Hyderabad Vijayawada Traffic Diversions: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్- విజయవాడ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపు
Lingamathula Swamy Jatara | తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర సూర్యాపేటలోని పెద్దగట్టు జాతర ఆదివారం రాత్రి ప్రారంభం కాగా, ఈ 20వ తేదీ వరకు హైదరాబాద్ - విజయవాడ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.

Peddagattu Jatara begins in suryapet | సూర్యాపేట: సమ్మక్క సారక్క జాతర తరువాత తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర సూర్యాపేట శ్రీ లింగమంతులస్వామి జాతర (Peddagattu Jatara). సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతర ఆదివారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. పెద్దగట్టు జాతరలో కీలకఘట్టమైర దేవరపెట్టె (లింగమంతుల స్వామి, అందెనపు చౌడమ్మ ఉత్సవ మూర్తులు)కు ఆనవాయితీ ప్రకారం కేసారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ దేవరపెట్టెను ఊరేగింపుగా ఫిబ్రవరి 16న అర్ధరాత్రి దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు జాతర జరిగే చోటుకు చేర్చారు. దీంతో శ్రీ లింగమంతుల స్వామి జాతర ప్రారంభమైందని నిర్వాహకులు వెల్లడించారు.
ఈ 20 వరకు ట్రాఫిక్ మళ్లింపులు
కేసారానికి చెందిన మెంతబోయిన వంశస్తుల దేవరగుడిలో దేవరపెట్టెకు నిర్వహించిన పూజల్లో సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌ష రెడ్డి, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమే్‌షరెడ్డి, మున్నా, గొర్ల, కులస్తులతో పాటు మాజీ ఎంపీ లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తరువాత అంత వైభవంగా జరిగే వేడుక సూర్యాపేట పెద్దగట్టు జాతర ఆదివారం రాత్రి ప్రారంభం కావడంతో హైదరాబాద్- విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతాయని కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ - విజయవాడ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా
విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కోదాడ వద్ద మళ్లిస్తున్నట్లు చెప్పారు. కోదాడ సమీపంలోని బాలాజీ నగర్ ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ మళ్లించి అటు నుంచి హుజుర్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు వాహనాలను పంపుతారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు కోదాడ వద్ద జాతీయ రహదారితో కలవనున్నాయి. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద నుంచి నల్గొండ అటునుంచి మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడల మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వెళ్లే వాహనాలను బీబీ గూడెం మీదుగా డైవర్ట్ చేస్తున్నారు. నాలుగు రోజులపాటు ఈ ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని, వాహనదారులు ఇది గమనించి ప్రయాణాలు చేయాలని కోదాడ డీఎస్పీ సూచించారు.
Hon’ble CM @Revanth_anumula Reddy sanctioned Rs 5 crores for conduct of Peddagattu Jatara in Suryapet as requested by me. I wholeheartedly thank the CM on behalf of the people of Suryapet. @TelanganaCMO pic.twitter.com/4dp2yj1t9D
— Uttam Kumar Reddy (@UttamINC) February 1, 2025
నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెద్దగట్టు జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లింగమంతుల స్వామి జాతర నిర్వహణకుగానూ రూ.5 కోట్లు కేటాయించిందని తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పెద్దగట్టు జాతరకు నిధుల విడుదల విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తెలిపారు. తాను రిక్వెస్ట్ చేయడంతో స్పందించిన ప్రభుత్వం నిధులు ఇచ్చిందని ఉత్తమ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరకు కేవలం రూ.5 కోట్లు కేటాయిస్తారా అని బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.
Also Read: Revanth Reddy: ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

