Ind Vs Pak Rivalry: హై వోల్టేజీ మ్యాచ్ కు అంపైర్లు, రిఫరీ ఖరారు.. టోర్నీలో మిగతా మ్యాచ్ లకు కూడా..
Ind Vs Pak Rivalry: భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కు అంపైర్లుగా పాల్ రిఫీల్, ఇల్లింగ్ వర్త్ వ్యవహరించనున్నారు. థర్డ్ అంపైర్ గా మైకేల్ గాఫ్, ఫోర్త్ అంపైర్ గా అడ్రియన్ హోల్డ్ స్టాక్ ఎంపికయ్యాడు.

ICC Champions Trophy News: చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ మధ్య వన్డే మ్యాచ్ ఈనెలలోనే జరుగనుంది. దుబాయ్ స్టేడియంలో ఈనెల 20న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లీగ్ మ్యాచ్ లో ఇరుజట్లు తలపడనున్నాయి. ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే ఎంత హై ఓల్టేజ్ ఉంటుందో చెప్పడానికి వీలు లేకుండా ఉంటుంది. పైగా, గత ఎడిషన్ ఫైనల్లో తనను ఓడించి కప్పు సాధించిన పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ఇక తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి లీగ్ మ్యాచ్ ల అంపైర్ల వివరాలను ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కు ఆన్ ఫీల్గ్ అంపైర్లుగా పాల్ రిఫీల్, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ వ్యవహరించనున్నారు. థర్డ్ అంపైర్ గా మైకేల్ గాఫ్, ఫోర్త్ అంపైర్ గా అడ్రియన్ హోల్డ్ స్టాక్, మ్యాచ్ రిఫరీగా డేవిడ్ బూన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక, మెగాటోర్నీకిం ఎంపికైన భారత రిఫరీ జవగళ్ శ్రీనాథ్, అంపైర్ నితిన్ మీనన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు.
తొలి మ్యాచ్ కు అంపైర్లుగా..
ఈనెల 19 నుంచి న్యూజిలాండ్, పాక్ జట్ల మధ్య జరిగే లీగ్ మ్యాచ్ తో మెగటోర్నీ ఆరంభమవుతుంది. ఈ మ్యాచ్ ద్వారా దాదాపు 8 ఏళ్ల తర్వాత టోర్నీ మళ్లీ జరుగనుంది. ఇక తొలి మ్యాచ్ కు ఆన్ ఫీల్డు అంపైర్లుగా షర్ఫుద్దౌలా ఇభ్నే షాషిద్, రిచర్డ్ కెటిల్ బ్రూ వ్యవహరించనున్నారు. టీవీ అంపైర్ గా జొయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్ గా అలెక్స్ వార్ఫ్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. మ్యాచ్ రిఫరీగా అండ్రూ పైక్రాఫ్ట వ్యవహరిస్తారు. ఇక ఈనెల 23న బంగ్లాదేశ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ కు ఆన్ ఫీల్డు అంపైర్లుగా అడ్రియన్ హోల్డ్ స్టాక్, పాల్ రిఫీల్ వ్యవహరించనున్నారు. టీవీ అంపైర్ గా రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, ఫోర్త్ అంపైర్ గా మైకేల్ గాఫ్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. మ్యాచ్ రిఫరీగా డేవిడ్ బూన్ వ్యవహరిస్తారు. మర్చి 2న న్యూజిలాండ్ తో భారత్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కు ఆన్ ఫీల్డు అంపైర్లుగా మైకేల్ గాఫ్, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ వ్యవహరించనున్నారు. టీవీ అంపైర్ గా అడ్రియన్ హోల్డ్ స్టాక్, ఫోర్త్ అంపైర్ గా పాల్ రిఫీల్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. మ్యాచ్ రిఫరీగా డేవిడ్ బూన్ నియమితులయ్యారు.
రెండు గ్రూపులుగా జట్లు..
టోర్నీలో పాల్గొంటున్న ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడుతున్నాయి. గ్రూప్ -ఏలో ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్గానిస్తాన్ ఆడుతున్నాయి. లీగ్ దశలో టాప్ -2లో నిలిచిన జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. ఇక టోర్నీలో భారత్ తన లీగ్ మ్యాచ్ లను దుబాయ్ లో ఆడుతుంది. ఒకవేళ నాకౌట్ కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ లు కూడా దుబాయ్ లోనే నిర్వహిస్తారు. ఈ టోర్నీని రెండుసార్లు గెలిచి భారత్, ఆసీస్ అత్యంత విజయ వంతమైన జట్లుగా నిలిచాయి. 2017లో చివరిసారిగా ఫైనల్ చేరిన భారత్, పాక్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఈసారి గెలిచి టోర్నీలో హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలగా ఉంది.
Also Read: Ind Vs Eng Odi Series: టీమిండియాది మైండ్ లెస్ స్ట్రాటజీ.. టీమ్ మేనేజ్మెంట్ పై ఫైరయిన మాజీ క్రికెటర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

