Tuni Municipality Vice Chairman: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Kakinada News | మొదట టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. చివరికి కోరం లేకపోవడంతో తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.

Tuni Municipality Vice Chairman | తుని: కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలో గందరగోళం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. మరోవైపు కోరం సరిపోకపోవడంతో తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మంగళవారం నాడు ఎన్నికల నిర్వహిస్తామని సంబంధిత అధికారి తెలిపారు.
మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు. టీడీపీ మద్దతుగా ఉన్న కౌన్సిలర్లు 10 మంది హాజరు కాగా, వైసీపీ కౌన్సిలర్లు రాకపోవడంతో కోరం లేదని ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. కోరం లేని కారణంగా వైస్ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక సైతం వాయిదా పడింది. వైసీపీ కౌన్సిలర్లు ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో కోరం లేని కారణంగా మంగళవారానికి ఎన్నిక వాయిదా వేశారు.
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ
ఇటీవల కొన్ని హిందూపురం సహా కొన్ని చోట్ల మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికలు, నగర పాలక పంచాయతీ ఎన్నికలు జరగగా.. కొన్నిచోట్ల ఎన్నిక వాయిదా పడింది. ఈ క్రమంలో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు ఎన్నిక ఉండటంతో మున్సిపల్ కార్యాలయం వద్దకు సోమవారం ఉదయం 10 మంది టీడీపీ మద్దతు కౌన్సిలర్లు వచ్చారు. వైసీపీ కౌన్సిలర్లు ఓటింగ్ లో పాల్గొనేందుకు ఆఫీసుకు రాలేదు. తుని మున్సిపల్ ఆఫీసు సమీపంలో ఒక్కసారిగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తుండగా.. మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా, వైసీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కూటమి వర్గీయులదే తప్పు అని, తమపై పెత్తనం చెలాయించడం కరెక్ట్ కాదని పోలీసులకు సూచించారు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య గొడవ పెరిగే అవకాశం ఉందని, మరోవైపు వైస్ చైర్మన్ ఎన్నిక ఉండటంతో తుని మున్సిపల్ ఆఫీసు వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
Also Read: Nara Lokesh: జగన్ పాలనతో ఏపీలో పెద్ద ఎత్తున ఆర్థిక విధ్వసం- లెక్కలు వెల్లడించిన నారా లోకేష్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

