NGEL: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో 182 ప్రొఫెషనల్ ఉద్యోగాలు, వివరాలు ఇలా
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 182 ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

NGEL Recruitment: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ((NGEL) ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 182 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ), ఎంఈ, డిగ్రీ, సీఏ, సీఎంఏ, పీజీడీఎం, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 1 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 182
➥ ఇంజినీర్(ఆర్‌ఈ-సివిల్): 40 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్– 21, ఎస్సీ- 04, ఎస్టీ- 02, ఓబీసీ– 08, ఈడబ్ల్యూఎస్- 05.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూట్ నుంచి జనరల్ అభ్యర్థులు కనీసం 60% మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కేటగిరీకి కనీసం 50% మార్కులతో) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు..
➥ ఇంజినీర్(ఆర్‌ఈ- ఎలక్ట్రికల్): 80 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్– 40, ఎస్సీ-10, ఎస్టీ- 6, ఓబీసీ– 15, ఈడబ్ల్యూఎస్- 09.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూట్ నుంచి జనరల్ అభ్యర్థులు కనీసం 60% మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కేటగిరీకి కనీసం 50% మార్కులతో) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
➥ ఇంజినీర్(ఆర్‌ఈ- మెకానికల్): 15 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్– 04, ఎస్సీ- 03, ఎస్టీ- 02, ఓబీసీ– 03, ఈడబ్ల్యూఎస్- 03.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూట్ నుంచి జనరల్ అభ్యర్థులు కనీసం 60% మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కేటగిరీకి కనీసం 50% మార్కులతో) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
➥ ఎగ్జిక్యూటివ్(ఆర్‌ఈ- హ్యూమన్ రీసోర్స్): 07 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్– 02, ఎస్సీ- 01, ఓబీసీ– 03, ఈడబ్ల్యూఎస్- 01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూట్ నుంచి జనరల్ అభ్యర్థులు కనీసం 60% మార్కులతో కనీసం 2 సంవత్సరాల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్‌తో పాటు స్పెషలైజేషన్(హ్యూమన్ రిసోర్సెస్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/పర్సనల్ మేనేజ్‌మెంట్) లేదా మాస్టర్స్(సోషల్ వర్క్) లేదా ఎంహెచ్‌ఆర్‌ఓడీ లేదా ఎంబీఏ(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కేటగిరీకి కనీసం 50% మార్కులతో) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
➥ ఎగ్జిక్యూటివ్(ఆర్‌ఈ-ఫైనాన్స్): 26 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్– 10, ఎస్సీ- 04, ఎస్టీ- 02, ఓబీసీ– 08, ఈడబ్ల్యూఎస్- 02.
అర్హత: సీఏ/సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
➥ ఇంజినీర్(ఆర్‌ఈ-ఐటీ): 04 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్– 03, ఓబీసీ- 01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూట్ నుంచి జనరల్ అభ్యర్థులు కనీసం 60% మార్కులతో కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/బీటెక్(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కేటగిరీకి కనీసం 50% మార్కులతో) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
➥ ఇంజినీర్(ఆర్‌ఈ-కాంట్రాక్ట్ మెటీరియల్): 10 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్– 06, ఎస్సీ- 01, ఓబీసీ– 02, ఈడబ్ల్యూఎస్- 01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూట్ నుంచి జనరల్ అభ్యర్థులు కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్‌తో పాటు పీజీ డిప్లొమా (మెటీరియల్ మేనేజ్‌మెంట్/సప్లై చైన్ మేనేజ్‌మెంట్/ ఎంబీఏ/ పీజీడీబీఎం) ఎంఈ./ఎంటెక్ (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కేటగిరీకి కనీసం 50% మార్కులతో) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఎక్స్‌పీరియన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా. కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, ముంబై, విశాఖపట్నం, గాంధీనగర్, లక్నో, జైపూర్, భోపాల్ & రాయ్‌పూర్‌లలో జరిగే ఆన్‌లైన్ సీబీటీ ద్వారా ఎంపిక చేసి షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
జీతం: సంత్సరానికి రూ.11 లక్షలు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.04.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.05.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

