అన్వేషించండి

Social Media: భార్యను ట్రోల్‌ చేశారని.. బ్లాక్‌చైన్‌తో సొంత సోషల్‌ మీడియా!

మహిళలపై దుర్భాషలు ఇంకా ఆగడం లేదు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల్లో స్వేచ్ఛగా తమ గళాన్ని వినిపిస్తే ట్రోలింగ్ జరుగుతోంది. అందుకే మహిళల కోసం ఈవ్ వరల్డ్ రూపొందిస్తున్నారు.

నాగరికత, సాంకేతిక పెరుగుతున్నా మహిళలపై దుర్భాషలాడటం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది! వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల్లో స్వేచ్ఛగా తమ గళాన్ని వినిపించలేకపోతున్నారు. తమ అభిప్రాయాలను బలంగా చెప్పలేకపోతున్నారు. ఆన్‌లైన్ ట్రోలింగ్‌ వారి నోరు నొక్కేస్తోంది! అందుకే మగువల కోసమే ప్రత్యేకంగా ఓ సోషల్‌ మీడియా వేదికను రూపొందిస్తున్నారు. దానిపేరే 'ఈవ్‌ వరల్డ్‌'.

తరుణ్‌ కతియాల్‌.. భారత మీడియాలో ప్రముఖంగా వినిపించే పేరిది! జీ5, బిగ్‌ ఎఫ్‌ఎంకు ఫౌండర్‌ సీఈవోగా పనిచేశారు. స్టార్‌ ఇండియా, రిలయన్స్‌ బ్రాడ్‌కాస్ట్‌ నెట్‌వర్క్‌, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సహా ఇంకా మరికొన్ని సంస్థల్లో ఆయన కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయన సతీమణి మోనిషా సింగ్‌ కతియాల్‌ మీడియాలో పనిచేస్తారు. స్వేచ్ఛగా ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఒకసారి ఆమెను వాట్సాప్‌లో ఎవరో ట్రోలింగ్‌ చేశారు. పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామని భావించారు. అలా చేసినా ప్రయోజనమేంటి అన్న వారి ఆలోచనల్లోంచే 'ఈవ్‌ వరల్డ్‌' పుట్టింది.

2021, జూన్‌లో ఈవ్‌ వరల్డ్‌ కార్యరూపం దాల్చింది. సింగపూర్‌కు చెందిన జంగిల్‌ వెంచర్స్‌ ఇందులో పెట్టుబడి పెట్టింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ తరహాలో ఈ సోషల్‌ మీడియా ఉంటుంది. మహిళలు ఇందులో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకోవచ్చు. కంపెనీ ఉద్యోగుల్లోనూ 70 శాతం మంది మహిళలే ఉంటారు. బ్లాక్‌ చైన్ టెక్నాలజీతో ఈ వేదికను రూపొదిస్తుండటంతో మహిళా సాధికారతకూ కృషి చేస్తున్నారు. సభ్యులు తమ యాక్టివిటీ ద్వారా వర్చువల్‌ టోకెన్లు సంపాదించుకోవచ్చు. వాటి ద్వారా వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించొచ్చు. తక్కువ ధరకే ఎన్‌ఎఫ్‌టీలను కొనుగోలు చేయొచ్చు. మైక్రో ఎంటర్‌ప్రిన్యూర్లు తమ వ్యాపారాలను ప్రమోట్‌ చేసుకోవచ్చు. దీంతో ఈ వేదిక ద్వారా ఆదాయం సృష్టించొచ్చు.

దాదాపుగా ఈ వేదిక పూర్తి కావొచ్చింది. 2022, జనవరి-మార్చిలో ఈవ్‌ వరల్డ్‌ ఆరంభమవుతుందని అంచనా.

Also Read: 2000 Note : రూ. 2 వేల నోటు త్వరలోనే కనుమరుగు ! ఎవరికీ తెలియకుండానే కేంద్రం ఉపసంహరించుకుంటోందా ?

Also Read: Income Tax Filing: 31 చివరి తేదీ..! ఐటీఆర్‌ ఆలస్యమైతే పెనాల్టీ తప్పదు..! ఇలా చేయండి..!

Also Read: Forbes Most Powerful Women: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో 'భారతీయం'.. నిర్మలా, కమలా హారిస్‌కు చోటు

Also Read: Kia Carens: కియా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడంటే?

Also Read: Indian Mobile Congress 2021: మెరుపు వేగంతో దేశంలో 5Gని ప్రవేశపెట్టాలన్న ముకేశ్ అంబానీ

Also Read: Multibagger stock: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌ ఇది.!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget