అన్వేషించండి

Producer SKN: 'వినోదం కన్నా వివాదంపైనే ఇంట్రెస్ట్.. ఏం చేస్తాం' - ఆ కామెంట్స్‌పై 'బేబీ' నిర్మాత క్లారిటీ!

SKN Controversial Comments: తెలుగు హీరోయిన్లపై ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు వైరలైన సంగతి తెలిసిందే. తాజాగా, దీనిపై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చారు.

Producer SKN Clarified About Controversial Comments On Telugu Heroines: 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' (Return Of The Dragon) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (SKN) తెలుగు హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై నెట్టింట పెద్ద రచ్చే సాగింది. ఈ క్రమంలో స్పందించిన ఆయన.. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. 'సరదా కోసమో, ఫ్లోలో చెప్పడంలోనే ఓ కాంట్రవర్శీకి రూట్ వేసే స్టేట్‌మెంట్ ఇచ్చారు. కానీ.. దాన్ని హీరోయిన్ వైష్ణవీ చైతన్యకు ముడిపెట్టి చూడడం సరికాదేమో?' అని ఓ రిపోర్టర్ 'ఎక్స్' వేదికగా పోస్ట్ పెట్టగా ఎస్కేఎన్ సమాధానం ఇచ్చారు. 'ఈ మధ్య చాలా మంది వినోదం కన్నా వివాదానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఏం చేస్తాం చెప్పండి.' అంటూ రిప్లై ఇచ్చారు. 

Also Read: 'అమరన్' హీరో శివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ - అదిరిపోయే టైటిల్ ఫిక్స్, గ్లింప్స్ చూశారా!

అసలేం జరిగిందంటే..?

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్'. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కించగా.. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' పేరుతో తెలుగులో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఈ నెల 21 తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. 'తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలని మేము ఎక్కువగా ఇష్టపడతాం. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుంది అనే విషయం నాకు తర్వాత తెలిసింది. అందుకని తెలుగు రాని అమ్మాయిలనే ఎంకరేజ్ చేయాలని నేను, మా కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ అనుకుంటున్నాము' అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

దీంతో ఈ నిర్మాత అసలు ఎవరి గురించి ఈ కామెంట్స్ చేశారంటూ నెట్టింట పెద్ద చర్చ మొదలైంది. ఎస్కేఎన్, సాయిరాజేష్ కాంబోలో వచ్చిన మూవీ 'బేబీ'. ఆ మూవీ హీరోయిన్ వైష్ణవీ చైతన్యను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నారు. 'బేబీ' దర్శక నిర్మాతలను ఆమె ఇబ్బంది పెట్టిందని.. అందుకే ఇలాంటి కామెంట్స్ చేశారని కామెంట్ చేశారు. తాజాగా, దీనిపై ఆయన వివరణ ఇచ్చారు.

Also Read: 3 రోజులుగా ఆస్పత్రిలోనే సుడిగాలి సుధీర్ - అసలు కారణం ఏంటి.?, ధనరాజ్ ఎందుకు అంత ఎమోషన్ అయ్యారు?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Irumudi Mallepoola Pallaki Song : మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget