Side Effects of Abortion: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే
అబార్షన్ ఇప్పుడు చాలా సాధారణ విషయం అయిపోయింది. ఎంతో మంది గర్భస్రావాలు చేయించుకుంటున్నారు.
అవాంఛిత గర్భాలు ఎక్కవైపోవడం వల్ల అబార్షన్ల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇది చిన్న విషయంలా కనిపిస్తున్న ఆ మహిళ శరీరానికి మాత్రం ఇది పెద్ద మార్పే. అబార్షన్ చేశాక శరీరం చాలా మార్పులకు గురవుతోంది. నిజం చెప్పాలంటే ఇది కూడా ఒక ప్రసవంతో సమానమనే చెప్పుకోవాలి. అబార్షన్ అయ్యాక జరిగే మార్పులు, సైడ్ ఎఫెక్టులు ఇలా ఉంటాయి.
1. రక్తస్రావం అవుతుంది
ప్రసవం అయ్యాక రక్తస్రావం అయినట్టే, అబార్షన్ చేశాక కూడా కొన్ని రోజులు రక్తస్రావం అవుతుంది. ఎంత పరిమాణంలో రక్త బయటికి పోతుందనేది అబార్షన్ చేసిన గర్భం నెలలపై ఆధారపడి ఉంటుంది. రెండు నెలలలోపే అయితే పెద్దగా అవ్వదు. ఆ తరువాత మాత్రం కొన్ని రోజు రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
2. విపరీతమైన నొప్పి
గర్భస్రావం అయ్యక పొత్తికడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి రోజులో కాసేపు వచ్చి పోతుంటుంది. కనీసం మూడు నుంచి అయిదు రోజులు ఈ నొప్పిని భరించాలి. రక్త గడ్డలుగా కూడ బయటికి పోతుంది. గడ్డలను చూసి భయపడకండి. అబార్షన్ ప్రక్రియ సజావుగా జరిగిందనడానికి ఇది సూచన.
3. కోపం, చిరాకు, అసహనం
అబార్షన్ అయ్యాక ఆ మహిళలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్ల ఆమె మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది. కోపం, చిరాకు, అసహనం పెరిగిపోతాయి. ఆ సమయంలో ఆమెను అర్థం చేసుకునే మనిషి పక్కనుండడం అవసరం. అంతేకాదు వికారం, వాంతులు, తలతిరగడం వంటివి కూడా కలుగుతాయి.
4. ఇన్ఫెక్లన్లు సోకే అవకాశం
అబార్షన్ అయ్యాక చాలా జాగ్రత్తగా ఉండాలి. త్వరగా ఇన్ఫెక్షన్లు దాడి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గర్భస్రావం చేసేందుకు గర్భాశయ ముఖద్వారాన్ని (సెర్విక్స్) తెరుస్తారు. అలా తెరుచుకున్న సెర్విక్స్ మళ్లీ ముడుచుకోవడానికి రెండు వారాలు పడుతుంది. కాబట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్లు చేరిన అవి నేరుగా శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యులు సూచించిన యాంటీ బయోటిక్స్ ట్యాబ్లెట్లను వాడుతూ పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా సెక్స్ కు దూరంగా ఉండాలి.
5. గర్భసంచి దెబ్బతినే అవకాశం
అబార్షన్ చేసేందుకు ముడుచుకుని ఉన్న సెర్విక్స్ బలవంతంగా తెరుస్తారు. అంతేకాదు వివిధ పరికరాల ద్వారా ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. కాబట్టి ఆ పరికరాలను జాగ్రత్తగా వాడకపోతే గర్భసంచి గోడలు, సెర్విక్స్ దెబ్బతినవచ్చు. కాబట్టి మంచి వైద్యుల వద్దే ఇలాంటి ప్రక్రియ చేయించుకోవాలి. లేకుంటే ఒక్కోసారి అధికంగార రక్తస్రావమై ప్రాణాల మీదకు వస్తుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి
Read Also: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
Read Also: నల్లకోడి చికెన్, గుడ్లు తింటే ఇన్ని లాభాలా? అందుకేనా దానికంత రేటు...
Read Also: గుడ్డుతో పాటూ వీటిని తినకూడదు, తింటే ఈ సమస్యలు తప్పవు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి