Weight Loss Breakfast Ideas : బరువు తగ్గేందుకు హెల్ప్ చేసే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు ఇవే
Healthy Breakfast Recipes : మీరు హెల్తీ వేలో బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే.. మీరు అల్పాహారంగా ఇవి తీసుకుంటే మీ శరీరానికి శక్తి అందడంతో పాటు.. బరువు తగ్గవచ్చు.
Tasty Breakfast Recipes for Weight Loss : మీ రోజూవారీ దినచర్యలో పోషకమైన, రుచికరమైన అల్పాహారం తీసుకుంటూ.. బరువు తగ్గే ఫుడ్ గురించి ఆలోచించారా? అయితే ఇది మీకోసమే. మనం ఆరోగ్యం కోసం అయినా.. బరువు తగ్గడం కోసం అయినా.. హెల్తీ ఆహారం తీసుకోవాలి. రోజులో ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా మనం ఏ ఆహారం తీసుకుంటున్నామనేది చాలా ముఖ్యం. బరువు తగ్గడం కోసం పోషకాలతో కూడిన అల్పాహారం తీసుకోవాలి. ఇది మీకు మంచి జీవక్రియను అందించి.. రోజంతా మీరు ఎనర్జీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.
మీకు బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం లేనప్పుడు కూడా మీరు చాలా తేలికగా వీటిని ప్రిపేర్ చేసుకోగలరు. బరువు తగ్గించడంలో మీకు సహాయపడే రుచికరమైన, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ప్రత్యామ్నాయాలు ఇక్కడున్నాయి. వాటిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అవకాడో ఎగ్ టోస్ట్
దీనిని తయారు చేయడానికి మల్టీ గ్రెయిన్ బ్రెడ్.. అవకాడో గుజ్జు, ఉడకబెట్టిన గుడ్డు, సాల్ట్, పెప్పర్ కావాలి. ముందుగా బ్రెడ్‌ను టోస్ట్ చేసి దానిపై అవకాడోను సమానంగా పరచండి. ఉడికించిన గుడ్డును కట్ చేసి దానిపై ప్లేస్ చేయండి. కాస్త ఉప్పు, పెప్పర్ చల్లుకోండి. మీకు నచ్చితే రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఈ బ్రేక్‌ఫాస్ట్ మీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.
ఎగ్మఫిన్లు విత్ బచ్చలికూర
దీనిని తయారు చేయడానికి 4 గుడ్లు, 1 కప్పు తాజాగా బచ్చలికూర, చీజ్ పావు కప్పు, రుచికి తగిన ఉప్పు, పెప్పర్ తీసుకోవాలి. ముందుగా ఓవెన్‌ను 350°F ప్రీహీట్ చేసుకోవాలి. మఫిన్ టిన్‌కు కాస్త బటర్ అప్లై చేయాలి. ఓ గిన్నె తీసుకుని దానిలో గుడ్లు పగలగొట్టి వేయాలి. దానిలో తరిగిన బచ్చలికూర, చీజ్, సాల్ట్ పెప్పర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మఫిన్ కప్పుల్లో సమానంగా వేయాలి. ఓ పావు గంట వాటిని ఉడకనిస్తే వేడి వేడి ఎగ్మఫిన్లు రెడీ. ఇవి టేస్టీగాను ఉంటాయి. బరువు తగ్గడంలోనూ హెల్ప్ చేస్తాయి.
బనానా ఓట్మీల్
ఓట్స్ అరకప్పు, బాదంపాలు కప్పు, పీనట్ బటర్ 1 టేబుల్ స్పూన్, అరటి పండు ఒకటి, తేనె మీకు ఇష్టముంటే వేసుకోవచ్చు. ప్యాకేజీలో ఉన్న సూచనల ప్రకారం ఓట్స్‌ను బాదం పాలులో ఉడికించాలి. పీనట్ బటర్ బాగా కలిసే వరకు కలపండి. పైన అరటిపండు ముక్కలు వేసి తేనె వేసుకుని తినేయడమే. ఇది రోజంతా మీరు ఎనర్జీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. కడుపు నిండుగా ఉంటుంది. ఇది మీ శరీర కొవ్వను తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది.
ఈ బ్రేక్‌ఫాస్ట్‌లను మీరు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవి మీరు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. రోజంతా మీరు ఎనర్జీగా ఉండడంలో హెల్ప్ చేసి.. ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గేలా ప్రోత్సాహిస్తాయి.
Also Read : ఈ సింపుల్ హోమ్ రెమిడీస్ మీ చిగుళ్ల సమస్యలను దూరం చేసేస్తాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.