Amma Nee Charithamu: అమ్మా నీ చరితము... కోటి సంగీతంలో 'వాసవీ సాక్షాత్కారం' ఆడియో ఆల్బమ్
Vasavi Sakshatkaram: సీనియర్ సంగీత దర్శకుడు కోటి నేతృత్వంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పేలా 'వాసవీ సాక్షాత్కారం' మ్యూజికల్ వీడియో ఆల్బమ్ రూపొందింది.
![Amma Nee Charithamu: అమ్మా నీ చరితము... కోటి సంగీతంలో 'వాసవీ సాక్షాత్కారం' ఆడియో ఆల్బమ్ Vasavi Sakshatkaram music album Amma Nee Charithamu video song sung by Kailash Kher with music direction by Koti released Amma Nee Charithamu: అమ్మా నీ చరితము... కోటి సంగీతంలో 'వాసవీ సాక్షాత్కారం' ఆడియో ఆల్బమ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/04aee687dfb49e87a0734d1f0bac5b2e1738162698645313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
స్వర కిరీటీ డా కోటి (Music Director Koti) సంగీత సారథ్యంలో 'వాసవీ సాక్షాత్కారం' (Vasavi Sakshatkaram) మ్యూజికల్ ఆల్బమ్ రూపొందింది. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పేలా ఈ ఆల్బమ్ రూపొందింది. బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ సాహిత్యం అందించగా... శ్రీ వాసవీ పీఠం 2వ పీఠాదిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ మహా స్వామిజీ, హిందూ ధర్మ పరిరక్షకులు, భారత ధర్మ దేవత శ్రీ శైవక్షేత్ర పీఠాదిపతులు పరమపూజ్య శ్రీశ్రీశ్రీ శివ స్వామిజీ అతిథులుగా ఆల్బమ్ ఆవిష్కరించారు.
ఒక్కో పాటను అమ్మవారే దగ్గరుండి చేయించుకున్నారు - కోటి
'వాసవీ సాక్షాత్కారం' ఆల్బమ్ ఆవిష్కరణలో సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ... ''ఈ ఆల్బమ్ చేసే ఛాన్స్ నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. దీని కోసం మేం ఆరు నెలలు కష్టపడ్డాం. ఇందులో ఒక్కో పాటను అమ్మ వారే దగ్గరుండి చేయించుకున్నారు. ఆ అమ్మ వారి అనుగ్రహం వల్లే ఆల్బమ్ ఇంత అద్భుతంగా వచ్చింది. మాకు సౌండ్ డిజైనింగ్, పాటల ప్రజెంటేషన్‌కు ఎక్కువ టైం పట్టింది. ప్రతి పాటకు సౌండింగ్ కొత్తగా ఉంటుంది. ప్రతీ ఒక్కరిలోనూ, భక్తులలోనూ ఎంతో ఆధ్యాత్మిక భావన పెంపొందించేలా ఈ పాటలు ఉంటాయి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఏవీఎమ్ రావు గారికి థాంక్స్'' అని అన్నారు.
'వాసవీ సాక్షాత్కారం'లో పాటలు అన్నీ రాసిన బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడుతూ... ''వాసవీ మాత చరిత్ర ప్రపంచం అంతటికీ తెలుసు. నేను ఎన్నో వేదికలపై అమ్మవారి ప్రవచనాలు చెప్పాను. ఆ అమ్మవారి జీవిత చరిత్రపై పాటలు రాయాలనుకున్నా. ఆ టైంలో కోటి గారు కాల్ చేసి ఈ ఆల్బమ్ గురించి చెప్పారు'' అని అన్నారు.
Also Read: మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో విలన్‌గా మలయాళ స్టార్ బదులు హిందీ యాక్షన్ హీరో?
ఇంకా ఈ కార్యక్రమంలో ఏవీఎమ్ రావు, సచ్చిదానంద సరస్వతీ మహా స్వామిజీ, శ్రీశ్రీశ్రీ శివ స్వామిజీ, భువన చంద్ర, నటుడు నరేష్, కేఐ వర ప్రసాద్ రెడ్డి, డా. గెల్లి రమేశ్, దర్శకుడు ఎ. కోదండ రామిరెడ్డి, టీటీడీ ప్రధాన అర్చకులు వేణు దీక్షితులు, కొరియోగ్రాఫర్ ఎన్.ఎస్.ఎల్ ప్రవీణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తేజాంజలి వలవల తదితరులు అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)