అన్వేషించండి

Millets Kichidi Recipe : మిల్లెట్స్​తో అద్భుతమైన కిచిడీ.. ఆవకాయతో తింటే ఆహా అనేస్తారు

Healthy Breakfast Recipes : రోగ నిరోధక శక్తిని పెంచి.. శరీరాన్ని డిటాక్స్ చేయడంలో మిల్లెట్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. వాటిని టేస్టీగా మీ డైట్​లో చేర్చుకోవాలనుకుంటే ఈ రెసిపీని మీరు ట్రై చేయండి.

Breakfast With Millets : ఆరోగ్యం కోసం ఆహార అలవాట్లపై దృష్టి పెట్టడం చాలా అవసరం. అందుకే చాలా మంది నచ్చిన ఫుడ్స్​కి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే మిల్లెట్స్​ను ఆశ్రయిస్తున్నారు. ఎన్నో పోషక విలువలున్న మిల్లెట్స్​ను తమ డైట్​లో చేర్చుకుంటున్నారు. మీరు కూడా మిల్లెట్స్​ని మీ రోటీన్​లో తీసుకోవాలనుకుంటే మీ బ్రేక్​ఫాస్ట్​ లేదా బ్రంచ్​ లేదా లంచ్​ కోసం మిల్లెట్స్ కిచిడీని ట్రై చేయలవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. పైగా దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దీనిని ఏ విధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

మిల్లెట్స్ - అర కప్పు 

పెసరపప్పు - అర కప్పు

నీళ్లు - రెండున్నర కప్పులు

క్యారెట్స్, బీన్స్, బఠాణీలు, క్యాప్సికమ్ - 1 కప్పు (అన్నీ కలిపి)

మెంతి కూర - పావు కప్పు 

టమాట - 1

నెయ్యి - 2 టేబుల్ స్పూన్స్

అల్లం - 1 టీస్పూన్ (తురిమినది)

జీలకర్ర - అర టీస్పూన్

కారం - పావు టీస్పూన్

పసుపు - చిటికెడు

ఉప్పు - తగినంత

గరం మసాల - కొంచెం

తయారీ విధానం

ముందుగా మీరు మిల్లెట్స్​ని బాగా కడిగి.. ఓ గంట ముందే నానబెట్టుకోవాలి. మిల్లెట్స్​ ప్లేస్​లో మీరు బియ్యం కూడా తీసుకోవచ్చు. ఎక్కువ సేపు నానితే.. అవి తొందరగా ఉడుకుతాయి. ఉపయోగించే ముందు దానిలోని నీటిని పూర్తిగా వడకట్టేయాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి ప్రెజర్ కుక్కర్ దాని మీద ఉంచండి. దానిలో నెయ్యి వేసి వేడి చేయండి. జీలకర్ర వేసి.. దానిలో తురిమిన అల్లం వేసి వేయించండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కూరగాయలను దానిలో వేసి వేయించండి. టమాట కూడా వేసి మగ్గనివ్వండి.

మగ్గిన కూరగాయల్లో కారం, పసుపు, గరం మసాల, ఉప్పు వేసి బాగా కలపండి. మిల్లెట్స్, పెసరపప్పును కడిగి దానిలో వేయండి. దానిలో నీరు పోసి.. మరోసారి ఉప్పు చెక్ చేసి.. సరిపోకపోతే మరింత వేసి కుక్కర్ మూత పెట్టేయండి. రెండు మూడు విజిల్స్ వచ్చేవరకు మీడియం ఫ్లేమ్​లో ఉంచి కిచిడీని కుక్ చేయండి. స్టవ్ ఆపేసి.. ప్రెజర్ పోయిన తర్వాత దానిలో కాస్త నెయ్యి వేసుకోండి. అంతే వేడి వేడి హెల్తీ కిచిడి రెడీ. దీనిని మీరు ఆవకాయ లాంటి పచ్చడితో కలిపి తింటే ఆహా అనిపిస్తుంది. 

మిల్లెట్స్​లో అత్యుత్తమ పోషక విలువలు ఉంటాయి. శరీరానికి అవసరమైన పీచుపదార్థం కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని మీ రోటీన్​లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా దీనిని పెద్దల నుంచి.. పిల్లలవరకు అందరూ హ్యాపీగా తినేయొచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు కూడా దీనిని తమ డైట్​లో చేర్చుకోవచ్చు. బీపీ కూడా కంట్రోల్​లో ఉంటుంది. బరువు తగ్గడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. పైగా దీనిలో కూరగాయలు కూడా కలిపి తీసుకుంటాము కాబట్టి శరీరానికి ఎన్నో పోషక విలువలు అందుతాయి. 

Also Read : ఒక్క ఏడాదిలో ఇడ్లీ కోసం 6 లక్షలు ఖర్చు పెట్టిన హైదరాబాదీ.. బిర్యానీలో కూడా మనమే టాప్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget