రుచికరమైన ఫుడ్ పెట్టడంలో తప్పులేదు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా అని ఓ పాట వేసుకుని.. హాయిగా ఫుడ్‌ని ఎంజాయ్ చేయాలి. తిన్న తర్వాత దానికి తగ్గ వ్యాయామం చేయాలి. లేదు.. కాదు అంటే మీరు ఏ ఫుడ్ టేస్ట్‌ని ఎప్పటికీ పూర్తిగా ఆస్వాదించలేరు.
Also Read : మిల్లెట్స్‌తో అద్భుతమైన కిచిడీ.. ఆవకాయతో తింటే ఆహా అనేస్తారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.