SSMB 29: మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
SSMB 29 Movie Title: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రాబోతున్న పాన్ వరల్డ్ మూవీకి మేకర్స్ రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరగుతోంది.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ SSMB 29. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి లీక్స్ బయటకు రాకుండా రాజమౌళి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఫలితంగా మూవీపై రోజు రోజుకూ ప్రపంచవ్యాప్తంగా మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం ఈ ప్రాజెక్టు కోసం రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
SSMB 29 కోసం రెండు టైటిల్స్
తాజా సమాచారం ప్రకారం రాజమౌళి SSMB 29 మూవీ కోసం రెండు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ను అనుకుంటున్నారట. అందులో 'గరుడ', 'మహారాజ్' అనే టైటిల్స్ ఉన్నాయని అంటున్నారు. అయితే రాజమౌళి ఇందులో 'మహారాజ్' అనే టైటిల్ పై ఆసక్తిని చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదైతేనే సినిమా స్టోరీకి సరిగ్గా సెట్ అవుతుందని ఆయన భావిస్తున్నారని ఇన్సైడ్ వర్గాల సమాచారం. కానీ ఇప్పటిదాకా టైటిల్ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి రకరకాల టైటిల్స్ పెట్టబోతున్నారని రూమర్లు షికారులు చేశాయి. మరి రాజమౌళి ఈ మూవీకి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేశాడు అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: మహేష్ బాబు కంటే నమ్రత ఎన్నేళ్లు పెద్దదో తెలుసా... ఇద్దరి మధ్య ఇంత ఏజ్ గ్యాప్ ఉందా?
అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్...
ఇప్పటికే రాజమౌళి SSMB 29 మూవీ షూటింగ్ ని షురూ చేశారు. రీసెంట్ గా ప్రియాంక చోప్రా హైదరాబాద్ కి రావడంతో, మహేష్ బాబుతో పాటు ఆమె కూడా షూటింగ్లో పాల్గొన్నారు. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ మూవీకి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలోనే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలు కానుంది. కాగా ఈ సినిమా కథాంశం బ్రిటిష్ - దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ ఎడిసన్ స్మిత్ రచనల నుంచి ప్రేరణ పొందిందని టాక్ నడుస్తోంది. స్టోరీ మొత్తం ఆఫ్రికా అడవులలో ఉంటుందని చాలా కాలంగా వార్తలు కూడా విన్పిస్తున్నాయి.
SSMB 29 సెట్స్ లో కొత్త రూల్స్
ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలకు లీకు రాయుళ్లు అతిపెద్ద తలనొప్పిగా మారారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా సినిమా సెట్స్ నుంచి హీరో హీరోయిన్ల లుక్స్, కీలక సన్నివేశాల సీన్స్ లీక్ కావడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జక్కన్న మాత్రం పక్కా పకడ్బందీగా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా కనీసం SSMB 29 పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు రాలేదంటేనే ఆయన ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, రాజమౌళి సినిమాలో నటించే నటీనటులతో పాటు సెట్స్ లో పని చేసే సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఒక రూల్ ని పెట్టారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి సమాచారం లీక్ కాకుండా ఉండడానికి ఆయన ఏకంగా ఒక అగ్రిమెంట్ రాయించుకున్నారని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ, మూవీ నుంచి ఇప్పటిదాకా ఒక్క లీక్ కూడా బయటకు రాకపోవడంతో లీకు రాయుళ్లకు చెక్ పెట్టినట్టు అయ్యింది.
Also Read: తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

