WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
నాలుగో వికెట్ కు హర్లీన్ డియోల్ , డియోంద్ర డాటిన్ అజేయంగా 58 పరుగులు జోడించి జట్టును అలవోకగా గెలిపించారు. దీంతో తొలి మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో ఎదురైన పరాజయం నుంచి కోలుకుని గుజరాత్ గెలిచింది.

GG Vs Up Live Updates: యాష్లీ గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (32 బంతుల్లో 52, 5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో చెలరేగడంతో డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ జెయింట్స్ బోణీ కొట్టింది. ఆదివారం వడొదరలో జరిగిన లీగ్ మ్యాచ్ లో యూపీ వారియర్జ్ పై ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 143 పరుగులు చేసింది. కెప్టెన్ దీప్తి శర్మ (27 బంతుల్లో 39, 6 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచింది. ప్రియా మిశ్రా మూడు వికెట్లతో రాణించింది. అనంతరం ఛేదనను 18 ఓవర్లలో నాలుగు వికెట్లకు 144 పరుగులు చేసి గుజరాత్ పూర్తి చేసింది. నాలుగో వికెట్ కు హర్లీన్ డియోల్ (18 బంతుల్లో 34 నాటౌట్, 4 ఫోర్లు), డియోంద్ర డాటిన్ (18 బంతుల్లో 33 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా 58 పరుగులు జోడించి జట్టును అలవోకగా గెలిపించారు. బౌలర్లలో సోఫీ ఎకిల్ స్టోన్ కు రెండు వికెట్లు దక్కాయి. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో ఎదురైన పరాజయం నుంచి కోలుకుని గుజరాత్ విజయం సాధించినట్లయ్యింది. యాష్లీ గార్డెనర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Wickets ✅
— Women's Premier League (WPL) (@wplt20) February 16, 2025
Runs ✅
Outstanding catch ✅#GG skipper Ash Gardner wins the Player of the Match award for her commanding all-round show 🫡
Scorecard ▶ https://t.co/KpTdz5nl8D#TATAWPL | #GGvUPW pic.twitter.com/i8owZcnK4t
విఫలమైన బ్యాటర్లు..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన దిగిన యూపీకి ఏది కలిసి రాలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి భారీ స్కోరు సాధించ లేక పోయింది. ఒక దశలో 22-2తో ఉన్న జట్టును దీప్తి ఆదుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్ ఉమా ఛెత్రీ (24)తో ఆదుకునే ప్రయత్నం చేసింది. వీరిద్దరూ మూడో వికెట్ కు 51 పరుగులు జోడించి ఇన్నింగ్స్ కుదుట పరిచారు. అయితే పదో ఓవర్ చివరి బంతికి ఉమా ఔటయ్యాక పరిస్థితి చేజారి పోయింది. వరుసగా వికెట్లు కోల్పోయిన యూపీ 117-8తో నిలిచింది. ఈ స్థితిలో అలనా కింగ్ (19 నాటౌట్), సైమా థాకూర్ (15) రాణించడంతో ఓ మోస్తరు స్కోరుకు యూపీ పరిమితమైంది. మిగతా బౌలర్లలో గార్డెనర్, డాటిన్ లకు రెండు, కాశ్వీ గౌతమ్ కు ఒక వికెట్ లభించింది.
Most times scoring 50+ runs and picking up 2+ wickets in a same match in WPL:
— Akshay Tadvi 🇮🇳 (@AkshayTadvi28) February 16, 2025
3 - Ashleigh Gardner (Gujarat Giants)
2 - Deepti Sharma (UP Warriorz)
1 - Hayley Matthews (Mumbai Indians)
1 - Alice Capsey (Delhi Capitals) pic.twitter.com/IK5arTYf2S
ఆరంభంలోనే షాక్..
ఛేజింగ్ లో గుజరాత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ బెత్ మూనీ, వన్ డౌన్ బ్యాటర్ డయలాన్ హేమలత డకౌట్లుగా వెనుదిరిగారు. ఈ దశలో గార్డెనర్ సిసలైన ఆటతీరు ప్రదర్వించింది. ఓపెనర్ లారా వాల్వర్ట (22)తో కలిసి జట్టును ముందుకు నడిపింది. తను ఎదురుదాడికి దిగుతూ యూపీ బౌలర్లను ఆత్మ రక్షణలో పడేసింది. దీంతో మూడో వికెట్ కు 42 బంతుల్లోనే 55 పరుగులు జమయ్యాయి. ఆ తర్వాత లారా వెనుదిరిగినా, ఏమాత్రం వెనుకంజ వేయని గార్డెనర్ 28 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో గార్డెనర్ ఔటైనా మిగతా లాంచనాన్ని హర్లీన్, డాటిన్ పూర్తి చేశారు. మిగతా బౌలర్లలో గ్రేస్ హారీస్, తహ్లియా మెక్ గ్రాత్ కు చెరో వికెట్ దక్కింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

