Viral Video: ఇదేందయ్యా ఇది.. మ్యాచ్ లో ఫీల్డింగ్ చేసిన కోచ్.. నెటిజన్ల ట్రోల్
గతంలో కూడా ప్రొటీస్ టీమ్ లో ఇలానే జరిగింది. ఆటగాళ్లు అనారోగ్యంతో అందుబాటులో లేకపోతే, కోచ్ జేపీ డుమిని, ఐర్లాండ్ తో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేశాడు. అప్పటి ఘటనతో పోలుస్తూ జోకులను నెటిజన్లు పేలుస్తున్నారు.

Nz Vs Sa Match Updates: వన్డే క్రికెట్లో ఆసక్తి కర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ లో తాజాగా ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టులో విచిత్ర పరిస్థితి ఎదుర్కొంది. సరిపడా ఆటగాళ్లు లేకపోడంతో ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ వాండైల్ గ్వావు మైదానంలో సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ గా బరిలోకి దిగాడు. కివీస్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటగాళ్లు బదులుగా కోచ్ ఇలా మైదానంలోకి దిగి ఫీల్డింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. చాలామంది వివిధ రకాల కామెంట్లు చేస్తూ, లైకులు, షేర్లు చేస్తున్నారు. గతంలో కూడా ప్రొటీస్ టీమ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆటగాళ్లు అనారోగ్యం కారణంగా అందుబాటులో లేకపోతే, కోచ్ జేపీ డుమిని,, ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేశాడు. అప్పటి ఘటనను ఇప్పటి దానితో కలిసి పోలుస్తూ జోకులను నెటిజన్లు పేలుస్తున్నారు.
We don’t see that happening too often! 😅
— FanCode (@FanCode) February 10, 2025
South Africa’s fielding coach Wandile Gwavu came on as a substitute fielder during the New Zealand innings! 👀#TriNationSeriesonFanCode pic.twitter.com/ilU5Zj2Xxn
కేవలం 12 మందే స్క్వాడ్..
స్వదేశంలో ఎస్ఏటీ20 టోర్నీ జరుగుతుండటంతో ప్రధాన ఆటగాళ్లు ఆ టోర్నీలో భాగమయ్యారు. దీంతో అనామక జట్టుతో పాక్ లో జరుగుతున్న ట్రై సిరీస్ కు జట్టును సౌతాఫ్రికా బోర్డు పంపించింది. ఇందులో 12 మంది ఆటగాళ్లు ఉండగా, అందులో 6గురు కొత్త ముఖాలు కావడం విశేషం. ఇక కివీస్ తో జరిగిన మ్యాచ్ లో ఒక ఆటగాడు అందుబాటులో లేకపోవడంతో తప్పినసరి పరిస్థితుల్లో కోచ్ గ్వావు ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికే టోర్నీ ముగియడంతో హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్ లాంటి ప్రధాన ఆటగాళ్లు పాక్ కు బయలు దేరారు. బుధవారం పాక్ తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ లో వాళ్లు బరిలోకి దిగడం ఖాయంగా మారింది. మరోవైపు ఈ లీగ్ మ్యాచ్ ఇరుజట్లకు చావో రేవోలాంటిదని తెలుస్తోంది. ఇప్పటికే పాక్, సౌతాఫ్రికాలు కివీస్ చేతిలో ఓడిపోవడంతో ఫైనల్ రేసును క్లిష్టం చేసుకున్నాడు. ఇక ఈ లీగ్ మ్యాచ్ వర్చువల్ గా నాకౌట్ గా మారనుంది. ఇందులో విజయం సాధించిన జట్టు ఫైనల్ కు చేరుతుంది.
ఫైనల్లో న్యూజిలాండ్..
ముక్కోణపు సిరీస్ లో వరుసగా రెండు విజయాలు సాధించి న్యూజిలాండ్ ఫైనల్ కు చేరుకుంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. లాహోర్లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 304 పరుగుల భారీ స్కోరు సాధించింది. అరంగేట్ర ఆటగాడు, ఓపెనర్ మథ్యూ బ్రిట్జ్క్ భారీ సెంచరీ (148 బంతుల్లో 150, 11 ఫోర్లు, 5 సిక్సర్లు)తో సత్తా చాటాడు. వియాన్ మడ్లర్ ఫిప్టీ (64) సత్తా చాటగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విల్ ఓ రౌర్క్ కు రెండు వికెట్లు దక్కగా, మైకేల్ బ్రాస్ వెల్ కు ఒక వికెట్ దక్కింది. అనంతరం ఛేదనను 48.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి, ఆరు వికెట్లతో గెలుపొందింది. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అజేయ సెంచరీ (113 బంతుల్లో 133 నాటౌట్, 13 ఫోర్లు, 2 సిక్సర్లు)తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఓపెనర్ డేవన్ కాన్వే (107 బంతుల్లో 97, 9 ఫోర్లు, ఓ సిక్సర్) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బౌలర్లలో డెబ్యూ బౌలర్ సెనురాను ముత్తు సామి రెండు వికెట్లు తీశాడు. ఇక ఈ మ్యాచ్ లో నలుగురు ఆటగాళ్లు ఈథన్ బోష్, మిహ్లాయి ఎంపోగన్వానా, బ్రిట్జ్క్, ముత్తుసామి డెబ్యూ చేశారు.
Also Read: Ind Vs Pak Rivalry: హై వోల్టేజీ మ్యాచ్ కు అంపైర్లు, రిఫరీ ఖరారు.. టోర్నీలో మిగతా మ్యాచ్ లకు కూడా..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

