Bal Yeshu Celebration: ఆదిలాబాద్ జిల్లాలో దివ్య బాల యేసు పండుగ మహోత్సవ వేడుకలు, ఎందుకు జరుపుకుంటారంటే !
Adilabad News | ఆదిలాబాద్ జిల్లాలో దివ్య బాల యేసు పండుగ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బాల యేసు పండుగ విశేషాలు ఇలా ఉన్నాయి.

Adilabad News | ఆదిలాబాద్: క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను గుడ్ ఫ్రైడే వేడుకలను జరుపుకోవడం చూసాం.. కానీ బాల యేసు పండుగ మహోత్సవ వేడుకలు జరుపుకోవడం ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా చూశారా.. అయితే బాల యేసు పండుగ మహోత్సవ వేడుకలను ఎక్కడ జరుపుకుంటారు. ఈ బాల యేసు పండుగ యొక్క ప్రత్యేకత ఏంటీ.. మరి ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం రండి.
దివ్య బాల యేసు మహోత్సవ వేడుకలు
ఆదిలాబాద్ జిల్లాలోనీ రోమన్ క్యాథలిక్ చర్చిలలో ప్రతీ ఏటా ఫిబ్రవరి నెలలో దివ్య బాల యేసు పండుగ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. చర్చి వార్షికోత్సవ వేడుకలను సైతం బాల యేసు పండుగ మహోత్సవ వేడుకల సందర్భంగా క్రిస్మస్ కన్నా ఘనంగా జరుపుకుంటారు. అదిలాబాద్ జిల్లాలోనీ అన్ని రోమన్ క్యాథలిక్ చర్చిలలో బాల యేసు పండుగ మహోత్సవ వేడుకలు ముగిసాయి. చివరగా ఇంద్రవెల్లిలోని హోలీ ట్రినిటీ రోమన్ క్యాథలిక్ చర్చిలో చర్చి 60వ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా దివ్య బాల యేసు పండుగను ఘనంగా జరుపుకున్నారు.

చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
బాల యేసు పండుగ చర్చి వార్షికోత్సవ వేడుకల సందర్భంగా చర్చిని రంగురంగుల విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. చర్చి ప్రాంగణంలో ఆకర్షణియమైనా మెరిసే గొడుగులను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. చివరి రోజు ఆదివారం రాత్రి చర్చిలో చర్చి వార్షికోత్సవంతో పాటు దివ్య బాల యేసు పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు ముఖ్య అతిథులుగా ఫాదర్ బైజుజోన్ సిర్పూర్, ముఖ్య ప్రసంగికులుగా ఫాదర్ మాదాను జోసెఫ్ హైదారాబాద్ నుండీ హాజరై బాల యేసు పండుగ సందర్భంగా బైబిల్ బోధనలు చేశారు. భక్తి పారవశ్యమైన క్రీస్తు పాటలు పాడుతూ బాల యేసు పండుగను కొనియాడుతూ ఘనంగా వేడుకలను జరుపుకున్నారు.

అనంతరం అందరు విద్యుత్ కాంతుల మధ్య కొవ్వుత్తులు వెలిగించి చర్చి నుండీ అంబేద్కర్ చౌక్ వరకు ఇంద్రవెల్లి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తిరిగి చర్చికి చేరుకొని చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రోమన్ క్యాథలిక్ చర్చి ఫాదర్లు, ఇంద్రవెల్లి చర్చి ఫాదర్ పి.ఎల్. జోసెఫ్, ఉమ్మడి జిల్లాలోని రోమన్ క్యాథలిక్ చర్చి సంఘస్తులు సభ్యులు పాల్గొన్నారు.

ప్రతియేటా దివ్య బాల యేసు వేడుకలు
ప్రతియేటా ఇలా చర్చి వార్షికోత్సవ వేడుకలో భాగంగా దివ్య బాల యేసు పండుగ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటామని చర్చికి వచ్చే భక్తులు, చర్చి ఫాదర్ abp దేశం తో వివరించారు. దివ్య బాల యేసును చిన్నపిల్లలతో సమానంగా పోల్చుకొని పిల్లలను సైతం దైవంగా భావిస్తామన్నారు. క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పండుగను ఎంతగా జరుపుకుంటామో ఆ తర్వాతిగా ఫిబ్రవరి నెలలో అన్ని రోమన్ క్యాథలిక్ చర్చిలలో ఈ బాల యేసు పండుగను ఘనంగా జరుపుకుంటామన్నారు.
Also Read: TG New Ration Cards: మీకు రేషన్ కార్డు లేదా? తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్డుల జారీ చేసేది ఎప్పుడంటే..





















