అన్వేషించండి

Mystery Of Madhurai Meenakshi Temple: చారిత్రక మీనాక్షి ఆలయంలో ఉన్న శ్రీ చక్రం గురించి మీకు తెలియని రహస్యం - ఇది తెలుసుకోవడమే జన్మ ధన్యం!

Pawan Kalyan: మధురై పట్టణంలో కొలువైన శ్రీ మీనాక్షి అమ్మన్, శ్రీ సోమసుందరేశ్వన్ ను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు..ఈ ఆలయం గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

Madhura Meenakshi Story : అష్టాదశ  శక్తిపీఠాల్లో ఒకటి మధురై మీనాక్షి ఆలయ. మీనాల్లాంటి విశాలలమైన కళ్లతో మరకతశిలతో చెక్కిన అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ కళ్లనిండుగా దర్శించుకోవచ్చు. మధురైను పాలించిన పాండ్యరాజులంతా మీనాక్షిని తమ ఇంటి ఆడపడుచుగా , కులదేవతగా ఆరాధించేవారు. 

దేవీ భాగవతపురాణంలో ఉండే మణిద్వీప వర్ణనను అనుసరిస్తూ ఆలయాన్ని నిర్మించారు. చతుష్షష్టి కళానిలయమైన  ఈ ఆలయం ఒకప్పుడు పగలంతా ఎంత ప్రశాంతంగా ఉండేదో...రాత్రి వేళ ఆ వైపు చూడాలంటనే భయపడేలా ఉండేది. రోజంతా భక్తులతో పూజలందుకునే మీనాక్షి..చీకటి పడేసరికి నగరంలో సంచరిస్తూ సంహారానికి పాల్పడేది. అమ్మవారిని శాంతపరిచేందుకు పాండ్యరాజులు ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇక చేసేది లేక చీకటి పడిన తర్వాత నగరంలో ఎవరూ తిరగకూడదనే నిబంధన విధించారు. అమ్మవారిలో సగభాగం అయిన సుందరేశ్వరుడు మధురై క్షేత్ర పాలకుడు అయిఉండి  కూడా ఏమీ చేయలేక చూస్తుండిపోయాడు.

Also Read: పవన్ కళ్యాణ్ వెళ్లిన స్వామిమలై విశిష్టత ఏంటి - ఈ ఆలయానికి చేరుకోవడం ఇంత సులభమా!
 
ఇలాంటి సమయంలో మధురైలో అడుగుపెట్టారు ఆదిశంకరులు. ఘనంగా ఆహ్వానం పలికిన పాండ్యరాజు సకల మర్యాదలు చేసి రాజ్యంలో బస ఏర్పాటు చేశారు. అయితే ఈ రాత్రికి ఆలయంలోనే బస చేస్తానన్నాడు శంకరాచార్యులు. ఆ మాట విని కంగారుపడిన పాండ్యరాజులు నగరంలో జరుగుతున్నదంతా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడకు వెళ్లొద్దంటూ ప్రాధేయపడ్డాడు పాండ్యరాజు. కానీ భిక్షకు వచ్చేవారు గృహస్తుల ఇంట్లో బస చేయకూడదని చెప్పి ఆలయానికే వెళతా అన్నాడు. శంకరుడి తేజస్సుతో ఉన్న ఆబాలుడిని మాళ్లీ చూడలేనేమో అనుకున్నాడు పాండ్యరాజు.  

