ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP Desam
గంభీర్ సార్ సంగతి తెలిసిందేగా..ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియని పరిస్థితి. మొన్న ఇంగ్లండ్ తో టీ20, వన్డే సిరీస్ లు గెలిచాం కాబట్టి ఓకే కానీ లేదంటే గంభీర్ సార్ పరిస్థితి ఈపాటికే ఊస్టింగ్ అయిపోయేదనేది వాస్తవం. అయితే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ సెలక్షన్ పైనా నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అయిన అజిత్ అగార్కర్ తో గొడవ పడ్డాడట గంభీర్. దీనికి మూడు కారణాలు ఉన్నాయి.
1 రిషభ్ పంత్
ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ ను అనౌన్స్ చేసినప్పుు అగార్కర్ అండ్ టీమ్ కి ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ రిషభ్ పంత్. బట్ ఇప్పుడు మాత్రం అది కేఎల్ రాహుల్ గా మార్చేశాడంట గంభీర్. పంత్ టీమ్ లో ఉన్నా సరే రాహుల్ కే వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించి అతనే మ్యాచ్ లో ఆడేలా చేస్తున్నాడట. మరి పంత్ ను ఏం చేద్దామంటే ఆన్సర్ ఇవ్వట్లేదటం గంభీర్.
2. శ్రేయస్ అయ్యర్
ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ జరిగింది కదా. దాన్ని ప్రయోగాలకు ఉపయోగించుకుంది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. వాస్తవానికి ఆ వన్డే సిరీస్ లో జైశ్వాల్ తో డెబ్యూ చేయించి వన్డేలు కూడా ఆడించాలి అనేది ప్లాన్. కానీ ఇంగ్లండ్ తో ఫస్ట్ వన్డేకి కొహ్లీకి గాయం అవటంతో శ్రేయస్ అయ్యర్ కి ఊహించని ఆఫర్ వచ్చింది. అనుకోకుండా వచ్చిన ఆఫర్ ను వాడుకున్న అయ్యర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో..మిగిలిన వన్డేలు ఆడించటంతో పాటు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి ఫైనల్ టీమ్ లో చోటిస్తానంటున్నాడు గంభీర్. జైశ్వాల్ తీసి పక్కన పడేశారు.
3. అక్షర్ పటేల్
ఇది అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ల కంటే ముందుగా అక్షర్ పటేల్ ను తీసుకొచ్చి ఐదోస్థానంలో ఆడిస్తున్నాడు గంభీర్. ఫలితంగా కేఎల్ రాహుల్ కి ఆడే ఛాన్స్ ఎక్కువగా రావట్లేదు. ఇది అతని కెరీర్ పై ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉన్నా వ్యక్తిగత ప్రదర్శనల కంటే టీమ్ బాగుండటం ఇంపార్టెంట్ అంటున్నాడంట గంభీర్.
గంభీర్ నిర్ణయాల వెనుక రోహిత్ శర్మ మద్దతు కూడా ఉంది కానీ అగార్కర్ కిఈ విషయం నచ్చక..గంభీర్ తో గొడవపడ్డాడని ఇన్ సైడ్ టాక్. టీమ్ లో ప్లేయర్లు కాన్ఫిడెన్స్ కోల్పోయేలా చేయటం..పంత్ లాంటి ప్లేయర్ సేవలు వాడుకోకపోవటం...రాహుల్ లాంటోడు టీమ్ లో తీసుకుని బ్యాటింగ్ ఆడే ఛాన్స్ ఎక్కడో ఇవ్వటం లాంటివి టీమ్ ప్రదర్శన మీద అందునా ఇన్నేళ్ల తర్వాత జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మీద ఫలితం చూపిస్తాయనేది అగార్కర్ వాదన. మరి గంభీర్ సార్ తన నిర్ణయాలతో టీమిండియా ను ఏ లెవల్ కి తీసుకువెళ్తారో చూడాలి.





















