Allu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP Desam
రామ్ చరణ్ పై చేసిన వ్యాఖ్యల వివాదంపై అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు. రామ్ చరణ్ తన కొడుకులాంటి వాడన్న అల్లు అరవింద్...తమ మధ్య బంధాన్ని చెడగొట్టొద్దని రిక్వెస్ట్ చేశారు. తండేల్ సినిమా కోసం ప్రెస్ మీట్ పెట్టిన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్..తొలుత నాగచైతన్య సినిమా పైరసీ అయ్యిందని ప్రకటించారు. దానిపై పోలీసుల దర్యాప్తు జరుగుతోందని సోషల్ మీడియాల్లో తండేల్ పైరసీ లింకులను షేర్ చేస్తున్న గ్రూప్స్ అడ్మిన్లూ జైలుకు వెళ్లక తప్పని ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హెచ్చరించారు. ఆ తర్వాత ప్రొడ్యూసర్లు బన్నీ వాసు, SKN లను పంపించేసిన అల్లు అరవింద్ ఇటీవల కాలంలో రామ్ చరణ్ పైన తను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండటంపై మాట్లాడారు. రామ్ చరణ్ తనకు ఎంతో ఇష్టమైన ఏకైక మేనల్లుడని అలాంటి వ్యక్తితో తన బంధం చాలా ఎమోషనల్ గా ఉంటుందని చెప్పారు అల్లు అరవింద్. అలాంటి బంధానికి భంగం కలిగేలా ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదంటూ చెప్పకనే చెప్పారు అల్లు అరవింద్.





