సూర్యస్తమయం అవడంతో నగరం మొత్తం ప్రశాంతంగా మారిపోయంది. ఆలయంలో గంటలు మోగాయ్...దీపాలు మొత్తం వాటంతట అవే వెలిగాయ్..అక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది.  అమ్మవారు కళ్లు తెరిచి నెమ్మదిగా లేచి నిల్చుంది. గర్భగుడి నుంచి బయటకు అడుగుపెట్టింది. ఎందురుగా ఉన్న మండపంలో ధ్యానంలో ఉన్న బాల శంకరులను చూసింది. ఎవరీ బాలుడు..చూస్తుంటే పుత్రుడిలా అనిపిస్తున్నాడు అనుకుంటుంది ( శంకరుడి అంశ అంటే శివయ్య తనయుడే కదా మరి పుత్ర వాత్సల్యం వస్తుంది కదా). గర్భగుడిలో ప్రశాంతంగా కనిపించిన మీనాక్షి అమ్మ...గర్భగుడి దాటగానే ఓ మాయా స్వరూపం ఆవహించింది. అప్పుడే అమ్మను చూసిన శంకరులు.. స్తుతించడం మొదలు పెట్టారు. అక్కడి నుంచి అమ్మ అడుగులు ముందుకు పడడంలేదు. నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావ్ అని ప్రశ్నించింది మీనాక్షి. అప్పుడు కూడా బాల శంకరులు ప్రణామం చేసి..."అంబా శంభవి! చంద్ర మౌళి రబలా అంటూ కీర్తించడం కొనసాగించారు. 

బాల శంకరుల స్తుతికి కరిగిపోయిన మీనాక్షి అమ్మ..వరం కోరుకో అని అడిగింది. పాచికలు ఆడుదాం అని ఠక్కున అడిగారు శంకరులు. నేను ఓడితే నా భర్త ఆజ్ఞమేరకు నడుచుకుంటా ..నువ్వు ఓడితే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటుంది. కానీ ఆటలో ఉన్నప్పుడే ప్రశ్నలు సంధిస్తుంది మీనాక్షి.  అలా అమ్మకు శంకరులు చెప్పిన సమాధానాలే  దేవతాస్తోత్రాలు, కవచాలు, సహస్రనామాలు, అష్టోత్తర శతనామస్తోత్రాలు. ఇక శంకరులు కూడా..అమ్మా నేను ఓడితే నీకు ఆహారం అవుతా..నువ్వు ఓడితే నగర సంహారం ఆపేయాలి అంటాడు. అదే క్షణం బాల శంకరుడిలో ఓ మెరుపు వచ్చి చేరిది. అదే శంకరుడిది. ఇక శంకరాచార్యులి మాటకు అంగీకరించిన అమ్మ వెనక్కు వెళ్లి గర్భగుడిలో కూర్చుంది. ఆట ప్రారంభించారు. 

Also Read: ఔషధ మొక్కల రసాయనాలతో అభిషేకం, మూలికా ప్రసాదం - పవన్ దర్శించుకున్న అగస్త్య మహర్షి ఆలయానికి దారి ఇదే!
 
తెల్లవారిపోతోంది..త్వరగా ఆట ముగించేస్తే సంహారానికి వెళ్లిపోవచ్చని అమ్మవారు చకచకా పాచికలు కదుపుతోంది. ఇదే చివరి పందెం అని పాచికలు వేసిన అమ్మవారు నేను గెలిచా అంది. తల్లి చేతిలో ఓడడం కన్నా బిడ్డకు ఏం కావాలి చెప్పు అన్న శంకరులు.. ఓసారి ఆటమొత్తం చూడమ్మా అన్నాడు. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షరసంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్రపరంగా ఈ గెలుపు నాదే అన్నాడు. పాచికలు ఆడడంలో భాగంగా  శ్రీ చక్రాన్ని గీశారు శంకరులు. ఈ చక్రం నీ దేహం..రాత్రంతా నా తపస్సు శక్తిని ధారపోసి వేసిన ఈ చక్రాన్ని తిరిస్కరిస్తావా అని అడుగుతాడు. అంటే పాచికల కోసం గడులు గీస్తున్నట్టే గీస్తూ..అక్కడ శ్రీ చక్రం వేసి అమ్మవారిని నిలిపేశారు శంకరులు. ఆ శ్రీ చక్రం దాటి మీనాక్షి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. అప్పుడు ప్రత్యక్షమైన సుందరేశ్వరుడు నీ తామస శక్తిని అదుపుచేసేందుకు కారణ జన్ముడు దిగిరావాలి అందుకే నా అంశతో జన్మించిన శంకరులు నీ పుత్రుడిగా వచ్చాడని చెబుతాడు.  
 
