Sleeplessness: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి
ఒకంతట నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా అయితే మీకు పోషకాహారంలోపం ఉందేమో చూసుకోవాలి.
![Sleeplessness: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి Having an insomnia problem? Check for deficiencies in these vitamins Sleeplessness: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/06/922210d583ed86eb692f65c2b9b57274_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నిద్రలేమి... వయసుతో సంబంధం లేకుండా యువతలో కూడా కనిపిస్తున్న సమస్య. అయితే దీన్ని సాధారణంగా కొట్టిపడేయలేం, ఇది రావడానికి వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. చాలా మంది ఒత్తిడి, పనిభారం, డిప్రెషన్ వంటి వాటి వల్లే నిద్రలేమి సమస్య వస్తుందని అనుకుంటారు. కానీ పోషకాహార లోపం వల్ల కూడా నిద్రలేమి ఏర్పడవచ్చు. నిద్ర తక్కువ కావడం వల్ల వచ్చే రోజుల్లో అశాంతిగా, చిరాకుగా అనిపిస్తుంది. అది మానసిక ప్రశాంతతను, బ్యాలెన్స్ ను దెబ్బతీస్తుంది. అంతేకాదు ఇంకా ఎన్నో నష్టాలు కలుగుతాయి.
1. మూడ్ స్వింగ్స్
2. హైపర్ టెన్షన్
3. ఇన్సులిన్ నిరోధకత పెరగడం
4. డయాబెటిస్
5. బరువు పెరగడం
6. ఊబకాయం
7. రోగనిరోధక శక్తి తగ్గడం
ఆ విటమిన్ల లోపం వల్లే...
నిద్రలేమి సమస్య ఏర్పడానికి విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ డి, విటమిన్ ఇ లోపం కూడా కారణమవుతాయి.
విటమిన్ సి
సిట్రస్ పండ్లలో సమృద్ధిగా లభిస్తుంది విటమిన్ సి. ఇది యాంటీఆక్సిడెంట్ల పవర్ హౌస్. రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఇన్ ఫ్లమ్మేషన్ తో పోరాడడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో సహకరిస్తుంది. నారింజలు, బెర్రీలు, మిరియాలు, బ్రకోలీ, నిమ్మకాయ వంటి వాటివలో విటమిన్ సి లభిస్తుంది.
విటమిన్ బి6
ప్రశాంతంగా నిద్రపట్టాలంటే శరీరానికి మెలటోనన్, సెరోటోనిన్ అవసరం. విటమిన్ బి6 లోపం ఉన్న వాళ్లకి నిద్రకు అవసరమయ్యే ఆ హార్మోన్లు ఉత్పత్తి కావు. దీనివల్ల నిద్రలేమి ఏర్పడుతుంది. అరటిపండ్లు, వేరేశెనగలు, ఓట్స్, చికెన్, చేపలు వంటి ఆహారాలను మీ మెనూలో చేర్చుకోండి.
విటమిన్ ఇ
చర్మం, జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ఇ అత్యవసరం. అలాగే నిద్రకు కూడా విటమిన్ ఇ అవసరమే. నిద్రలేమి సంబంధిత జ్ఞాపకశక్తి నష్టాన్ని నివారించేందుకు ఈ విటమన్ కావాలి. బాదం, పొద్దుతిరుగుడు గింజలు, నూనె, గుమ్మడికాయ, బచ్చలికూర, పాలకూర, ఎరుపు క్యాప్సికమ్ వంటివి తింటే విటమిన్ ఇ లోపం ఏర్పడదు.
విటమిన్ డి
సన్‌షైన్ విటమిన్‌గా పిలుచుకునే విటమిన్ డి ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. మానసిక స్థితిని నియంత్రించడంలో, ఇన్ ఫ్లమ్మేషన్‌ను నివారించడంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ డి లోపిస్తే చాలా తక్కువ సమయం పాటూ మాత్రమే నిద్రపడుతుంది. ఎండలో కాసేపు కూర్చోవడం, పుట్టగొడుగులు, సాల్మన్ చేపలు తినడం ద్వారా విటమిన్ డి లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు.
Read Also: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే
Read Also: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి
Read Also: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
Read Also: నల్లకోడి చికెన్, గుడ్లు తింటే ఇన్ని లాభాలా? అందుకేనా దానికంత రేటు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)