Mad Square OTT Partner: యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Mad Square OTT Release: నార్నె నితిన్ హీరోగా వచ్చిన 'మ్యాడ్'కు సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది.

Mad Square Movie OTT Streaming Partner: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా పరిచయమైన సినిమా 'మ్యాడ్'. దీనికి సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్' (MAD Square) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మూవీలో కామెడీ అదుర్స్ అనే టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ కాలేజీ నేపథ్యంలో తెరకెక్కగా.. సీక్వెల్ ముగ్గురి స్నేహితుల గోవా ట్రిప్, ఎంజాయ్‌మెంట్, లడ్డూగాని పెళ్లి కలిపి రూపొందించారు.
ఆ ఓటీటీలోకి..
ఈ మూవీ టిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix) సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే, శాటిలైట్ హక్కులను 'స్టార్ మా' సొంతం చేసుకున్నట్లు సమాచారం. సినిమాలో కామెడీ వేరే లెవల్ అనే టాక్ వినిపిస్తోంది.
టాక్ ఎలా ఉందంటే?
'మ్యాడ్' సినిమాలో తనదైన ప్రత్యేక శైలి, కామెడీ సీన్స్, ఆకర్షణీయమైన కథనంతో సక్సెస్ సాధించిన దర్శకుడు కళ్యాణ్ శంకర్.. ఈ సీక్వెల్‌తోనూ మరోసారి నవ్వుల విందును అందించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్‌లో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ (లడ్డు).. 'మ్యాడ్ స్క్వేర్'లో అంతకుమించిన అల్లరి చేశారు. కాలేజీలో ముగ్గురు స్నేహితుల అల్లరి, వారి ఫన్నీ లవ్ స్టోరీస్‌తో 'మ్యాడ్'లో కామెడీ పండించగా సీక్వెల్‌లో లడ్డు గానీ పెళ్లి స్టోరీ.. వారి గోవా ట్రిప్, ముగ్గురి ఫ్రెండ్స్ కథతో నవ్వులు పూయించారు.
బ్యాక్ టు బ్యాక్ నవ్వులే..
సినిమా ఫస్టాఫ్ 40 నిమిషాలు ఎడతెగని నవ్వులు ఉంటాయని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక లాఫింగ్ మూమెంట్ తర్వాత మరో లాఫింగ్ మూమెంట్ ఇలా కథతో సంబంధం లేకుండా నవ్వులు పూయించారని చెబుతున్నారు. 'లడ్డు గాని పెళ్లి'లో దర్శకుల పేరుతో చదివింపులు.. ఆ మ్యారేజ్ మూవీలో హిలేరియస్ ఫన్ అందించిందని పేర్కొంటున్నారు. లడ్డూ అండ్ డాడీ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయని అంటున్నారు.
'మ్యాడ్' సినిమాలో హీరోలతో పాటు లడ్డు అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు తీసుకొని 'మ్యాడ్ స్క్వేర్' చేశారు. ఆ సినిమాలో హీరోయిన్లను మాత్రం సీక్వెల్‌లో కంటిన్యూ చేయలేదు. కానీ ఇందులో గ్లామర్ అట్రాక్షన్ అంటే రెబ్బా మౌనిక జాన్ స్పెషల్ సాంగ్ అదిరిపోయిందని అంటున్నారు. టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ రోల్ స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. యూత్ ఆడియన్స్‌ను మూవీ చాలా ఆకట్టుకుంటుందని.. కామెడీ వేరే లెవల్ అంటూ చెబుతున్నారు.
ఈ మూవీని టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.






















