KL Rahul News: ఆ ఇండియన్ ప్లేయర్ తో ఆటాడుకుంటున్నారు.. టీమ్ మేనేజ్మెంట్ దిగ్గజ ప్లేయర్ ఫైర్
లోయర్ మిడిలార్డర్లో ఆడించాలనుకుంటే రాహుల్ ప్లేస్ లో పంత్ ను ఆడించాలని శ్రీకాంత్ సూచించాడు. ఏదేమైనా కొంతకాలంగా నెం.5లో అక్షర్ రాణిస్తున్నా, క్లిష్ట పరిస్థితిలో ఆ స్థానంలో ఆఢటం తనకు కష్టమవుతుందన్నాడు.

Ind VS Eng 3rd Odi Updates: వన్డే సిరీస్ లో భారత టీమ్ మేనేజ్మెంట్ అవలంబిస్తున్న విధానాలపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కొనసాగేలా చూడటం కోసం ప్లేయర్ల స్థానాలను షఫీల్ చేయడంపై పెదవి విరుస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది జట్టుకు చేటు చేస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ఈ ఫార్ములాను ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లోనే హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రయోగించాడు. అయితే మూడో స్థానంలో తిలక్ వర్మ రాణిస్తున్నప్పటికీ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ను ఆడించడంతో అది బ్యాక్ ఫైర్ అయింది. దీంతో ఆ తర్వాత టాపార్డలో దాన్ని కొనసాగించలేదు. అయితే తాజాగా వన్డే సిరీస్ లో ఐదో నెంబర్ బ్యాటింగ్ స్థానంలో మాత్రం ఈ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ ఆర్డర్ ను కొనసాగిస్తున్నారు. దీనిపై తాజాగా మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కెరీర్ తో ఆటలాడవద్దని చీవాట్లు పెట్టాడు.
నెం.5లోనే ఎందుకు..?
జట్టుకు లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ కాంబినేషన్ వల్ల సత్ఫలితాలు వస్తాయని అనుకుంటే దాన్ని టాపార్డర్లో కూడా కొనసాగించవచ్చు కదా అని శ్రీకాంత్ ప్రశ్నించాడు. రెండో వన్డేలో మొదటి నలుగురు బ్యాటర్లు రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ రైట్ హ్యాండర్లే కావడం విశేషం. కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాక అతని స్థానంలో నెం.5లో అక్షర్ పటేల్ ను టీమిండియా పంపించింది. దీనిపైనే శ్రీకాంత్ అన్ హేపీ అవుతున్నాడు. కేవలం రాహుల్ బ్యాటింగ్ చేసే నెం.5లోనే ఎందుకు అక్షర్ పటేల్ ను పంపిస్తున్నారని, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ను అక్కడే ఎందుకు అప్లై చేస్తున్నారని ప్రశ్నించాడు. ఆ స్థానంలో రాహులే సమర్థుడైన ప్లేయరని, అతడిని ఆరో నెంబర్లో ఆడించడం వల్ల ప్రయోజనం లేదని పేర్కొన్నాడు. లోయర్ మిడిలార్డర్లో ఆడించాలనుకుంటే రాహుల్ ప్లేస్ లో రిషభ్ పంత్ ను ఆడించాలని సూచించాడు. ఏదేమైనా కొంతకాలంగా నెం.5లో అక్షర్ రాణిస్తున్న క్లిష్ట పరిస్థితిలో నిలిచి, త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడు ఆ స్థానంలో ఆఢటం తనకు కష్టమవుతుందని వ్యాఖ్యానించాడు.
రాహుల్ ను డ్రాప్ చేస్తారేమో..!
ఇక ఇప్పటికే ఆడిన రెండు వన్డేల్లో విఫలమైన రాహుల్ ని మూడో వన్డేలో బెంచ్ కే పరిమితం చేసి, రిషభ్ పంతను ఆడిస్తారేమోనని శ్రీకాంత్ అనుమానం వ్యక్తం చేశారు. తొలి రెండు వన్డేల్లో వరుసగా 2, 10 పరుగులు మాత్రమే రాహుల్ చేశాడు. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడించి, అతని కాన్ఫిడెన్స్ దెబ్బతీశారని పలువురు ఆరోపిస్తున్నారు. కీలకమైన ఐసీస చాంపియన్స్ ట్రోఫీ ముందర ఇలాంటి ప్రయోగాలు ఎందుకని వాదిస్తున్నారు. ఏదేమైనా ఐదో నెంబర్లో రాహుల్ ను ఆడించాలని, లెఫ్ట అండ్ రైట్ కాంబినేషన్ పక్కన పెట్టి, నాణ్యమైన ఆటగాళ్లను ముందుగా బ్యాటింగ్ కు పంపాలని పేర్కొంటున్నారు. ఇక ఇప్పటికే సిరీస్ భారత్ గెలవడంతో మూడో వన్డేలో కొంతమంది ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశముంది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను ఆడించే చాన్స్ కూడా ఉంది. ఇక రెండో వన్డేలో 119 పరుగులతో ఫామ్ లోకి భారత కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చాడు. కోహ్లీ కూడా ఫామ్ దొరకబుచ్చుకుంటే టీమిండియాకు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో తిరుగుండదని అభిమానులు భావిస్తున్నారు.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది.. మ్యాచ్ లో ఫీల్డింగ్ చేసిన కోచ్.. నెటిజన్ల ట్రోల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

