Horoscope Today 16 February 2025: ఈ రాశులవారు నూతన ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరి 16 రాశిఫలాలు
మేష రాశి
మీ ప్రతిభను అర్ధవంతంగా ఉపయోగించగలరు. మీరు కుటుంబంలో ప్రశంసలు అందుకుంటారు. పాత రుణాన్ని తిరిగి చెల్లించడంలో మీరు విజయం సాధిస్తారు. మహిళలు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
వృషభ రాశి
ఈ రోజు ఏదో విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. అనవసర కోపాన్ని నియంత్రించండి. మాటల్లో సమతుల్యత పాటించాలి. విద్యార్థులు పనిలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం బావుంటుంది.
మిథున రాశి
కొత్త సమాచారం పొందడంలో నిమగ్నమై ఉంటారు. వ్యక్తులు మీ పట్ల త్వరగా ఆకర్షితులవుతారు. మీ ప్రవర్తనలో వినయం ఉంచండి. మీ పని శైలిని మెరుగుపరచవచ్చు. కొత్త ఇల్లు కొనాలనే ఆలోచన మెరుగుపడుతుంది.
Also Read: 365 రోజులకు గుర్తుగా 365 మెట్లు.. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం విశిష్టత ఇదే!
కర్కాటక రాశి
ఈ రోజు మీరు అనుకూల ఫలితాలు పొందుతారు. స్నేహితులతో వ్యాపారాన్ని ప్లాన్ చేయవచ్చు. మీరు ప్రేమ వ్యవహారాలను ఆనందిస్తారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రయాణంలో ఇబ్బంది ఉంటుంది.
సింహ రాశి
ఈ రోజు మీరు ఇంట్లో మంచి సమయాన్ని వెచ్చిస్తారు. మీ సున్నితత్వాన్ని అందరూ అవకాశంగా తీసుకుంటారు. పెద్దలకు సమయం కేటాయిస్తారు. ఉద్యోగం గురించి ఆందోళన ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు.
కన్యా రాశి
వివాహిత సంబంధాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన ప్రాజెక్టులో నూతన పెట్టుబడి పెట్టవచ్చు. మానసిక శాంతిని అనుభవిస్తారు
Also Read: అరుల్మిగు సోలైమలై మురుగన్ సేవలో పవన్ కళ్యాణ్ - ఈ ఆలయ చరిత్ర తెలుసా మీకు!
తులా రాశి
మీ నిర్ణయాలను విశ్వసించండి. కొన్ని విషయాల్లో వ్యతిరేక ధోరణి చూపించవద్దు. బంధాలు కొంత బలహీనంగా అనిపిస్తాయి. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృశ్చిక రాశి
ఈ రాశులవారు సాంకేతిక ప్రయోజనాలు పొందుతారు. బంధాల విషయంలో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. మీ ప్రతిభ చూపించేందుకు ఇదే మంచి సమయం.
ధనస్సు రాశి
చేపట్టిన పనులు పూర్తవుతాయి. మీ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారు. కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తారు. బంధువులను కలుస్తారు. ఇతరుల సలహాపై పెద్దగా శ్రద్ధ చూపవద్దు. ప్రత్యర్థులు అవకాశం కోసం చూస్తున్నారు మీరు అప్రమత్తంగా ఉండాలి
మకర రాశి
తల్లిదండ్రుల నుంచి మీకు సహకారం పెరుగుతుంది. ఆస్తి కొనుగోలు అమ్మకం గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు వారి కెరీర్ గురించి చాలా తీవ్రంగా తీసుకుంటారు. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
Also Read: ఔషధ మొక్కల రసాయనాలతో అభిషేకం, మూలికా ప్రసాదం - పవన్ దర్శించుకున్న అగస్త్య మహర్షి ఆలయానికి దారి ఇదే!
కుంభ రాశి
ఈ రోజు వ్యాపారంలో హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉంది. ప్రభావవంతమైన వ్యక్తులతో సమస్యలు ఉండవచ్చు. దీర్ఘకాల అనారోగ్యం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలను స్నేహితుల ముందు వ్యక్తం చేసేయవద్దు. మీ భావాలను అంతా ఎగతాళి చేస్తారు.
మీన రాశి
మీ సూత్రాలతో రాజీ పడకండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచన ఉంటే అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించండి. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది. డబ్బు సమస్యలు తొలగిపోతాయి
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.





















