Ind Vs Eng Odi Series: టీమిండియాది మైండ్ లెస్ స్ట్రాటజీ.. టీమ్ మేనేజ్మెంట్ పై ఫైరయిన మాజీ క్రికెటర్
Ind Vs Eng Odi Series: జట్టు ప్రయోజనాల కోసం కీపర్ కాకపోయినప్పటికీ, కీపింగ్ చేస్తున్న రాహుల్ ను ఇలా బ్యాటింగ్ ఆర్డర్లో షఫీల్ చేయడం బాలేదని విమర్శించాడు.

KL Rahul News: ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ గెలుచుకున్న భారత్, వన్డే సిరీస్ ను కూడా తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. కటక్ లోని బారబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో నాలుగు వికెట్లతో గెలిచి మూడు వన్డేల సిరీస్ ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుపొందింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 119 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ తో సత్తా చాటాడు. చాలాకాలం తర్వాత తను వన్డేలో సెంచరీ చేసి, ఈ ఫార్మాట్లో 32వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ సిరీస్ లో భారత మేనేజ్మెంట్ పాటిస్తున్న ఒక స్ట్రాటజీపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటరైన కేఎల్ రాహుల్ ను ఆరో నెంబర్లో ఆడించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ చేరాడు. తన రాష్ట్రం కర్ణాటకకే చెందిన రాహుల్ ను నెం.5లో ఆడించకుండా వెనకాల ఎందుకు ఆడిస్తున్నాడని టీమ్ మేనేజ్మెంట్ ను ప్రశ్నిస్తున్నాడు.
అదో మైండ్ లెస్ స్ట్రాటజీ..
వన్డే సిరీస్ తొలి రెండు మ్యాచ్ ల్లో ఐదో నెంబర్ స్థానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్ కు వచ్చాడు. అతను స్పిన్ ఆల్ రౌండర్. అయితే స్పెషలిస్టు బ్యాటర్ ఉండగా, అక్షర్ ను ఎందుకు పంపించారని గణేశ్ ప్రశ్నిస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం ఇలా స్పెషలిస్టు బ్యాటర్ ను నెం.6లో అది కూడా స్పిన్ ఆల్ రౌండర్ వెనకాల ఆడించడం ఏంటని ఫైరయ్యాడు. క్లిష్టమైన పిచ్ లో మూడు వికెట్లు త్వరగా పడిన స్థితిలో రాహుల్ మాదిరిగా అక్షర్ ఇన్నింగ్స్ నిర్మించగలడా..? అని ప్రశ్నించాడు. జట్టు ప్రయోజనాల కోసం స్పెషలిస్టు వికెట్ కీపర్ కాకపోయినప్పటికీ, కీపింగ్ చేస్తున్న రాహుల్ ను ఇలా బ్యాటింగ్ ఆర్డర్లో షఫీల్ చేయడం బాలేదని విమర్శించాడు. ఇప్పటికైనా టీమ్ మేనేజ్మెంట్ తనను ముందుగా బ్యాటింగ్ కు పంపాలని సూచిస్తున్నాడు.
రెండు వన్డేల్లోనూ విఫలమైన రాహుల్..
బ్యాటింగ్ ఆర్డర్లో తనను వెనకాల పంపిస్తుండటంతో ఆత్మ విశ్వాసం కోల్పోయి రెండు వన్డేల్లోనూ త్వరగా ఔటయ్యాడని పలువురు విశ్లేషకులుు పేర్కొంటున్నాడు. తను బ్యాటింగ్ కు దిగిన రెండు వన్డేల్లోనూ భారత్ దాదాపు విజయానికి చేరువలోకి వచ్చిందని, అయినా కూడా రాహుల్ వికెట్ పారేసుకున్నాడని, అతనిలోని ఆత్మ విశ్వాస లేమికి ఇది చిహ్నమని వ్యాఖ్యనిస్తున్నారు. రెండో వన్డేలో 2 పరుగులు చేసిన రాహుల్.. మూడో వన్డేలో 10 పరుగులకే ఔటయ్యాడు. ఇక మూడో వన్డేలో అయినా తనను త్వరగా బ్యాటింగ్ కు పంపి, అతను గాడిన పడాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మూడో వన్డే ఈనెల 12న అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. ఇప్పటికే భారత్ సిరీస్ గెలవడంతో ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, రిజర్వ్ బెంచ్ ను పరిక్షించే అవకాశముంది. మరోవైపు పరువు కోసం ఎలాగైనా నెగ్గాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

