Ram Charan: 'దిల్' రాజుకు రామ్ చరణ్ మరో సినిమానా? సారీ... ప్రజెంట్ కమిట్మెంట్ ఏదీ లేదు
Ram Charan Upcoming Movies: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అగ్ర నిర్మాత దిల్ రాజు కలయికలో మరో సినిమా రానుందని ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజం ఏది లేదని సమాచారం.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా శంకర్ దర్శకత్వం వహించిన 'గేమ్ చేంజర్' (Game Changer) సంక్రాంతికి విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ విషయం సాధిస్తుందని మెగా ఫ్యాన్స్ అంతా బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే... ఆశించిన విజయం సాధించలేదు. వసూళ్లు సైతం రాలేదు. దాంతో నిర్మాతకు మరొక సినిమా చేసేందుకు హీరో మాట ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. వార్త నిజమేనా? అసలు విషయం ఏమిటి? వంటి వివరాల్లోకి వెళ్తే...
'దిల్' రాజుకు మరో సినిమా లేదు...
రామ్ చరణ్ కమిట్మెంట్ ఇవ్వలేదు!
రామ్ చరణ్, నిర్మాత 'దిల్' రాజు మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది. 'గేమ్ చేంజర్' కంటే ముందు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' సినిమా చేశారు. రామ్ చరణ్ నటించిన కొన్ని సినిమాలను నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆయన నిర్మాణంలో సినిమాలు చేయడానికి రామ్ చరణ్ రెడీ. అయితే... ప్రస్తుతానికి కమిట్మెంట్ ఏది ఇవ్వలేదని తెలిసింది.
'గేమ్ చేంజర్' రిజల్ట్ తర్వాత 'దిల్' రాజుకు ఆయన నిర్మాణంలో మరొక సినిమా చేస్తానని రామ్ చరణ్ మాట ఇచ్చినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఒక్క శాతం కూడా నిజం లేదని తెలిసింది. ప్రస్తుతానికి గ్లోబల్ స్టార్ చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి.
సుకుమార్ దర్శకత్వంలో... ఆయన శిష్యుడితో!
Ram Charan Upcoming Movies: 'గేమ్ చేంజర్' విడుదల కంటే ముందు కొత్త సినిమాను సెట్స్ మీదకు రామ్ చరణ్ తీసుకు వెళ్లారు. 'ఉప్పెన'తో భారీ విషయం సాధించిన, మొదటి సినిమాతో 100 కోట్ల క్లబ్బలోకి వెళ్ళిన సానా బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ చరణ్ ఒక సినిమా చేస్తున్నారు. హీరోగా ఆయన 16వ సినిమా అది (RC16). ఆ తర్వాత బుచ్చిబాబు గురువు సుకుమార్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు.
Also Read: 'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించిన 'రంగస్థలం' బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడం మాత్రమే కాదు... ఓ హీరోగా కంటే నటుడిగా రామ్ చరణ్ మీద ప్రేక్షకులలో ఎక్కువ గౌరవం పెంచిన సినిమాగా నిలిచింది. 'రంగస్థలం' తర్వాత 'పుష్ప ది రైజ్', 'పుష్ప ది రూల్' సినిమాలు చేశారు సుకుమార్. ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ హీరోగా మరొక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. హీరోగా ఆయన 17వ సినిమా అది (RC17). ప్రస్తుతానికి రామ్ చరణ్ కమిట్ అయిన సినిమాలు ఈ రెండు మాత్రమే అని, 'దిల్' రాజు నిర్మాణంలో మరొక సినిమా చేయడానికి అంగీకరించారు అనే వార్తల్లో నిజం లేదని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా రామ్ చరణ్ హీరోగా సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారని ఒక టాక్. 'కేజిఎఫ్' విడుదలైన తర్వాత మెగాస్టార్ ఇంటికి ప్రశాంత్ నీల్ వెళ్లారు. తండ్రి తనయులు చిరు, చరణ్, నీల్ కలిసి దిగిన ఫోటో కూడా బయటకు వచ్చింది. చరణ్ హీరోగా నీల్ దర్శకత్వంలో డివివి దానయ్య ఒక సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అలాగే, రామ్ చరణ్ సినిమాలు చేయబోయే దర్శకుల లిస్టులో లోకేష్ కనకరాజు పేరు కూడా వినపడుతోంది. మరి అది ఎప్పుడు ఓకే అవుతాయో!?
Also Read: పద్మ భూషణ్ బాలకృష్ణ కోసం... ఈసారైనా అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

