అన్వేషించండి

Hyderabad Biryani : ఒక్క ఏడాదిలో ఇడ్లీ కోసం 6 లక్షలు ఖర్చు పెట్టిన హైదరాబాదీ.. బిర్యానీలో కూడా మనమే టాప్

Swiggy Report 2023 : దేశవ్యాప్తంగా స్విగ్గీ యాప్​లో 2023లో తమకు వచ్చిన ప్రతి 6వ బిర్యానీ ఆర్డర్ హైదరాబాద్​ నుంచే వచ్చిందని ఆ సంస్థ తెలిపింది. 

Swiggy Report 2023: హైదరాబాద్​కి బిర్యానీకి విడదీయరాని అనుబంధం ఉందని మరోసారి రుజువైంది. ప్రముఖ స్విగ్గీ సంస్థ ఈ విషయాన్ని తెలిపింది. భారతదేశంలోని ప్రముఖ ఆన్​ డిమాండ్ కన్వీనియన్స్ ప్లాట్​ఫారమ్​గా పేరొందిన స్విగ్గీ.. 2023లో ఫుడ్ డెలివరీలో హైదరాబాద్​లో టాప్​ ఫుడ్ ఆర్డర్స్​ రిపోర్ట్​ను విడుదల చేసింది. దీనిలో హైదరాబాద్​కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ వివరాలు తెలిపింది.

ఒక్క ఆర్డర్​లో 37 వేలు బిల్​

స్విగ్గీ యాప్​లో 2023లో ఒక వినియోగదారుడు.. తన ఖాతానుంచి పదివేలకు పైగా ఫుడ్​ ఆర్డర్​లు చేశాడు. దేశంలోని ప్రతి 6వ బిర్యానీ ఆర్డర్ హైదరాబాద్​ నుంచే జరిగింది. మరొక హైదరాబాదీ 2023లో 1,633 బిర్యానీ ఆర్డర్​లు చేసినట్లు తెలిపింది. నగరంలోని ఓ వ్యక్తి.. ఒక ఆర్డర్​లో 37 వేల రూపాయిలకు పైగా బిల్ చేశాడు. మీకు తెలుసా వరుసగా 8 సంవత్సరాల నుంచి బిర్యానీ ఆర్డర్​లలో హైదరాబాద్​ మొదటి స్థానంలో నిలిచింది.

టాప్​ 5 ఆర్డర్స్ ఇవే..

హైదరాబాద్​లో టాప్​ 5లో ఉన్న ఆర్డర్లు ఏంటో తెలుసా? మొదటి స్థానంలో చికెన్ బిర్యానీ ఉంటే.. తర్వాత మసాలా దోశ, బటర్​నాన్​, చికెన్ 65, ఇడ్లీ ఉన్నాయి. ఇక్కడ హైలైట్​ అయిన విషయం ఏమిటంటే ఓ హైదరాబాదీ 2023 సంవత్సరం మొత్తంలో స్విగ్గీ యాప్​ ద్వారా రూ.6లక్షల విలువైన ఇడ్లీలు ఆర్డర్ చేశాడు. మస్కా బన్, చికెన్ పాప్​కార్న్, హాట్ చికెన్ వింగ్స్, వెజ్​ పఫ్, సమోసాలు టాప్​ 5 స్నాక్స్​గా నిలిచాయి. డబుల్​ కా మీఠా మరోసారి గో-టు డెజర్ట్​గా తన స్థానాన్ని నిలుపుకుంది. అప్రికాట్ డిలైట్, గులాబ్ జామూన్, చాకో లావా కేక్, డబుల్ డార్క్ చంక్ చాక్లెట్​ కుకీ డెజర్ట్​ ఆర్డర్​లలో స్థానం సంపాదించుకున్నాయి. 

డైనింగ్ అవుట్​లో రూ.125 కోట్లా??

కేవలం ఆర్డర్ చేయడంలోనే కాకుండా.. డైనింగ్​ అవుట్​ ఆప్షన్​లను కూడా హైదరాబాదీలు బాగానే వినియోగించుకున్నారు. హైదరాబాద్​లోని 4 లక్షల మంది కస్టమర్లు రూ.125.6 కోట్ల వ్యయం చేయగా.. డైనింగ్​ అవుట్​లో భాగంగా 25 కోట్ల రూపాయిలు ఆదా చేశారు. డైన్​ అవుట్​లో ఓ వ్యక్తి రూ.1,78,507 చేశాడు. 

త్వరలోనే పాకెట్ హీరో ప్లాన్..

బిర్యానీ ఆర్డర్లలో టాప్​లో నిలిచిన హైదరాబాద్​కు స్విగ్గీ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పాకెట్​ హీరో ప్లాన్​ను ఇప్పుడు హైదరాబాదీలకు కూడా అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ఆఫర్​ ద్వారా కస్టమర్లు ఫ్రీ డెలివరీ పొందడమే కాకుండా.. కొన్ని రెస్టారెంట్స్​ నుంచి ఫుడ్​ ఆర్డర్​లపై 60 శాతం డిస్కౌంట్​ పొందవచ్చు. హైదరాబాదీలను ఆకర్షించుకునేందుకు స్విగ్గీ ఈ ప్లాన్​ను తీసుకువచ్చింది. అయితే ఈ ఆఫర్​ త్వరలోనే హైదరాబాదీలకు అందుబాటులోకి రానుంది. 

ఎంతవారైనా.. బిర్యానీలకు ఫిదా అవ్వాల్సిందే..

ఏది ఏమైనా హైదరాబాదీలకు బిర్యానీ అంటే ఎంత ప్రేమ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా సరే.. హైదరాబాద్ బిర్యానీతో ప్రేమలో పడాల్సిందే. ఇక్కడికి వచ్చే సెలబ్రేటీలు సైతం హైదరాబాద్ బిర్యానీకి ఫిదా అవుతున్నప్పుడు.. హైదరాబాదీలు మాత్రం ఏమైనా తక్కువ తింటామా అనే రేంజ్​లో బిర్యానీలు లాగించేస్తున్నారు. వండుకుంటూనో.. ఆర్డర్ చేసుకుంటూనో.. లేదా రెస్టారెంట్లకు వెళ్లో.. బిర్యానీలు బిర్యానీలు ఆరగించేస్తున్నారు. 

Also Read : బరువు తగ్గేందుకు హెల్ప్ చేసే బ్రేక్​ఫాస్ట్​ రెసిపీలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget