Thanjavur Swamimalai Temple: పవన్ కళ్యాణ్ వెళ్లిన స్వామిమలై విశిష్టత ఏంటి - ఈ ఆలయానికి చేరుకోవడం ఇంత సులభమా!
Pawan Kalyan embarks on Temple Tour: కేరళ, తమిళనాడులో ఆలయాల సందర్శనలో భాగంగా AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వామిమలై మురుగన్ ని దర్శించుకున్నారు. ఈ ఆలయం విశిష్టత ఏంటి? ఎలా చేరుకోవాలి?

Thanjavur Swamimalai Temple: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దక్షిణాది పుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడులో ఆలయాలను సందర్శించుకుంటున్నారు. ఇందులో భాగంగా జనవరి 13 గురువారం రోజు ఉదయం తమిళనాడు తంజావూరు చేరుకున్నారు. కుంభకోణం సమీపంలో ఉన్న స్వామిమలై మురుగన్ స్వామిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటూ తనయుడు అకీరానందన్ కూడా స్వామిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా స్వామిమలై ఆలయం విశిష్టత ఏంటి? ఇక్కడకు ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం..
స్వామిమలై.. తమిళనాడు రాష్ట్రం స్వామిమలై పట్టణంలో ఉన్న ఓ ప్రముఖ పుణ్యక్షేత్రం. తెలుగువారు కుమారస్వామిగా కొలిచే మురుగన్ కొలువైన పుణ్యప్రదేశం ఇది. సుబ్రహ్మణ్యస్వామికి ఆరు ప్రముఖ ఆలయాలున్నాయి..వాటిలో ఒకట స్వామిమలై.
ప్రసిద్ధ ద్రావిడ వాస్తుశైలి నిర్మాణంలో ఉండే ఈ ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. మంచి పర్యాటక ప్రదేశం కూడా. భారతదేశం నలుమూలల నుంచి మురుగన్ దర్శనార్థం భక్తులు తరలివస్తుంటారు.
Also Read: ఔషధ మొక్కల రసాయనాలతో అభిషేకం, మూలికా ప్రసాదం - పవన్ దర్శించుకున్న అగస్త్య మహర్షి ఆలయానికి దారి ఇదే!
స్వామిమలై అంటే "స్వామి కొండ" అని అర్థం. విజయం, జ్ఞానం, విజ్ఞానం కోసం స్వామిని దర్శించుకుంటారు భక్తులు. ఈ ఆలయంలో ఆది కృతిగై పండుగ చాలా ప్రత్యేకం. తమిళ నెలల్లో మొదటిదైన ఆది ( జూలై-ఆగస్టు)లో జరుపుకుంటారు. ఈ సమయంలో స్వామిమలైకి భక్తులు కాలినడకన చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. సుబ్రహ్మణ్యస్వామి భక్తులు తప్పనిసరిగా దర్శించుకోవాలని భావించే ఆలయం స్వామిమలై. ఇక్కడ వాతావరణం ఆధ్యాత్మికనే ఆదందాన్ని, మానసిక ప్రశాంతతను కలిగిస్తుందంటారు భక్తులు.
కొండపై మురుగన్ కొలువై ఉండగా..తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరురు కొండ దిగువ భాగంలో దర్శనమిస్తారు. హిందూ పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో శివుడికి ..మురుగన్ ప్రణవ మంత్రం అర్థాన్ని వివరించాడు. విశ్వం మొత్తం "ఓం" నుంచి వచ్చిందని..అన్నిటికీ మూలం ఓంకారం అని విశ్వసిస్తారు. దీని అర్థాన్ని స్వామిమలైలో తండ్రికి వివరించాడు మరుగున్. శివుడికి ఓకారం అర్థం చెప్పడం ఏంటి అనే సందేహం రావొచ్చు.. దానివెనుక ఓ కథనం చెబుతారు. ఓసారి భృగు మహర్షి తపస్సు చేస్తూ తనకు భంగం కలిగించేవాళ్లు బ్రహ్మ జ్ఞానాన్ని మర్చిపోతారని శాపం ఇస్తాడు. ప్రత్యక్షమైన శివుడిని చూడకపోవడంతో తట్టి లేపుతాడు శివుడు. మహర్షి శివయ్యను చూసి సంతోషిస్తాడు కానీ..తన తపస్సుకి భంగం కలిగించేవారికి ముందుగానే శాపం ఇచ్చిన విషయం గుర్తుచేస్తాడు. పరమేశ్వరుడిని క్షమించమని వేడుకుంటాడు. అప్పుడు ఆ శాపాన్ని తీసుకున్న శివుడు తన తనయుడి ద్వారా శాపవిమోచనం జరుగుతుందని చెబుతాడు. అలా..శివుడు ప్రణవ మంత్రాన్ని మరిచిపోతే మురుగన్ వివరిస్తాడు.
Also Read: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!
స్వామిమలై క్షేత్రానికి ఎలా చేరుకోవాలి - రైలు, రోడ్డు, వాయు మార్గంలో ఎలా వెళ్లాలంటే..
రోడ్డు మార్గం
స్వామిమలై హైవేకి దూరంగా ఉంటుంది. కుంభకోణం నుంచి 5 కిలోమీటర్ల దూరం, తంజావూరు నుంచి అయితే 40 కిలోమీటర్లు. ఈ రెండు ప్రధాన నగరాలకు ప్రభుత్వ-ప్రైవేట్ బస్సులున్నాయి అన్ని ప్రాంతాల నుంచి. తంజావూరు, కుంభకోణం చేరుకుంటే అక్కడి నుంచి స్వామిమలైకి వెళ్లడం చాలా సులభం. ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
రైలు మార్గం
ట్రైన్ జర్నీ చేయాలి అనుకుంటే కుంభకోణం సమీపంలో రైల్వే స్టేషన్ ఉంది. చెన్నై, తంజావూరు , తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్స్ లో దిగినా అక్కడి నుంచి ఆటో, టాక్సీలు ఉంటాయి
వాయు మార్గం
స్వామిమలైకి సమీపంలోని విమానాశ్రయం అంటే తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడి నుంచి స్వామిమలై దాదాపు 90 కిలోమీటర్లు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అయితే స్వామిమలై 250 కిలోమీటర్లు ఉంటుంది. చెన్నై కి అన్ని ప్రాంతాల విమానాశ్రయాల నుంచి విమానాలున్నాయి.
Also Read: ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

