US Deportation: అమెరికాలోని భారతీయులకు బ్రహ్మాస్త్రం- ట్రంప్‌తో మాట్లాడా, అంతా సెట్ అవుతుందన్న కేఏ పాల్
Donald Trump US Deportation | అమెరికాలోని అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపుతోంది ట్రంప్ ప్రభుత్వం. అయితే భారతీయులకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరినట్లు కేఏ పాల్ తెలిపారు.

KA Paul about Indians in America | అమెరికాలో ఉంటున్న తెలుగువారితో పాటు ప్రవాస భారతీయులకు కేఏ పాల్ శుభవార్త చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలసీలు తమను ఇబ్బంది పెడుతున్నాయని ఇక అమెరికా వదిలి వెళ్లిపోవడమేనా అనే ఆందోళన చెందుతున్న వారికి పాల్ సాయం చేస్తానన్నారు. అమెరికా రెసిడెన్స్, సిటిజన్స్ కాకుండా హెచ్1 వీసా ఉన్నవారు సైతం టెన్షన్ పడుతున్నారు. అమెరికాలో స్టూడెంట్ వీసా ఉండి పార్ట్ టైం జాబ్ చేయవద్దని ఆంక్షలు ఉన్నవారికి సహాయం చేస్తానన్న కేఏ పాల్ ఈ విషయంపై ట్రంప్‌నకు లేఖ రాసినట్లు తెలిపారు.
ఒక్క లెటర్ చూపిస్తే చాలు..
పార్ట్ టైం జాబ్ చేస్తున్న విద్యార్థులను అమెరికాలో అధికారులు పట్టుకుంటే కనుక తన గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ (Global Peace Initiative) లెటర్ చూపించాలని దాని ఫౌండర్ కేఏ పాల్ సూచించారు. అందులో డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ సంతకాలు ఉన్నాయని కేఏ పాల్ గుర్తు చేశారు. ఇమిగ్రేషన్ అధికారులు మిమ్మల్ని పట్టుకుంటే ఈ లెటర్ చూపించాలి. డాక్టర్ కేఏ పాల్ మా కోసం పోరాటం చేస్తున్నారు. మాకు మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ పనిచేసేందుకు మాకు హక్కులు ఉన్నాయి అని దాని సంకేతం అని కేఏ పాల్ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
నేను చెప్పింది చెప్పినట్లు జరిగాయి..
2016లో తాను డొనాల్డ్ ట్రంప్ నకు ప్రచారం చేసి విజయం అందించానన్నారు. 2020 లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశాను. తాను రాసిన బుక్ ఆధారంగా ట్రంప్ కొన్ని విషయాలు గమనించారు. నాలుగు విషయాలు జరిగినట్లుగా గుర్తించారు. తాను చెప్పినట్లుగా 2020లో ట్రంప్ ఓడిపోతారని నేను ముందే చెప్పాను. జైలుకు వెళ్తారని చెప్పాను అది జరిగింది. అభిశంషన్న తీర్మానంపై చెప్పాను అదే జరిగింది. 7 స్వింగ్ రాష్ట్రాల్లో నేను చెప్పింది జరిగింది. తెలుగువారిలో ఐకమత్యం లేని కారణంగా అమెరికాలో కష్టాలు పడుతున్నారు. కులాలకు మతాలకు అతీతంగా నడుచుకుంటే అందరికీ న్యాయం చేస్తాను.
VIDEO | "Indians in America are in great stress, therefore I have written a letter explaining in detail how President Trump should give a special status to the Indians in America. Both that are legally over there with H1B or independent visas, and also the ones who are illegally… pic.twitter.com/dnWZBrLUrO
— Press Trust of India (@PTI_News) January 28, 2025
తెలుగు సీఎంలు స్వార్థపరులు
డాక్టర్ కేఏ పాల్ యాప్ లో మీరు చేరండి. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వార్ధపరులు. అమెరికాలో ఉంటున్న తెలుగు వారి కోసం ఈ సీఎంలు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. 2000 దశకంలో అమెరికా అసెంబ్లీకి ఎన్నిక కాని వ్యక్తికి తాను ఉద్యోగం ఇచ్చాను అని ఇప్పుడు అదే వ్యక్తి సెనేట్ చైర్మన్ గా ఉన్నారు. ఏప్రిల్ లో జరగనున్న గ్లోబల్ పీస్ సబ్మిట్ కి అందరూ మద్దతు తెలపాలి. గత కేంద్ర ప్రభుత్వాలు తాను చెప్పినట్లుగా చేయకపోవడంతో జిడిపిలో చైనాను అధిగమించ లేకపోయాం. కొందరు ట్రంప్ నకు తప్పుడు సలహాలు ఇచ్చిన కారణంగా ప్రవాస భారతీయులకు సైతం అగ్రరాజ్యంలో సమస్యలు ఎదురవుతున్నాయని’ కేఏ పాల్ చెప్పారు.
అమెరికా నుంచి భారత్‌కు ఇదివరకే రెండు విమానాలలో వలసదారులను తిప్పి పంపించి ట్రంప్ ప్రభుత్వం. త్వరలోనే మరో విమానంలో మరికొందరు అక్రమ వలసదారులను భారత్ పంపించే ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి.
Also Read: H-1B Registration : మార్చి 7 నుంచి H-1B క్యాప్ రిజిస్ట్రేషన్ - కీలక మార్పులు చేసిన యూఎస్సీఐఎస్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

