స్టార్ హీరోయిన్ కెరీర్ నాశనం చేసిన ఒక్క తప్పు... ఆ రాత్రంతా జైల్లోనే... ఇప్పుడు ఛాన్సుల్లేవ్, ఆవిడ ఎవరో తెలుసా?
Actress : వెయ్యి గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చింది అన్నట్టు, 27 సినిమాలు చేసిన ఓ స్టార్ హీరోయిన్ తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పు కారణంగా ఓవర్ నైట్ ఫేడౌట్ అయ్యింది.
![స్టార్ హీరోయిన్ కెరీర్ నాశనం చేసిన ఒక్క తప్పు... ఆ రాత్రంతా జైల్లోనే... ఇప్పుడు ఛాన్సుల్లేవ్, ఆవిడ ఎవరో తెలుసా? Actress who won National Award as Best Child Artist later starred in Telugu movies as a lead one mistake ruined her career leading to night in jail స్టార్ హీరోయిన్ కెరీర్ నాశనం చేసిన ఒక్క తప్పు... ఆ రాత్రంతా జైల్లోనే... ఇప్పుడు ఛాన్సుల్లేవ్, ఆవిడ ఎవరో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/d0ad999105755defc169d173cb0a38d017381466576011106_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సినిమా ఇండస్ట్రీలో ఎవరి ఫేట్ ఎలా ఉంటుంది ? అనేది ఊహించడం కష్టమే. కొంతమంది నటీనటులు రాత్రికి రాత్రి ఊహించని ఫేమ్ తో ఓవర్ నైట్ స్టార్స్ అవుతారు. మరి కొంతమంది ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేసినా అదృష్టం కలిసి రాదు. మరికొంత మంది అదృష్టం కలిసి వచ్చినప్పటికీ అనవసరమైన వివాదాల కారణంగా దాన్ని నిలబెట్టుకోలేరు. అలా ఓ హీరోయిన్ ఏకంగా 27 సినిమాలు చేసి, మంచి ఫామ్ లో ఉన్నప్పుడే ఓ చిన్న తప్పు కారణంగా కెరీర్ ను నాశనం చేసుకుంది. పైగా ఓ రాత్రంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది. నేషనల్ అవార్డు అందుకున్నప్పటికీ ఆ ఒక్క తప్పు కారణంగా ఆమె కెరీర్ ఇప్పటిదాకా ట్రాక్ లోకి రాలేదు.
ఫస్ట్ మూవీతోనే పాపులర్
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు శ్వేతా బసు ప్రసాద్. టాలీవుడ్ లోకి ఆమె 'కొత్త బంగారు లోకం' సినిమాతో అడుగు పెట్టింది. ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. కానీ స్టోరీ సెలక్షన్లో తడబడటం వల్ల 'కొత్త బంగారులోకం' తర్వాత అలాంటి హిట్టును అందుకోలేకపోయింది శ్వేత. ఇక ఆ తర్వాత వివాదాల్లో ఇరుక్కోవడంతో ఆమెకు పూర్తిగా అవకాశాలు కరువయ్యాయి. పర్సనల్ లైఫ్ పై కూడా ఆ ఎఫెక్ట్ గట్టిగానే పడింది.
1991 జనవరి 11న జంషెడ్ పూర్ లో జన్మించిన శ్వేత చిన్న వయసులోనే హీరోయిన్ కావాలనే ఆశతో ముంబైలో అడుగు పెట్టింది. 2002లో ఆమె 'మక్డి' అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే పాపులర్ టీవీ సిరీస్ 'కహాని ఘర్ ఘర్ కి'లో ఆమె పోషించిన పాత్ర మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు రావడం మొదలైంది. అందులో భాగంగానే 'కొత్త బంగారులోకం' సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చింది. ఈ మూవీతో శ్వేత క్యూట్ నెస్ ఓవర్ లోడ్ కావడంతో యూత్ ఆమెకు ఫిదా అయ్యారు. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం వెండితెరకు పూర్తిగా దూరమైంది. 34 ఏళ్ల వయసులో భర్తతో విడిపోయి, సింగిల్ గా లైఫ్ ను లీడ్ చేస్తోంది.
ఒక్క వివాదంతో కెరీర్ స్మాష్
2014లో శ్వేతా బసు ప్రసాద్ హైదరాబాద్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అరెస్టు అయింది. ఆ టైమ్ లో శ్వేత ఓ రాత్రంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది. చిత్రపరిశ్రమను కుదిపేసిన ఈ అరెస్ట్ ఆమె కెరీర్ ను పూర్తిగా దెబ్బతీసింది. అయితే ఈ సంఘటన వెనుక ఉన్న అసలు సూత్రధారిని పోలీసులు ఆ తర్వాత పట్టుకోవడం, శ్వేతా బసు ప్రసాద్ ఇందులో అమాయకురాలు అన్న విషయం బయట పడడం జరిగింది. కానీ ఇవేమీ ఆమె కెరీర్ కి హెల్ప్ చేయలేకపోయాయి. ఈ వివాదం తర్వాతే 2017లో ఆమె చిత్ర నిర్మాత రోహిత్ మిట్టల్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. 2018లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. కానీ పట్టుమని ఏడాది కూడా వీరిద్దరి వైవాహిక బంధం సంతోషంగా సాగలేదు. 2019లో శ్వేత తన మ్యారేజ్ లైఫ్ కి గుడ్ బై చెప్పింది. అలా తన ప్రమేయం లేకుండానే జరిగిన ఆ తప్పు శ్వేతా బసు ప్రసాద్ కెరీర్ ని పూర్తిగా నాశనం చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)