TGSRTC Discount: తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, టికెట్ ధరలపై ఆర్టీసీ డిస్కౌంట్
Telangana RTC News | తెలంగాణ నుంచి బెంగళూరుకు వచ్చి పోయే ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది., టికెట్ ధరలపై 10 డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.

TGSRTC MD Sajjanar News | హైదరాబాద్: తెలంగాణ నుంచి బెంగళూరు (Bengaluru)కు వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది. బెంగళూరు మార్గంలో టికెట్ ధరలో 10 శాతం రాయితీని తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) యాజమాన్యం కల్పిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరు రూట్ లో నడిచే అన్ని రకాల బస్సు సర్వీసుల్లోనూ రానుపోనూ ఈ రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ ఇస్తున్న ఈ డిస్కౌంట్ వల్ల ఒక్కొ ప్రయాణికులకు రూ.100 నుంచి రూ.160 వరకు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ రూట్ లో టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం ఆర్టీసీ వెబ్ సైట్ ని http://tgsrtcbus.in సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.
టికెట్ ధరలు పాతవి, కొత్తవి..
- ఏసీ స్లీపర్ బస్సులో బెర్త్ అయితే ప్రస్తుతం రూ.1569, డిస్కౌంట్ టికెట్ ధర రూ.1412
- ఏసీ స్లీపర్ సీటర్ అయితే ప్రస్తుతం రూ.1203, డిస్కౌంట్ టికెట్ ధర రూ.1083
- రాజధాని బస్సుల్లో ప్రస్తుతం రూ.1203, డిస్కౌంట్ టికెట్ ధర రూ.1083
- NAC స్లీపర్ బెర్త్ అయితే ప్రస్తుతం రూ.1160, డిస్కౌంట్ టికెట్ ధర రూ.1044
- NAC సీటర్ టికెట్ ధర ప్రస్తుతం రూ.951 అయితే, డిస్కౌంట్ ధర రూ.856
- సూపర్ లగ్జరీ టికెట్ ప్రస్తుత ధర రూ.946 అయితే, డిస్కౌంట్ ధర రూ.851కే వస్తుంది.
అదృష్టవంతుడు.. రెప్పపాటులో బయటపడ్డాడు
చిన్నారులతో రోడ్డు మీదకు వెళ్లారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రాణల మీదకు తీసుకొస్తుంది. ముఖ్యంగా హైవే లాంటి రోడ్లపైకి చిన్నారుల్ని తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని.. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాల బారిన పడతారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. ఓ వీడియో షేర్ చేసిన సజ్జనార్ అందరికీ ఈ బుడ్డోడిలా అదృష్టం ఉండదని ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
అదృష్టవంతుడు.. రెప్పపాటులో బయటపడ్డాడు.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 16, 2025
చిన్నారులను రహదారుల వెంట తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అందరికీ ఈ బుడ్డోడిలా అదృష్టం వరించదు. pic.twitter.com/p6VCewnMwl
Also Read: TG New Ration Cards: మీకు రేషన్ కార్డు లేదా? తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్డుల జారీ చేసేది ఎప్పుడంటే..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

