Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP Desam
రామరాజ్యం స్థాపించటానికే వచ్చామంటూ వీర రాఘవరెడ్డి అతని అనుచరులు కలిసి తనపై దాడి చేశారంటూ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే రంగరాజన్ కు తాము కొన్ని ప్రశ్నలు సంధించామంటూ రామరాజ్యం వెబ్ సైట్ లో ఈ వీడియో అప్లోడ్ చేశారు వీరరాఘవరెడ్డి . ఆ తర్వాత చిలుకూరి బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి చేసిన రామరాజ్యం వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగిందంటే ఈనెల 7న 20 మంది రామరాజ్యం సంస్థ సభ్యులమంటూ తనపై దాడి చేశారని రంగరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు రోజులుగా దర్యాప్తు చేసిన పోలీసులు…ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. రంగరాజన్ నివాసంలోకి ప్రవేశించి..మొహం, ఒంటిపై పిడిగుద్దులతో దాడి చేశారని రంగరాజన్ పోలీస్ కంప్లైంట్ లో తెలిపారు. అయితే ఘటన జరిగి రెండురోజులైనా విషయం బయటకు రాకపోవటంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మరక్షకులు దాడులు చేస్తుంటే..రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చున్నారంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.





















