Arulmigu Thiruthani Murugan Temple : 365 రోజులకు గుర్తుగా 365 మెట్లు.. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం విశిష్టత ఇదే!
సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దక్షిణ భారత దేశంలో ఆలయాలను సందర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా మురుగన్ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు..

Arulmigu Subramaniya Swami Temple Tiruttani: సనాతన ధర్మ పరిరక్షణ యాత్రలో భాగంగా ముందుగా కేరళలో ఆలయాలు దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ... ఫిబ్రవరి 15 శనివారం ఉదయం అరుల్మిగు సోలైమలై మురుగన్ ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం బయటకు వచ్చిన పవన్..తిరుత్తణి సందర్శనంతో ఆరు మురుగన్ క్షేత్రాలను పూర్తిచేసినట్టే అన్నారు.
ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఇవే
పళని మురుగన్ ఆలయం
స్వామిమలై మురుగన్ ఆలయం
తిరుచెందూర్ మురుగన్ ఆలయం
తిరుపరంకుండ్రం
స్వామిమలై మురుగన్ ఆలయం
తిరుత్తణి మురుగన్ ఆలయం
Also Read: అరుల్మిగు సోలైమలై మురుగన్ సేవలో పవన్ కళ్యాణ్ - ఈ ఆలయ చరిత్ర తెలుసా మీకు!
ఫిబ్రవరి 15 ఉదయానికి ఐదు మురుగన్ దేవాలయాల సందర్శన పూర్తైంది. ఇక తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం.. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాలో ఉంది. చెన్నైకి సుమారు 84 కిలోమీటర్ల దూరంలో కొండపై కొలువయ్యాడు మురుగన్.
దక్షిణ భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటైన తిరుత్తణిలో నిత్యం భక్తుల రద్దీ సాగుతుంటుంది. ద్రవిడ నిర్మాణ శైలిలో ఉండే ఈ ఆలయంలో ప్రధాన దైవం మురుగన్ అయినప్పటికీ ఉపాలయాలు చాలా ఉన్నాయి. ఈ ఆలయం ఉన్న కొండపైకి చేరుకునేందుకు 365 మెట్లు ఎక్కాలి. అంటే ఏడాదిలో 365 రోజులకు ఇవి గుర్తు. ఈ మార్గ మధ్యలో కనిపించే ప్రకృతి దృశ్యాలు చూపుతిప్పుకోనివ్వవు.
Also Read: చారిత్రక మీనాక్షి ఆలయంలో ఉన్న శ్రీ చక్రం గురించి మీకు తెలియని రహస్యం - ఇది తెలుసుకోవడమే జన్మ ధన్యం!
తిరుచెందూర్‌లో తారకాసురుడిని సంహరించిన తర్వాత మురుగన్ ఇక్కడకు చేరుకున్నాడని పురాణ గాథ. విజయనగర పాలకులు, స్థానిక అధిపతులు, జమీందార్లు తరతరాలుగా తిరుత్తణిని అభివృద్ధిచేశారు. ఇక్కడ మురుగన్ తో నెమలి కాదు..తెల్లటి ఏనుగు ఉంటుంది. స్థానికంగా చెప్పే కథల ప్రకారం...దేవతల రాజు ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను మురుగన్‌కు ఇచ్చి పెళ్లిచేసి..తనతో పాటూ ఐరావతాన్ని ఇచ్చి పంపించాడట. అయితే దేవలోకం నుంచి ఐరావతం వచ్చేసినప్పటి నుంచి ఇంద్రుడి సంపద క్షీణించడం మొదలైంది. ఇది గ్రహించిన మురుగన్ ఆ తెల్ల ఏనుగును తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించగా ఇంద్రుడు నిరాకరించాడు. అయితే ఆ ఏనుగును తాను నివాసం ఉండే దిశగా పెట్టాలని సూచించాడట. అందుకో ఈ ఆలయంలో ఐరావాతం చిత్ర స్వామివైపు కాకుండా తూర్పు దిశగా తిరిగి ఉంటుంది.
క్షీరసాగర మథనం సమయంలో వాసుకి సాయంతో పర్వతాన్ని చిలికారు దేవతలు, దానవులు. ఆ సమయంలో తన ఒంటికి అయిన గాయాలను నయం చేసుకునేందుకు ఈ క్షేత్రానికి వచ్చాడని చెబుతారు. కార్తీకమాసంతో పాటూ ఈ ఆలయంలో రెండు వార్షిక పండుగలు వైభవంగా జరుగుతాయి.
హే స్వామినాథ కరుణాకర దీనబంధో!
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో
శ్రీశాది దేవ గణపూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
దేవాది దేవసుత దేవ గణాధినాథ!
దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే!
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
Also Read: ఔషధ మొక్కల రసాయనాలతో అభిషేకం, మూలికా ప్రసాదం - పవన్ దర్శించుకున్న అగస్త్య మహర్షి ఆలయానికి దారి ఇదే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