తెల్లారేసరికి ఆలయం వైపు పరుగుతీసిన పాండ్యరాజు..అక్కడ ఏం జరుగుతోందో చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీ చక్రాన్ని ప్రతిష్టించి దూరంగా నిల్చుని అమ్మవారిని అయ్యవారిని స్తుతిస్తూ ఆది శంకరులు కనిపించారు. ఇకపై అమ్మవారు తామస శక్తిగా మారదనే అభయం ఇచ్చారు. అందుకే శ్రీ చక్రాన్ని దర్శించుకుంటే చాలు..న్యాయబద్ధమైన ఏ కోర్కెలు అయినా నెరవేరుతాయని చెబుతారు. మీనాక్షి కొలువైన గర్భగుడి కింద ఉందా శ్రీ చక్రం.. అందుకే ఆ పరిసరాల్లో అడుగుపెడితే చాలు ఏదో దివ్య శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది.

Also Read: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Latest News : విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Viral Video: స్మిత్ రిటైర్మెంట్‌పై కోహ్లీకి ముందే హింట్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
స్మిత్ రిటైర్మెంట్‌పై కోహ్లీకి ముందే హింట్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్‌కు మట్టిదిబ్బల గండం- అక్కేడ కార్మికులు ఉన్నట్టు అనుమానం!
ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్‌కు మట్టిదిబ్బల గండం- అక్కేడ కార్మికులు ఉన్నట్టు అనుమానం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs NZ Semi Final 2 | Champions Trophy ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేది కివీస్ | ABP DesamChampions Trophy | 97 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇండియా | ABP DesamSrisailam Elevated Corridor Project Details | నల్లమల్ల అడవిలో ఎలివేటెడ్ కారిడార్‌ | ABP DesamAP Speaker Ayyannapathrudu on YS Jagan Letter | స్పీకర్ ను కించపరిచేలా జగన్ లేఖలున్నాయన్న అయ్యన్న | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Latest News : విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Viral Video: స్మిత్ రిటైర్మెంట్‌పై కోహ్లీకి ముందే హింట్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
స్మిత్ రిటైర్మెంట్‌పై కోహ్లీకి ముందే హింట్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్‌కు మట్టిదిబ్బల గండం- అక్కేడ కార్మికులు ఉన్నట్టు అనుమానం!
ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్‌కు మట్టిదిబ్బల గండం- అక్కేడ కార్మికులు ఉన్నట్టు అనుమానం!
Telangana MLC Election Results 2025: కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
Tesla Cars In India: టెస్లా కార్లను ఇండియాలోనే కొనొచ్చు, ఇంపోర్ట్‌ అక్కర్లేదు - ఫస్ట్‌ షోరూమ్‌ ఓపెనింగ్‌!
టెస్లా కార్లను ఇండియాలోనే కొనొచ్చు, ఇంపోర్ట్‌ అక్కర్లేదు - ఫస్ట్‌ షోరూమ్‌ ఓపెనింగ్‌!
Holi 2025 Date : హోలీ 2025లో మార్చి 14న జరుపుకోవాలా? 15వ తేదీన చేసుకోవాలా? హోలీ, హోలీకా దహనం డిటైల్స్ ఇవే
హోలీ 2025లో మార్చి 14న జరుపుకోవాలా? 15వ తేదీన చేసుకోవాలా? హోలీ, హోలీకా దహనం డిటైల్స్ ఇవే
Urvashi Rautela: ఊర్వశీ.. నీకన్నా ఉర్ఫీనే బెటర్ - సోషల్ మీడియాలో ఏకి పారేస్తోన్న నెటిజన్లు
ఊర్వశీ.. నీకన్నా ఉర్ఫీనే బెటర్ - సోషల్ మీడియాలో ఏకి పారేస్తోన్న నెటిజన్లు
Embed widget