అన్వేషించండి

Forbes Most Powerful Women: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో 'భారతీయం'.. నిర్మలా, కమలా హారిస్‌కు చోటు

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 37వ స్థానంలో నిలిచారు.

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి చోటుదక్కించుకున్నారు. ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదల చేసింది. వరుసగా మూడో ఏడాది కూడా నిర్మలా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఈ ఏడాది నిర్మలా సీతారామన్ 37వ ర్యాంకు దక్కించుకున్నారు. 2020లో ఆమె 41వ స్థానంలో, 2019లో 34వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ఉన్నారు. అమెరికా ఆర్థక మంత్రి జానెట్ యెల్లెన్ కంటే నిర్మలా రెండు స్థానాలు ముందున్నారు. జానెట్ యెల్లెన్ 39వ ర్యాంకు సాధించారు.

భారతీయులు..

నిర్మలా సీతారామన్‌తో పాటు మరికొంత మంది భారత మహిళలు ఈ జాబితాలో ఉన్నారు.

  1. హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓ- రోషిణి నాడార్ మల్‌హోత్రా- 52వ ర్యాంకు
  2. బైకాన్ ఎక్స్‌గ్యూటివ్ ఛైర్‌పర్సన్- కిరణ్ మజుందర్ షా - 72వ ర్యాంకు
  3. నాయకా వ్యవస్థాపకురాలు - ఫల్గుణి నాయర్ - 88వ ర్యాంకు 

ఫల్గుణి నాయర్ ఇటీవలే భారతదేశ ఏడవ మహిళా బిలియనీర్‌గా నిలిచారు. స్టాక్ మార్కెట్‌లో తన కంపెనీ అరంగేట్రం తర్వాత అత్యంత సంపన్నమైన బిలియనీర్‌గా మారారు.

టాప్- 5 వీరే..

  1. మెకెంజీ స్కాట్- అమెరికా నవలా రచయిత, ఫిలాంత్రపిస్ట్- మొదటి ర్యాంకు
  2. కమలా హారిస్- అమెరికా ఉపాధ్యక్షురాలు - 2వ ర్యాంకు
  3. క్రిస్టిన్ లగార్డ్- యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు హెడ్- 3వ ర్యాంకు
  4. మేరీ బర్రా- జనరల్ మోటార్స్ సీఈఓ- 4వ ర్యాంకు
  5. మెలిందా ఫ్రెంచ్ గేట్స్- ఫిలాంత్రపిస్ట్, బిజినెస్ ఉమెన్  - 5వ ర్యాంకు

విడాకుల తర్వాత..

అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన మెకెంజీ స్కాట్.. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ మాజీ భార్య. ఆమె నవలా రచయితగా, ఫిలాంత్రపిస్ట్‌గా పేరొందారు. 2019 మధ్యలో ఆమెకు, జెఫ్ బెజోస్‌కు విడాకులయ్యాయి. అమెజాన్‌లో 25 శాతం వాటాను భరణంగా ఆమెకు రాసిచ్చారు బెజోస్. అయితే తన సంపదలో సగానికి పైగా దాతృత్వంగా ప్రకటించారు.

ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్న మెలిందా ఫ్రెంచ్ గేట్స్.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మాజీ భార్య. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు ఆమె సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. విడాకుల తర్వత 2021 మే లో ఆమెకు 2.4 బిలియన్ డాలర్ల విలువైన వాటాను బిల్‌గేట్ రాసిచ్చారు. దీంతో ఆమె బిలియనీర్‌గా మారారు.

వీరు కూడా..

  • బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వాజేద్‌.. ఈ జాబితాలో తొలిసారి స్థానం దక్కించుకున్నారు. 43వ ర్యాంకు దక్కించుకున్నారు.
  • క్వీన్ ఎలిజబెత్ 70వ ర్యాంకులో ఉన్నారు.

Also Read: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు

Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి

Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి

Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Allari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP DesamDuvvada Srinivas Interview | టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ | ABPHyderabad 16Cars Fire Accident | హైదరాబాద్ యూసుఫ్ గూడలో అగ్నికి ఆహుతైపోయిన 16కార్లు | ABP DesamPawan kalyan Touches feet of Pastor | పిఠాపురంలో మహిళా పాస్టర్ కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Embed widget